AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus vaccine: ఆ కోవిడ్ టీకాలను వెంటనే ఆపేయాలి.. దాని కారణంగా ఎన్ని ప్రమాదాలో తెలుసా! పరిశోధకులు చెబుతున్న అంశాలివి..

కోవిడ్ mRNA వ్యాక్సినేషన్ కు సంబంధించిన ప్రచారం చేసిన విషయాల్లో వాస్తవం లేదన్నారు. పైగా వీటిని వేసుకున్న యువకులు, పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలతో పాటు మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించినట్లు వివరించారు.

Coronavirus vaccine: ఆ కోవిడ్ టీకాలను వెంటనే ఆపేయాలి.. దాని కారణంగా ఎన్ని ప్రమాదాలో తెలుసా! పరిశోధకులు చెబుతున్న అంశాలివి..
Covid Vaccine
Madhu
|

Updated on: Feb 03, 2023 | 4:00 PM

Share

COVID mRNA వ్యాక్సిన్‌ను నిలిపివేయాలని కోరుతున్న ఆరోగ్య నిపుణుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ బలపడుతోంది. ఇటీవల, MIT ప్రొఫెసర్ రెట్సెఫ్ లెవి యువతలో mRNA వ్యాక్సిన్‌లు కలిగించే హానిని తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. అనలిటిక్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, హెల్త్ సిస్టమ్స్, ఫుడ్ & అగ్రికల్చర్ సిస్టమ్స్, మాన్యుఫ్యాక్చరింగ్ & సప్లై చైన్ మేనేజ్‌మెంట్ చేసిన ట్వీట్ ని ఆయన యథాతథంగా షేర్ చేశారు. అందులో ఇలా ఉంది.. ‘ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌లు ముఖ్యంగా యువతలో అనేక తీవ్ర ఆరోగ్య సమస్యలు సృష్టించడంతో పాటు మరణానికి దారితీస్తున్నాయి. వాటిని ఇవ్వడం వెంటనే మానేయాలి!’ దీంతో పాటు ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఇప్పటి వరకూ ఒక మిలియన్ వ్యూస్ సాధించింది. దానిలో ఏమని రాశారంటే.. అన్ని కోవిడ్ mRNA వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లు తక్షణమే ఆగిపోవాలి’ అని కోట్ చేశారు. అందుకు సంబంధించిన కారణాలను ఆయన వీడియోలో వివరించారు. ఆయన ఏం చెప్పారంటే..

సమర్థత లేదు..

కోవిడ్ mRNA వ్యాక్సినేషన్ కు సంబంధించిన ప్రచారం చేసిన విషయాల్లో వాస్తవం లేదన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకువచ్చేటప్పుడు చేసిన వాగ్దానాలు ఏమి నెరవేరడం లేదన్నారు. పైగా వీటిని వేసుకున్న యువకులు, పిల్ల ల్లో అనేక ఆరోగ్య సమస్యలతో పాటు మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించినట్లు వివరించారు.

కార్డియాక్ అరెస్ట్..

ఈ కోవిడ్ mRNA టీకాల ప్రభావంతో యువకుల్లో ఆకస్మిక గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్ కు ఆస్కారం చాలా ఎక్కువని నిర్ధారించామని ప్రోఫెసర్ చెప్పారు. ముఖ్యంగా ఈ టీకా మయోకార్డిటిస్, గుండె వాపునకు కారణమవుతుందని పేర్కొన్నారు. 2021 లోనే దీనికి సంబంధించిన ఆనవాళ్లతో ప్రమాదాన్ని గుర్తించామని, తర్వాత దీనిని నిర్ధారించుకునేందుకు ఇశ్రాయేల్ లోని ఈఎంఎస్ డేటాను విశ్లేషించామన్నారు. అవన్నీ తన వాదనను బలపరిచే విధంగానే ఉన్నాయని వివరించారు.

కార్డియాక్ అరెస్ట్లు 25% పెరుగుదల..

2018 నుంచి EMS డేటా ను విశ్లేషించగా.. దానిలో 16 నుండి 39 సంవత్సరాల వయస్సులో కార్డియాక్ అరెస్ట్లు అవుతున్న వారి సంఖ్య 25% పెరుగుదలను గుర్తించామన్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి మరొక అధ్యయనం ప్రకారం టీకా-ప్రేరిత మయోకార్డిటిస్ ఉన్న పిల్లల రక్తంలో కనుగొనబడిందన్నారు. అలాగే టీకా పొందిన తర్వాత మరణించిన వ్యక్తుల శవపరీక్షలు నిర్వహించగా.. వారిలో ఎక్కువగా టీకా-ప్రేరిత మయోకార్డిటిస్ వల్ల మరణం సంభవించిందని తేలిందన్నారు. ఈ బలమైన సాక్ష్యాల కారణంగా ఈ వైద్య ఉత్పత్తులను మార్కెట్ నుండి ఉపసంహరించుకోవడం, అన్ని mRNA టీకా ప్రోగ్రామ్‌లను నిలిపివేయడం తప్ప వేరే ఆలోచన ఏమి లేదని వారు చెప్పారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..