Yuzvendra Chahal IPL Auction 2025: చాహల్‌ను రికార్డు ధరకు సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్.. ఏకంగా అన్ని కోట్లా?

Yuzvendra Chahal IPL 2025 Auction Price: ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తోంది. తాజాగా మిస్టరీ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ను పంజాబ్ కింగ్స్ రికార్డు ధరకు సొంతం చేసుకంది. గత సీజన్ లో చాహల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడాడు.

Yuzvendra Chahal IPL Auction 2025: చాహల్‌ను రికార్డు ధరకు సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్.. ఏకంగా అన్ని కోట్లా?
Yuzvendra Chahal
Follow us
Basha Shek

|

Updated on: Nov 24, 2024 | 5:19 PM

మెగా వేలం కావడంతో ప్రతి జట్టులోనూ భారీ మార్పులు ఉంటాయని అంతా భావిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా ఈసారి యుజ్వేంద్ర చాహల్‌ను రిటైన్ చేయలేకపోయింది. దీంతో భారత స్టార్ లెగ్ స్పిన్నర్ మెగా వేలంలో కి వచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా డ్వేన్ బ్రావో రికార్డును బ్రేక్ చేసిన  చాహల్ ఐపీఎల్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి బౌలర్‌గా కూడా నిలిచాడు. అయినా ఈసారి రాజస్థాన్ రాయల్స్ అతన్ని రిటైన్ చేయలేదు. అయితే మెగా వేలంలోకి వచ్చిన చాహల్ పై కాసుల వర్షం కురిసింది. యుజువేంద్ర చాహల్ ఈ ఏడాది వేలంలో రూ. 2 కోెట్ల ధరతో ఎంట్రీ ఇచ్చాడు.  అయితే  పంజాబ్ కింగ్స్ అతనిని ఏకంగా రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది. గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన యుజ్వేంద్ర చాహల్ ఒకప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన బౌలర్. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముంబై ఇండియన్స్‌తో ప్రారంభమైంది. మూడేళ్లు అక్కడే ఉన్నా.. 1 మ్యాచ్ మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. 2014 సంవత్సరాన్ని ఐపీఎల్‌లో అతనికి బ్రేక్ త్రూ అని చెప్పవచ్చు. ‘అన్‌క్యాప్డ్’ చాహల్‌ను RCB కేవలం 10 లక్షల రూపాయలకు తీసుకుంది. ఆ అవకాశం అతడి కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌. ప్రారంభంలో 10 లక్షలు, కానీ RCBలో అతని వేలం 6 కోట్లకు చేరుకుంది. అతను ఏడేళ్లపాటు ఈ ఫ్రాంచైజీలో ఉన్నాడు. అతన్ని 2022లో రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది.

యుజ్వేంద్ర చాహల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 160 మ్యాచ్‌ల్లో 205 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 7.84 మాత్రమే. ఫైఫర్ ఒకసారి వచ్చింది. T20 క్రికెట్‌లో 8 కంటే తక్కువ ఎకానమీతో వికెట్లు తీస్తుంటాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లోనూ భారత్‌ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్‌లలో ఒకడు. 80 మ్యాచుల్లో 96 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

18 కోట్లతో పంజాబ్ జట్టులోకి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..