Health Tips: మీ గోళ్లలో ఈ మార్పులు కనిపించాయా.. అయితే ఈ వ్యాధులకు సంకేతమే..!

మీ గోర్లు పసుపు, తెలుపు లేదా ఏదైనా మచ్చలు కలిగి ఉంటే, మీ ఆరోగ్యానికి సంబంధించిన ఈ సమస్యలు ఉండే అవకాశం ఉంది. మీరు ఈ లక్షణాలను విస్మరించకూడదు.

Health Tips: మీ గోళ్లలో ఈ మార్పులు కనిపించాయా.. అయితే ఈ వ్యాధులకు సంకేతమే..!
White Spots In Nails
Follow us
Venkata Chari

| Edited By: Phani CH

Updated on: Dec 30, 2021 | 9:28 AM

Health Tips: మీ గోళ్ల ఆకృతి, రంగు మీ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తాయి. మీ గోళ్లను చూస్తే మీ ఆరోగ్యం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. గోళ్ల ఆకృతిని, రంగును చూసి చాలా మందికి గోళ్ల ఆరోగ్యం గురించి ఒక ఆలోచన వస్తుంది. కొంతమందికి గోళ్లు పసుపు, నలుపు, తెలుపు రంగులోకి మారడం మీరు గమనించి ఉంటారు. అదే సమయంలో, కొంతమంది వ్యక్తుల గోళ్ళలో నీలం లేదా నలుపు గీతలు వస్తాయి. దీని వల్ల గోళ్లు బలహీనంగా మారి విరిగిపోతాయి. గోళ్లలో వచ్చే మార్పులు సాధారణమైనవి కావు. ఇది అనేక రకాల వ్యాధులను సూచిస్తుంది. మీ గోరులో ఎలాంటి మార్పులు దేనిని సూచిస్తుందో.. ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1- గోళ్ల ఎరుపు రంగు- మీ శరీరంలో ఎక్కడో మంట లేదా లూపస్ వ్యాధి ఉంటే, మీ గోళ్ల రంగు మారవచ్చు. అటువంటి పరిస్థితిలో ఎరుపుగా మారే అవకాశం ఉంది.

2- గోరు పసుపు రంగులోకి మారడం- గోరు రంగు పసుపుగా మారితే అది ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు సంకేతం. ఇది కాకుండా, థైరాయిడ్, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధిని కూడా సూచిస్తుంది.

3- గోళ్లపై తెల్లటి మచ్చలు- కొంతమందికి గోళ్లపై తెల్లటి మచ్చలు వస్తాయి. దీన్నిబట్టి మీ శరీరంలో విటమిన్ బీ, ప్రొటీన్, జింక్ లోపం ఉందని అర్థం చేసుకోవచ్చు.

4- గోరులో నీలం, నలుపు మచ్చలు- గోరులో నీలం, నలుపు మచ్చలు ఉంటే, శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడంతో గోరులో నలుపు లేదా నీలం మచ్చలు ఏర్పడతాయి. కొంతమంది గుండె జబ్బులు వచ్చిన తర్వాత కూడా గోళ్ల రంగు మారే అవకాశం ఉంది.

5- గోరుపై తెల్లటి గీత- మీ గోరుపై తెల్లటి చారలు కనిపిస్తే, అది శరీరంలో కిడ్నీ లేదా కాలేయ సంబంధిత వ్యాధికి సంకేతం కావచ్చు. అంతే కాకుండా గోరులో తెల్లటి గీత ఉండడం కూడా హెపటైటిస్ వంటి వ్యాధికి సంకేతంగా నిలుస్తుంది.

6- గోళ్లు విరగడం- చాలా సార్లు గోర్లు బలహీనమైన తర్వాత, అవి విరిగిపోతాయి. దీనితో మీరు శరీరంలోని అనేక వ్యాధుల సంకేతాలను కూడా అర్థం చేసుకోవచ్చు. మీ గోళ్లలో ఈ సమస్య ఉంటే, శరీరంలో రక్తం లేకపోవడం లేదా థైరాయిడ్ వంటి వ్యాధి ఉండే అవకాశం ఉంది.

Also Read: Health Tips: లైంగిక శక్తిని పెంచడంలో ఈ ఫుడ్స్ అద్భుతంగా పని చేస్తాయి.. అవేంటంటే..!

Skin Care: శరీరంపై మొటిమలతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే