Health: విటమిన్‌ డీకి క్యాన్సర్‌కు సంబంధం ఏంటి.? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేయడంలో విటమిన్‌ డీ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్‌ డీ లోపం కారణంగా తీవ్రమైన వ్యాధులు వస్తుంటాయి. సరిపడ సూర్యకాంతి లేని కారణంగా ఇటీవల విటమిన్‌ డీ లోపంతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అపార్ట్‌మెంట్స్‌లో జీవించడం, నైట్‌ షిఫ్ట్‌ డ్యూటీల కారణంగా విటమిన్‌ డీ లభించక ఇబ్బందిపడుతున్నారు. దీంతో కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వెంటాడుతాయి...

Health: విటమిన్‌ డీకి క్యాన్సర్‌కు సంబంధం ఏంటి.? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..
Vitamin D Deficiency
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 17, 2023 | 8:54 PM

మనిషి నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్లు అందాల్సిన విషయం తెలిసిందే. ఈ విటమిన్‌ లోపం ఉన్నా వెంటనే శరరంలో మార్పులు మొదలవుతాయి. ఇలా శరీరానికి ఎంతో మేలు చేసే విటమిన్స్‌లో విటమిన్‌ డీ ఒకటి. సాధారణంగా విటమిట్‌ డీ లోపం అనగానే.. ఎముకలకు సంబంధించింది అనే ఆలోచనలో ఉంటాం.

రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేయడంలో విటమిన్‌ డీ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్‌ డీ లోపం కారణంగా తీవ్రమైన వ్యాధులు వస్తుంటాయి. సరిపడ సూర్యకాంతి లేని కారణంగా ఇటీవల విటమిన్‌ డీ లోపంతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అపార్ట్‌మెంట్స్‌లో జీవించడం, నైట్‌ షిఫ్ట్‌ డ్యూటీల కారణంగా విటమిన్‌ డీ లభించక ఇబ్బందిపడుతున్నారు. దీంతో కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వెంటాడుతాయి. అయితే విటమిన్‌ డీ లోపం కారణంగా మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని మీకు తెలుసా.?

విటమిన్‌ డీ లోపం కారణంగా ఎముకుల సాంధ్రత తగ్గుతుంది. దీని కారణంగా ఎముకలు త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇక విటమిన్‌ డీ లోపం కారణంగా గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్‌ డి లోపం వల్ల గుండె వ్యాధులు వచ్చినట్లు గుర్తించారు. దీర్ఘకాలిక గుండె వైఫల్యంతో బాధపడుతున్న చాలా మందిలో విటమిన్‌ డి లోపం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో విటమిన్‌ డిని పెంచుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

విటమిన్‌ డీ లోపం కారణంగా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విటమిన్‌ డీ లోపం కారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌, బ్లడ్‌ క్యాన్సర్‌, ఎసోఫాగియల్‌, గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పలువురిపై జరిపిన పరిశోధనల అనంతరం ఈ విషయాలను వెల్లడించారు.

విటమిన్‌ డీ లోపం ఎలా తెలుసుకోవాలంటే..

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో విటమిన్‌ డీ లోపాన్ని సూర్యరక్ష్మికి ఎక్స్‌పోజ్‌ కావడం ద్వారా చెక్‌ పెట్టొచ్చు. అయితే తీసుకునే ఆహారం ద్వారా విటమిన్‌ డీ లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఇక విటమిన్‌ డీ లోపం ఉన్నట్లు కొన్ని లక్షణాల ద్వారా తెలసుకోవచ్చు. ఎముకల నొప్పి, తరచుగా బలహీనత, అలసట, కండరాల తిమ్మిరి, ఎముకల పగుళ్లు వంటివి విటమిన్‌ డీ లోపానికి సూచనలుగా నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..