Food Coma: రాత్రి పూట తిన్న వెంటనే నిద్ర పోతున్నారా.. అయితే మీరు వీటిన తినడం మానేయాలి.. లేకుంటే ప్రమాదమే
చాలా మంది రాత్రి(Night) సమయంలో అలా తింటున్నారో లేదో ఇలా నిద్రలో(sleep)కి వెంటనే జారుకుంటున్నారు. ఇది పెద్ద..
చాలా మంది రాత్రి(Night) సమయంలో అలా తింటున్నారో లేదో ఇలా నిద్రలో(sleep)కి వెంటనే జారుకుంటున్నారు. ఇది పెద్దసమస్యగా అనిపించకపోయినప్పటికీ.. ఈ అలవాటు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే తిన్నవెంటనే నిద్రలోకి జారుకోవడానికి ఒక కారణం ఉంది. ఇలా తిన్న వెంటనే నిద్ర ఎందుకు పోతారో తెలుసా.. ఫుడ్ కోమా అనే వ్యాధి వల్ల. ఈ వ్యాధిని వైద్య పరిభాషలో ‘Postprandial’ అంటారు. ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడం వల్లే ఈ వ్యాధి వస్తుంది. దీనివల్ల అలసటకు గురయ్యి వెంటనే నిద్రలోకి జారుకుంటారు. ఇంతేకాదు ఈ సమస్య వల్ల ఒంటికి బద్దకం వస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఏ పని చేయలేరు. చేయాలనిపించదు కూడా.. ఈ సమస్యకు కారణం.. వీరు తిన్న తర్వాత వీరి Blood circulation లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య గురించి బాధ పడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఉంటే పలు ఆహార పదార్థాలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
కొందరికి తిన్న వెంటనే కడుపులో Blood circulation పెరుగుతుందట. దాంతో బ్రెయిన్‌కు బ్లడ్ తక్కువ మొత్తంలో సరఫరా అవుతుందట. ఈ కారణంగానే తిన్న వెంటనే పడుకుంటారని చెబుతున్నారు. ఇది కేవలం వారి అభిప్రాయం మాత్రమే. అయితే మోతాదుకు మించి తింటేనే ఫుడ్ కోమా వస్తుందని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం వెల్లడించాయి. అంటే ఫుడ్ కోమా మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని అర్థమవుతుంది. ఫుడ్ కోమా వ్యాధి బారిన పడకూడదంటే.. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదని చెబుతున్నారు. ఎందుకంటే కొవ్వు ల వల్ల మనకు నిద్రను ప్రేరేపించే కొలిసిస్టోకినిన్ అనే హార్మోన్ పెరుగుతుందట. దీంతో మీరు తిన్న వెంటనే నిద్రలోకి జారుకుంటారని చెబుతున్నారు.
తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నా ఫుడ్ కోమా సమస్య బారిన పడతారని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. అధికప్రోటీన్ ఆహారాల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు మన బాడీలో ట్రిప్లోఫాన్ ఎక్కువయ్యి.. సెరోటోనిన్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. దీంతో మీరు తిన్నవెంటనే నిద్రలోకి జారుకుంటారు. తిన్నవెంటనే నిద్రలోకి జారుకోవడం డయాబెటీస్ కు సంకేతం కూడానట. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్టైతే వెంటనే మీ షుగర్ లెవెల్స్‌ను చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ఆ సమస్య ఫుడ్ కోమా కాదని గుర్తించాలి. అది కేవలం డయాబెటీస్ వల్ల వచ్చిందని అర్థం చేసుకోవాలి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read Also.. Broccoli Health Benefits: బ్రకోలితో బోలెడు లాభాలు.. ఇలా ట్రై చేస్తే మరింత రుచికరం..