Rubins speech: భారతీయుల సమైక్యతకు ప్రశంసల జల్లు.. అమెరికా వేదికగా అభినందనలు

భిన్నత్వంలో ఏకత్వం మన దేశం గొప్పదనం. అనేక మతాలు, జాతులు, వర్గాలు ప్రజలున్నప్పటికీ కలిసికట్టుగా, సోదర భావంతో జీవించడం భారతీయుల ప్రత్యేకత. ఈ విషయమే ప్రపంచంలో మన దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెడుతోంది. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు సహాయంగా ఉంటూ భారతీయులు జీవనం సాగిస్తున్నారు.

Rubins speech: భారతీయుల సమైక్యతకు ప్రశంసల జల్లు.. అమెరికా వేదికగా అభినందనలు
Nissin Rubin
Follow us
Srinu

|

Updated on: Nov 24, 2024 | 5:15 PM

సమర్థవంతులైన పాలకులు, సమైక్యంగా జీవించే ప్రజల కారణంగా భారతదేశంలో సమైక్య జీవనం సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని మేరీల్యాండ్ లో ఇటీవల జరిగిన ఏఐఏఎం సంస్థ ప్రారంభోత్సవం సందర్బంగా యూదూ భారతీయ, అమెరికన్ అయిన నిస్సిన్ రూబెన్ మన దేశ గొప్పదనాన్ని కీర్తించారు. యూదులతో దేశ సంబంధాలను మెరుగుపర్చడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలను అభినందించారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ మైనారిటీస్ (ఏఐఏఎం) అనే సంస్థను మేరీల్యాండ్ లోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చిలో ఇటీల ప్రారంభించారు. భారతీయ డయాస్పోరాలోని మైనారిటీ కమ్యూనిటీల సంక్షేమాన్ని పెంపొందించడం, ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. దీని ప్రారంభోత్సవంలో రూబిన్ మాట్లాడుతూ దేశంలో యూదులకు ఉన్న స్వేచ్ఛ, ప్రోత్సాహం గురించి వివరించారు.

తాను గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన వాడినని, ఇక్కడ దాదాపు 2 వేల ఏళ్లుగా యూదు వ్యతిరేక సంఘటనలు జరగలేదన్నారు. ఇలా జరగడం బహుశా భారత్ లో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఇజ్రాయెల్ తో గత 30 ఏళ్లుగా ఉన్న సంబంధం సాపేక్షంగా కొత్తది అయినప్పటికీ, యూదు ప్రజలతో బంధాలు మాత్రం పురాతనమైనవని స్పష్టం చేశారు. వాటిని కొనసాగించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. పరమత సహనానికి భారత దేశం ప్రతీక అని రూబెన్ వ్యాఖ్యానించారు. కోల్ కతా లోని 120 ఏళ్ల నాటి యూదు బాలికల పాఠశాల, ముంబై లోని రెండు సాసూన్ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ముస్లిములేనని తెలిపారు.

మిడిల్ ఈస్ట్ దేశాలలో తీవ్రమైన హింసాకాండ జరిగినప్పుడు కూడా కోల్ కతాలోని యూదుల ప్రార్థనా మందిర ప్రాంగణంలోని ఈ పాఠశాలలపై ఒక్క రాయి కూడా పడలేదని, అది దేశంలో మత సామరస్యానికి నిదర్శనమని వెల్లడించారు. పాఠశాలల పరిసరాల్లో ముస్లింలు ఎక్కువగా ఉంటారని, కానీ ఇక్కడ ఎటువంటి ఉద్రిక్తతలు లేవన్నారు. ఇదంతా భారతీయుల గొప్పదనమని కొనియాడారు. ప్రపంచ శాంతి కోసం అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన అవసరాలన్ని రూబెన్ గుర్తుచేశారు. అమెరికా, ఇండియా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇతర భాగస్వామ్య దేశాల ద్వారా సుస్థిర, సంపన్న, సురక్షిత మిడిల్ ఈస్ట్ ను తయారు చేయాలని ఆశించారు. కాగా.. మైనారిటీ అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డుతో (గైర్హాజరు)తో సన్మానించారు. వాషింగ్టన్ అడ్వెంటిస్ యూనివర్సిటీ, ఏఐఏఎం సంయుక్తంగా ఈ అవార్డును ప్రదానం చేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి