AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైట్‏లో ఉన్నప్పుడు ఇవి తింటే బరువు పెరుగుతారా ? ఆరోగ్య నిపుణులు ఏం అంటున్నారంటే..

సాధరణంగా బరువు తగ్గడానికి చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం ఎక్కువగా వారి డైట్‏లో నాన్ వెజ్‏కు వెజిటేరియన్ ఐటమ్స్ ఉండేలా చూసుకుంటారు.

డైట్‏లో ఉన్నప్పుడు ఇవి తింటే బరువు పెరుగుతారా ? ఆరోగ్య నిపుణులు ఏం అంటున్నారంటే..
Rajitha Chanti
|

Updated on: Feb 16, 2021 | 7:59 PM

Share

సాధరణంగా బరువు తగ్గడానికి చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం ఎక్కువగా వారి డైట్‏లో నాన్ వెజ్‏కు వెజిటేరియన్ ఐటమ్స్ ఉండేలా చూసుకుంటారు. ఇక నాన్ వెజిటేరియన్స్ కంటే వెజిటేరియన్స్ చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే వెజిటేరియన్ డైట్‏లో కూడా కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే బరువు పెరుగుతారా ? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఎలాంటి పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరలు..

ఆకుకూరల్లో కేలరీలు మరియు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. కానీ వీటిలో పోషక విలువలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ విలువలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలా ఏ ఆకుకూరలైన రోజూ తినడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. క్రమంగా బరువు కూడా తగ్గోచ్చు. డైట్ చేసే సమయంలో ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే దీంతోపాటు నీరు కూడా ఎక్కువగా తాగాలి. చెక్కర శాతాన్ని ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది.

నట్స్..

డైట్ చేసేవారి ఎక్కువగా నట్స్ తీసుకోవడం ఉత్తమం. వీటి వల్ల ఎక్కువగా బలం రావడమే కాకుండా.. వెజిటేరియన్ డైట్ చేసేవారికి ఇవి చాలా హెల్ప్ ఫుల్. వీటిలో కొవ్వు అధికంగా ఉండడం వలన చాలా సమయం వరకు ఏం తినకుండా ఉండగలుగుతారు. సాధరణంగా డైట్ చేసే సమయంలో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వలన సంతృప్తిగా ఉంటారు. వీటివలన ఎక్కువ కేలరీలు ఉన్న ఫుడ్ తినలేరు. అలాగే బరువు పెరగకుండా ఉంటాయి. ప్లాంట్ బేస్డ్ డైట్ చేస్తే ఫాలో అయితే, కొలెస్ట్రాల్, రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి.

బంగాళాదుంపలు..

వాస్తవానికి వీటిలో అధికంగా శాతం ఫైబర్ ఉండకపోయినా.. విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో పొటాషియం మరియు విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అయితే చాలా మంది వీటిని తినడం వలన బరువు పెరుగుతామని సందేహపడుతుంటారు. కానీ వీటిని ఉడకపెట్టి తినడం వలన వీటిలో ఉండే స్టార్చ్ ఆరోగ్యానికి ఉపయోగపడడమే కాకుండా.. బరువు తగ్గడానికి సహయపడుతుంది. అందుకే ఉడికించిన బంగాళ దుంపలు తినడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. అదనపు కేలరీల ఫుడ్ తినకుండా ఉండగల్గుతారు.

బీన్స్..

వీటిలో ఏరకం తీసుకున్న బరువు తగ్గడానికి తోడ్పడతాయి. ఇందులో అధికంగా ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం పాస్పరస్, జింక్ మరియు విటమిన్ బి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే బీన్స్‏ను రోజూ తినడం వలన బరువు తగ్గుతారు. అయితే వీటితోపాటు పండ్లు, ధాన్యాలు, బీన్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండేవాటిని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు.

క్వినోవా..

క్వినోవా కూడా బరువు తగ్గేందుకు సహయపడుతుంది. దీనిలో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, పాస్పరస్, విటమిన్ బి మరియు విటమిన్ ఈ వంటి పోషకాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహయపడటమే కాకుండా.. బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. అంతేకాకుండా వీటిలో గ్లూటెన్ కూడా ఉండదు.. కాబట్టి గ్లూటెన్ అలర్జీలు కూడా తగ్గించుకోవచ్చు. వీటి ప్రత్యేకత ఏమిటంటే క్వినోవా లో మొత్తం తొమ్మిది అమినో యాసిడ్స్ ఉంటాయి. బరువు పెరగకుండా ఎంతో ఆరోగ్యకరంగా శాకాహారులు జీవిస్తున్నారని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ డైట్ లో తక్కువ శాతం కొవ్వు పదార్థాలు ఉంటాయి. దీనివలన కొలేస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. సౌత్ కరోలినా ప్రాంతంలో ఈ డైట్ ను పాటించిన వారు మాంసాహార వారితో పోలిస్తే రెండు రెట్లు బరువు తగ్గారు. నిజానికి వెజిటేరియన్ డైట్ లేదా ప్లాంట్ బేస్ డైట్ చేసేవారు మాంసాహారం తినే వారి కంటే బరువు ఉండవచ్చు కానీ ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంటారు.

Also Read:

Lemon Water Benefits: నిమ్మ‌ర‌సంతో కమ్మనైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకుందాం పదండి..