AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin C Benefits: ‘విటమిన్-సి’తో శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

తగినంత విటమిన్-సి తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు. కానీ, శరీరంలో ఈ మూలకం లోపం ఉంటే, దానిని ఎలా గుర్తించవచ్చు? విటమిన్-సికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం..

Vitamin C Benefits: ‘విటమిన్-సి’తో శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!
Vitamin C Foods
Venkata Chari
|

Updated on: Aug 10, 2021 | 7:49 AM

Share

Vitamin C Benefits: విటమిన్-సి మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది ఓ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి బంధన కణజాలాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కీళ్లకు ఎంతో సహాయకంగా పనిచేస్తుంది. ఇదే కాకుండా, విటమిన్ సి న్యూట్రోఫిల్స్ అంటే తెల్ల రక్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇవి ఇన్ఫెక్షన్‌తో పోరాడి, శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలకంగా పనిచేస్తాయి.

విటమిన్-సి శరీరంలో ఐరన్ శోషణ, కొల్లాజెన్, ఎల్-కార్నిటైన్, కొన్ని న్యూరోట్రాన్స్‌మిటర్‌ల ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడంతోపాటు టిబి చికిత్సలో విటమిన్ సి ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్నో పరిశోధనలు సూచించాయి. మొత్తంగా, తగినంత విటమిన్-సి తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు. కానీ, శరీరంలో ఈ మూలకం లోపం ఉంటే, దానిని ఎలా గుర్తించవచ్చు? విటమిన్-సికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం..

విటమిన్ సి లోపానికి సంకేతాలు.. శరీరంలో విటమిన్ సి లోపం వల్ల రక్తహీనత, చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాలు నయం అయ్యే సమయం, పొడిబారడం, చీలిపోవడం, ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యం తగ్గిపోవడం, చిన్న గీతల నుంచి కూడా రక్తం కారడం వంటి అనేక లక్షణాలకు కారణమవుతుంది. అలాగే దంతాలు, జీవక్రియ కార్యకలాపాలు మందగించడం మొదలైనవి. ఈ లక్షణాలు కనిపిస్తే మన శరీరంలో విటమిన్ సి తగ్గినట్లేనని గుర్తించాలి. మన తీసుకునే ఆహారంలో విటమిన్-సి వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాలి.

రోజూ ఎంత విటమిన్ సి అవసరమంటే.. వాస్తవానికి విటమిన్-సి నీటిలో తర్వగా కరుగిపోతుంది. దీని కారణంగా శరీరం ఈ మూలకాన్ని నిల్వ చేసుకోలేకపోతోంది. అటువంటి పరిస్థితిలో, శరీరంలో విటమిన్-సి తగినంత మొత్తంలో ఉండేందుకు ఆహారం లేదా సప్లిమెంట్‌ల ద్వారా విడిగా తీసుకోవడం అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మహిళలకు 75 mg, పురుషులకు 90 mg, గర్భిణీ స్త్రీలకు 85 mg, పాలిచ్చే మహిళలకు 120 mg మోతాదులో ప్రతిరోజూ విటమిన్-సి తీసుకోవాలి.

అధికంగా విటమిన్-సి ఉండే పదార్థాలు.. విటమిన్-సి చాలా పుల్లగా ఉంటుంది. ద్రాక్షపండు, నారింజ, కీవీ, నిమ్మ, అరటి, బ్రోకలీ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, టమోటా, జామ, ఉసిరి, ముల్లంగి ఆకులు, ఎండు ద్రాక్ష, పాలు, బీట్‌రూట్, ఉసిరి, క్యాబేజీతోపాటు క్యాప్సికమ్ మొదలైనవి వాటిల్లో పుష్కలంగా విటమిన్ సి కలిగి ఉంటాయి.

అధికంగా తీసుకోవడం కూడా హానికరం ఎక్కువ మొత్తంలో ఏది తీసుకున్నా.. మన శరీరానికి హానికరమనే గుర్తించాలి. అందువల్ల, విటమిన్-సి కూడా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. విటమిన్-సి అధికంగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ పెరిగి అనేక వ్యాధులకు కారణమవుతుంది. అలాగే విటమిన్-సి అధికంగా తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, గుండెల్లో మంట, తలనొప్పి, నిద్రలేమి మొదలైన సమస్యల ముప్పు పెరుగుతుంది. వీటితోపాటు మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

Also Read: Marburg Virus: ఈ మహమ్మారి సోకితే మృత్యువే.. ఆఫ్రికాలో మరో కొత్త వైరస్.. డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్

Sawan 2021: శ్రావణ మాసంలో సోమవారం ఉపవాసం ఉండేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. ఆశ్రద్ధ చేస్తే అంతే ఇక..