Walkbarefoot: రోజూ 5 నిమిషాలు చెప్పులు లేకుండా నడిస్తే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..

Walkbarefoot: చెప్పులు పాదాల్ని బయటి వాతావరణం నుండి రక్షిస్తాయి... కనుక వీటిని పాదరక్షలు అని కూడా అంటారు. చెప్పులు పాదాలను శుభ్రంగా ఉంచుతాయి. అంతేకాదు..

Walkbarefoot: రోజూ 5 నిమిషాలు చెప్పులు లేకుండా నడిస్తే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..
Walking Barefoot
Follow us

|

Updated on: Dec 02, 2021 | 1:48 PM

Walkbarefoot: చెప్పులు పాదాల్ని బయటి వాతావరణం నుండి రక్షిస్తాయి… కనుక వీటిని పాదరక్షలు అని కూడా అంటారు. చెప్పులు పాదాలను శుభ్రంగా ఉంచుతాయి. అంతేకాదు పాదాలకు సరికొత్త అందాలను ఇస్తాయి. చెప్పులు, బూట్లు, పాదుకలు ఇలా సందర్భాన్ని బట్టి పాదాలకు రక్షణ ఇస్తాయని ధరిస్తారు. అయితే ఈ చెప్పులను హిందువులు దేవాలయాలు, పవిత్రమైన ప్రదేశాల్లో ధరించారు. అంతేకాదు కొంత కాలం క్రితం వరకూ ఇంటిలోపల కూడా చెప్పులను ధరించేవారు కాదు.. కానీ రోజు రోజుకి వచ్చిన మార్పుల్లో భాగంగా చెప్పులను ధరించడంలో కూడా మార్పులు వచ్చాయి. ఇంట బయట చిన్న పెద్ద .. సమయం సందర్భం.. పెళ్లిళ్లు, ఫంక్షన్లు అనే తేడా లేకుండా చెప్పులను ధరిస్తున్నారు. అయితే చెప్పులు లేకుండా అప్పుడప్పుడు నడవంవలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైందట. కనుక రోజుకి కొంత సేపు పాదరక్షలు లేకుండా ఒత్తి కాళ్లతో భూమి మీద నడవమని సూచిస్తున్నారు. ఈరోజు చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

* చెప్పులు లేని పాదాల నడక పాదాల్లోని కండరాలను స్థిరంగా ఉండేటట్లు చేస్తాయి. కాళ్లలోని, పాదాల్లోని చిన్న, పెద్ద కండరాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. ఈ న్యూరల్‌ కనెక్షన్ దెబ్బతింటే గాయాలు బాగా తగిలే అవకాశం ఉంది. కనుక కండరాల స్థిరంగా ఉండేలా కొంచెం సేపు ఉత్తి పాదాలతో నడవం మంచిది అని అంటున్నారు. *షూస్‌ ఎక్కువ సమయం ధరించేవారిలో కొంతమందికి పాదాల.. కండరాల మధ్య ఉండే సహజ సిద్ధమైన లింకు దెబ్బతింటుంది. షూ కింద ఉండే బిగ్‌ సోల్‌ వల్ల పాదాల సహజసిద్ధమైన సమతులత దెబ్బతింటుంది. *చెప్పులు లేకుండా ఉత్త పాదాలతో నడిస్తే కాళ్లకు గాయాలు కావట. అంతేకాదు నడక స్థిరంగా ఉంటుందట. శరీర భంగిమ కూడా కరక్ట్‌గా ఉంటుందిట. *చెప్పులు లేకుండా నడిచేవారు శరీరాన్ని సరిగా బ్యాలెన్స చేసుకుంటారట. *మట్టిపైన, ఫ్లోర్ పైన నడవడం వల్ల నరాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. తద్వారా పాదాలు గట్టిపడతాయి *కండరాలు సరిగా పనిచేయకపోతే లిగ్మెంట్స్‌ మీద, ఎముకల మీద, టెన్డెన్స మీద ప్రభావం పడి గాయపడి ప్రమాదం పెరుగుతుంది. *పిల్లలు ఒట్టి పాదాలతో నడిస్తే డయాబెటిస్, ఓబేసిటి సమస్యలు తలెత్తవట. అందుకనే పిల్లలు చెప్పులు లేకుండా నడవడం, ఆటలాడుకోవడం , పరుగెత్తడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. *పిల్లలు చెప్పులు లేకుండా నడవం వలన బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది *పాదాలు, కాళ్లు , కండరాలు పనితీరు సరిగ్గా ఉండాలంటే చెప్పుల్లేకుండా నడవాలి. అప్పుడు కండరాలు బలపడతాయి. అందుకే ఇంట్లో, ఆఫీసులో, ఆరుబయట చెప్పుల్లేకుండా హాయిగా తిరగమంటున్నారు ఆరోగ్య నిపుణులు. *షూలు ధరించే సగటు వ్యక్తుల కంటే ధరించని సగటు వ్యక్తుల పాదాలు చాలా స్ట్రాంగ్ గా , హెల్తీగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన పాదాలకోసం రోజులో కొంతసేపు అయినా చెప్పులు లేకుండా హాయిగా తిరగమని సూచిస్తున్నారు.

గమనిక: చలికాలంలో మటుకు షూస్‌ లేకుండా ఉత్త కాళ్లతో నడవడం, పరిగెట్టడం రెండూ ఏమాత్రం మంచిది కాదని  సూచిస్తున్నారు.

Also Read:  ఆదిలక్ష్మి దేవి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై ఊరేగిన శ్రీ అలమేలు మంగ (photo story)

స్టూడెంట్స్ వాహనంపై ఏనుగు దాడి.. విద్యార్థులు పరుగో పరుగు.. వీడియో వైరల్…