Elephant Attack: స్టూడెంట్స్ వాహనంపై ఏనుగు దాడి.. విద్యార్థులు పరుగో పరుగు.. వీడియో వైరల్…

Elephant Attack: ఎకో ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, ట్రైనీలు ప్రయాణిస్తున్న సఫారీ వాహనంపై ఓ భారీ ఏనుగు దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విద్యార్థుల బృందం..

Elephant Attack: స్టూడెంట్స్ వాహనంపై ఏనుగు దాడి.. విద్యార్థులు పరుగో పరుగు.. వీడియో వైరల్...
Elephant Attack
Follow us

|

Updated on: Dec 02, 2021 | 12:42 PM

Elephant Attack: ఎకో ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, ట్రైనీలు ప్రయాణిస్తున్న సఫారీ వాహనంపై ఓ భారీ ఏనుగు దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విద్యార్థుల బృందం దక్షిణాఫ్రికాలోని లింపోపోలోని సెలటి గేమ్ రిజర్వ్ వద్దనుంచి కారుపై వెళ్తున్న సమయంలో వారు ఓ ఏనుగుల గుంపును చూశారు. అయితే ఈ బృందం ప్రయాణిస్తున్న వాహనంపై ఓ ఏనుగు దాడి చేసింది. విధ్వంసం సృష్టించింది. దీనికి సంబందించిన ఓ వీడియో ఎడ్వార్డ్ అనే ఓ గైడ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో, విద్యార్థులు సఫారీ వాహనం నుండి పారిపోతుండగా, ఏనుగు విధ్వంసం సృష్టించింది. మరో వాహనంలో ఉన్న ఒక గైడ్ “బయటపడండి, బయటపడండి, బయటపడండి” అని అరాస్తున్నాడు. విద్యార్థులు పారిపోవడానికి దారి చూపిస్తున్నాడు.

ఏనుగు దాడి నుంచి తప్పించుకుని తమ ప్రాణాలను దక్కించుకోవడానికి కొంతమంది విద్యార్థులు పారిపోతూ.. తమ  వస్తువులను పడవేసారు. ఇలా ఏనుగు దూకుడు ప్రదర్శించడానికి కారణం.. హార్మోన్ల పెరుగుదలలో ఏర్పడిన అనిశ్చితి అని గైడ్ వివరించాడు.  అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఏనుగు దాడి చేయడానికి ముందు అక్కడ ఉన్న పరిస్థితిని తెలియజేస్తూ.. మరో వీడియో షేర్ చేశాడు.

వాహనం ముందు ఎదురుగా కొన్ని ఏనుగులు వస్తున్నట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది.  ఏనుగులు బాధగా విలపించాయి. వాహనంపై దాడి చేసిన ఏనుగు పొదల్లోంచి బయటకు వచ్చి హఠాత్తుగా వాహనంపైకి దూసుకెళ్లింది.

ఈ ఏనుగు వాహనంపై దాడి చేయడం వలన కారు ఒక వైపు వంగిపోయింది. దెబ్బతిన్నదని ట్వీట్ చేసాడు. అంతేకాదు ఈ కారుకి భీమా ఇస్తారా అంటూ సందేహం కూడా వ్యక్తం చేశాడు.  ఏనుగు దాడిలో “వాహనం దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ వాహనంలో ఉన్న వ్యక్తులెవరూ గాయపడలేదని ఓ అధికారి చెప్పారు.

IOL ట్రావెల్ ఈ సంవత్సరం క్రుగర్ నేషనల్ పార్క్ వద్ద పాల్ క్రుగర్ గేట్ వద్ద ఇలాంటి సంఘటనను నివేదించింది.

అయితే ఈ ఏడాదిలో ఇలాంటి సంఘటన క్రుగర్ నేషనల్ పార్క్ వద్ద పాల్ క్రుగర్ గేట్ వద్ద జరిగిందని ఒకరు గుర్తు చేసుకున్నారు.  ఏనుగుల గుంపు ని క్లోజ్-అప్ షాట్‌లనుతీయడానికి తమ కారునుంచి దిగాలని భావించిన పర్యాటకులపై ఏనుగులు గుంపు దాడి చేసింది.

Also Read:  అనంతపురంలో అఖండ బెనిఫిట్ షో.. బాలయ్య, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్ అంటున్న ఫ్యాన్స్..