ఉత్తరేణి మొక్క గురించి ఎంతమందికి తెలుసు..! దీనిని ఎక్కడ వాడాలో కొద్ది మందికే తెలుసు.. అందులో మీరున్నారా..?

Uttareni Health Benefits : మన పూర్వీకుల కాలం నుండి ఉత్తరేణి ఆకులను పలు ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. మనం ఎంతో భక్తితో చేసుకునే

  • uppula Raju
  • Publish Date - 5:02 am, Tue, 23 February 21
ఉత్తరేణి మొక్క గురించి ఎంతమందికి తెలుసు..! దీనిని ఎక్కడ వాడాలో కొద్ది మందికే తెలుసు.. అందులో మీరున్నారా..?

Uttareni Health Benefits : మన పూర్వీకుల కాలం నుండి ఉత్తరేణి ఆకులను పలు ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. మనం ఎంతో భక్తితో చేసుకునే వినాయక చవితి పండుగలో వినాయకుడికి సమర్పించే ఆకులలో ఉత్తరేణి తప్పకుండా ఉంటుంది. ఉత్తరేణి ఆకులు పలు ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ఉత్తరేణి ఆకు రసంతో శరీరంపై దురద, పొక్కులు, పొట్టు రాలడం వంటి సమస్యలకి చెక్ పెట్టవచ్చు.

ఉబ్బసం దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపైన వేసి ఆ పొగ పీల్చితే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిద చేసి దానిని ఆముదముతో కలిపి గజ్జి, తామర ఉన్నచోట లేపనంగా చేయడం వల్ల అవి క్రమంగా తగ్గి పోతాయి. కందిరీగలు, తేనెటీగలు, తేళ్లు కుట్టినప్పుడు ఆ ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగ్గుతాయి.

పంటి నొప్పి ఎక్కువగా ఉంటే ఉత్తరేణి గింజల పొడిని, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం అన్నింటినీ కలిపి ముద్దగా నూరి ఆ పేస్టును పంటిపై పెట్టుకోవడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. చిగుళ్ల నుండి రక్తం కారడం ఆగిపోతుంది. శరీరంలో ఉండే కొవ్వు కరగాలంటే ఉత్తరేణి ఆకుల రసంలో నువ్వుల నూనె వేసి బాగా మరిగించి పొట్ట మీద రాస్తే క్రమంగా కొవ్వు కరిగిపోతుంది.

AP SEC Orders : మార్చి10ని సెలవుదినంగా ప్రకటించాలి..! కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ఎస్‌ఈసీ