రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రపోతున్నారా..? అయితే ఇది మీరు తప్పక తెలుసుకోవలసిన సమాచారం..

| Edited By: Janardhan Veluru

Nov 26, 2022 | 11:38 AM

చాలామంది రాత్రి పూట భోజనం చేసిన వెంటనే నిద్రపోతారు. కొందరు తిన్న తర్వాత కొంచెం దూరం కూడా నడవకుండా అలానే నిద్రపోతారు. ఇలా చేయడం వలన అనేక సమస్యలు శరీరంపై..

రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రపోతున్నారా..? అయితే ఇది మీరు తప్పక తెలుసుకోవలసిన సమాచారం..
Walking After Food
Follow us on

చాలామంది రాత్రి పూట భోజనం చేసిన వెంటనే నిద్రపోతారు. కొందరు తిన్న తర్వాత కొంచెం దూరం కూడా నడవకుండా అలానే నిద్రపోతారు. ఇలా చేయడం వలన అనేక సమస్యలు శరీరంపై ప్రభావం చూపే అవకాశం ఉందని  అనేక మంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత కనీసం కొంత దూరం నడవడం ఆరోగ్యానికి చాలా మంచిందని వారు సూచిస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో చాలా మంది అనారోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడ్డారు. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వారిని వెంటాడుతున్నాయి.

భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవద్దు..

రాత్రి వేళల్లో భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం కంటే కాసేపు లేదా కొంత దూరం నడిస్తే చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లేకపోతే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు వారు. ఎందుకంటే తిన్న వెంటనే నడవకుండా పడుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు. ఫలితంగా ఉదయం కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఫలితంగా శరీరంలో చెడు కొలెస్టరాల్ పేరుకుపోయి బరువు పెరిగేందుకు దారితీస్తుంది. వాస్తవానికి మనం ఆహారం తీసుకున్నాక కాసేపు నడిస్తే శరీరం చురుకుగా పనిచేస్తుంది.

భోజనం తీసుకున్న తర్వాత నడవడం వల్ల ఆహారం వెంటనే జీర్ణం అయి దానిలోని పోషకాలను శరీరానికి అందుతాయి. తద్వారా శరీరానికి కూడా వీలైనంత తొందరగా శక్తి చేకూరుతుంది. ఆహారం కడుపు నుంచి పేగులకు వెళ్లిన టైంలో జీర్ణం కాకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు వస్తాయి. అందుకే భోజనం తర్వాత కనీసం 15 నిమిషాల పాటు నడవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచే మంచి వ్యాయామం. మలబద్ధకం వంటి సమస్య ఎదురవకుండా కూడా ఉపకరిస్తుంది. తిన్నాక నడిస్తే శరీరం యాక్టివ్‌గా ఉండటమే కాక.. ఆహారం బాగా జీర్ణం అవుతుంది. శారీరక శ్రమ లేకుండానే ఎండార్ఫిన్లు వంటి మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి. ఇది శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. కాసేపు నడిచిన తర్వాత పడుకుంటే నిద్ర కూడా మంచిగా పడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..