Monkeypox: మంకీపాక్స్ వైరస్ గురించి షాకింగ్ విషయాలు.. వాటిపై వైరస్ నెలల తరబడి ఉంటుంది: అధ్యయనంలో స్పష్టం
Monkeypox: గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం..
Monkeypox: గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం మంకీపాక్స్ భయపెడుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ మంకీపాక్స్ వైరస్ వ్యాపించింది. ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా, మంకీపాక్స్, టొమాటో ఫ్లూ వంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ వ్యాధులు ప్రజల ఆనందాన్ని, శాంతిని దూరం చేశాయి. కరోనావైరస్ చాలా మంది ప్రాణాలను తీసివేసింది. ఇప్పుడు దేశంలో మంకీపాక్స్ వైరస్ ప్రజలను వణికిస్తోంది. ఈ వైరస్ శరీరంపై దద్దుర్లు కనిపించడం ప్రారంభం అవుతాయి. అధిక జ్వరం లేదా శరీర నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపించడం మొదలవుతాయి. మంకీపాక్స్ చికిత్స గురించి తెలుసుకోవడానికి లేదా సరిగ్గా తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం వచ్చింది. అందులో ఈ వైరస్ నెలల తరబడి ఒకే చోట ఉంటుందని నిపుణులు గుర్తించారు.
యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నుండి ఒక నివేదిక వచ్చింది. ఈ వైరస్ ఉపరితలంపై నెలల తరబడి ఉంటుందని వెల్లడించింది. నివేదిక ప్రకారం.. మంకీపాక్స్ వ్యాధి బారిన పడిన వ్యక్తి దుప్పటి, మంచం మీద ఈ వైరస్ కొన్ని నెలల వరకు ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. అలాగే కాఫీ యంత్రం, కంప్యూటర్ మౌస్, ఉపరితలంపై ఎక్కువ కాలం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
వ్యాప్తి చెందకుండా నిరోధించాలంటే..
మీరు వ్యాప్తి చెందకుండా నిరోధించాలనుకుంటే అన్ని రకాల ఉపరితలాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని CDC చెబుతోంది. ఇంట్లోని అన్ని వస్తువులను, నేలపై ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమంటున్నారు. రసాయన పదార్థాలతో ఎప్పటికప్పుడు ప్రతి ప్రదేశాన్ని శుభ్రం చేస్తూ ఉంచాలంటున్నారు. అంతే కాకుండా, ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి దూరంగా ఉండాలని, అతన్ని తాకకూడదని సూచిస్తున్నారు. మంకీపాక్స్ వైరస్ దాదాపు 92 దేశాల్లో వ్యాపించిందని, ఇప్పటివరకు దాదాపు 35000 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా ప్రకటించింది.
ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ఆరోగ్యం సంస్థలు చెబుతున్నాయి. పుల్లని పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలతో నిండిన ఆహారాలు లేదా పండ్లను తినండి. ఇది కాకుండా, ప్రతిరోజూ ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగండి. చురుకుగా ఉండటానికి యోగా వంటి అసనాలను చేయాలంటున్నారు నిపుణులు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి