శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే మీకు ఆ విటమిన్ లోపం ఉన్నట్టే.. జాగ్రత్త మరి..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. శాఖాహారులు తరచుగా ఎదుర్కొనే ప్రధాన సమస్య బి12 విటమిన్ లోపం.. ఈ విటమిన్ లోపం ఉంటే.. కొన్ని స్పష్టమైన లక్షణాలు రూపంలో బయట పడుతూ ఉంటుంది.

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే మీకు ఆ విటమిన్ లోపం ఉన్నట్టే.. జాగ్రత్త మరి..
Vitamin B12 Deficiency
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 23, 2024 | 11:29 AM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. శాఖాహారులు తరచుగా ఎదుర్కొనే ప్రధాన సమస్య బి12 విటమిన్ లోపం.. ఈ విటమిన్ లోపం ఉంటే.. కొన్ని స్పష్టమైన లక్షణాలు రూపంలో బయట పడుతూ ఉంటుంది. వాటిని గమనిస్తూ వైద్యుల సూచన మేరకు విటమిన్ బి 12 భర్తీ చేస్తూ ఉండాలి. నాడుల ఆరోగ్యం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, మెదడు పనితీరులకు బి12 అవసరం.. ఈ విటమిన్ లోపిస్తే పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి బి 12 లోపంతో తలెత్తే సమస్యలు ఏంటి..? దీని లోపంతో శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. వీటన్నింటి మీద అవగాహన ఏర్పరచుకోవడం తప్పనిసరి… కావున బి 12 విటమిన్ లోపం ఉంటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోండి..

విటమిన్ బి 12 లోపం ప్రారంభంలో చేతుల్లో, పాదాల్లో సూదులతో పొడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రమైన లక్షణానికి కారణం బి 12 లోపం. ఈ లోపం కారణంగా నాడీ కణాలు సమర్థంగా పనిచేయకపోవచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే నాడులకు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.. కాబట్టి చేతుల్లో, పాదాల్లో సూదులతో గుచ్చుతున్నట్టు అనిపించినా మంటగా అనిపించినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.

అలాగే విటమిన్ బి12 తగ్గితే రక్తంలో ఆక్సిజన్ మోతాదు కూడా తగ్గుతుంది. దీంతో రక్తాన్ని సరఫరా చేయడం కోసం గుండె అవసరానికి మించి కష్టపడాల్సి వస్తుంది. ఈ కారణంగా గుండె దడ పెరుగుతుంది. అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టినా, గుండె వేగంలో హెచ్చుతగ్గులు గమనించినా బి-12 లోపం ఉందని గమనించాలి.

బి 12 లోపంతో బాధపడే వ్యక్తుల చర్మం పాలిపోయి జీవం కోల్పోతుంది. దీనికి కారణం ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గడమే. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి బి12 దోహదపడుతుంది. ఈ విటమిన్ లోపిస్తే రక్తహీనత తలెత్తి, చర్మం పాలిపోతుంది. దాంతో చర్మం లేత పసుపు రంగులోకి మారుతుంది. ఇలా చర్మం రంగు మారితే విటమిన్ బి 12 లోపం ఉందని గ్రహించాలి.

బి12 విటమిన్ లోపం ఉంటే నోటిలో అల్సర్లు, పుండ్లు ఏర్పడతాయి.. అంతేకాకుండా నోట్లో తరచూ పుండ్లు ఏర్పడుతూ.. అవి తగ్గడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. ఇలా పెదవులు నోటి లోపల పుండ్లు వస్తూ ఉంటే విటమిన్ బి12 లోపం ఉందని మనం అర్థం చేసుకోవాలి.

రక్తంలో ఆక్సిజన్ మోతాదు తగ్గడం వల్ల చర్మంలోని రక్తనాళాలకు సరిపడా ఆక్సిజన్ అందక.. చలి పెరుగుతుంది. ఇతరులకు సౌకర్యంగా ఉన్నా.. మీకు అసౌకర్యానికి గురిచేస్తుందంటే విటమిన్ బి12 లోపంగా భావించాలి. చల్లదనాన్ని తట్టుకోలేకపోవడం బి12 లోపంలో కనిపించే మరొక లక్షణం..

కావున ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!