AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Exclusive: ప్రాణాలు తీసేస్తున్న రక్తం కొరత..నిండుకున్న బ్లడ్ బ్యాంకుల పరిస్థితిపై టీవీ9 ప్రత్యేక కథనం

TV9 Exclusive: కరోనా మహమ్మారి వ్యవస్థలపై మామూలుగా దాడి చేయడంలేదు. శరీరాల్లోకి ప్రవేశించీ ప్రాణాలు తీస్తోంది. లేకపోయినా ప్రాణాల మీదకు తెస్తోంది. మరణశాసనం రాయడమే కోవిడ్ ప్రధాన లక్ష్యంగా మారిపోతున్నట్టు కనిపిస్తోంది.

TV9 Exclusive: ప్రాణాలు తీసేస్తున్న రక్తం కొరత..నిండుకున్న బ్లడ్ బ్యాంకుల పరిస్థితిపై టీవీ9 ప్రత్యేక కథనం
Tv9 Exclusive
KVD Varma
|

Updated on: Jun 08, 2021 | 4:04 PM

Share

TV9 Exclusive: కరోనా మహమ్మారి వ్యవస్థలపై మామూలుగా దాడి చేయడంలేదు. శరీరాల్లోకి ప్రవేశించీ ప్రాణాలు తీస్తోంది. లేకపోయినా ప్రాణాల మీదకు తెస్తోంది. మరణశాసనం రాయడమే కోవిడ్ ప్రధాన లక్ష్యంగా మారిపోతున్నట్టు కనిపిస్తోంది. కరోనా సోకకుండా ఎలా ప్రాణాల మీదకు తెస్తుంది అనే అనుమానం అవసరం లేదు. కరోనా దెబ్బతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా రక్తానికి కొరత ఏర్పడింది. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిలువలు పూర్తిగా అడుగంటి పోయాయి. ఎంతలా అంటే.. విశాఖపట్నం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో కేవలం 20 యూనిట్ల బ్లడ్ కూడా ప్రస్తుతం నిలువలేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు రక్తం కొరతను చెప్పడానికి.

రక్తం ఎవరికి అవసరం అవుతుంది..

ప్రధానమైన ఆపరేషన్లు చేయించుకునే వారికీ.. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి అధిక రక్త స్రావం జరిగిన వారికీ, తలసేమియా రోగులకు ముఖ్యంగా రక్తం అవసరం అవుతుంది. వీరిలో ఆపరేషన్లు అవసరం అయ్యే వారికి ముందుగా సర్జరీ తేదీలను నిర్ణయించుకుని ఉంటారు. కాబట్టి ఆ సమయానికి రక్తాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి బంధువులలో ఎవరినైనా కోరి రక్తదానం చేయమని చెప్పి సర్జరీ సమయానికి అవసరమైన రక్తం ఏర్పాటు చేసుకునే వెసులు బాటు ఉంటుంది. ప్రమాదాల బారిన పడి రక్తం కోల్పోయిన వారి ప్రాణాలు నిలబెట్టాలంటే వెంటనే రక్తం వారి శరీరాల్లోకి ఎక్కించాల్సి ఉంటుంది. ఆ సమయానికి రక్తం దొరక్కపోతే ప్రమాదం బారిన పడిన వారిని బ్రతికించడం కష్టం. ఒక వేళ ఇటువంటి వారి బంధువులు ఎవరైనా అక్కడ అందుబాటులో ఉంటె కొంతవరకూ వారిని రక్షించే అవకాశం ఉంటుంది. కానీ, తలసేమియాతో బాధపడే వారికి మాత్రం ఎటువంటి పరిస్థితిలోనూ నిత్యం రక్తం ఇవ్వాల్సిందే. ఎందుకంటే, ఈ రోగుల్లో రక్తం తయారయ్యే వ్యవస్థ దెబ్బతిని ఉంటుంది. అందుకే బయట నుంచి రక్తం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. దీంతో తప్పనిసరిగా వీరికి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఏపీలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 18 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో వీటన్నిటిలోనూ కలిపి సుమారు 400 వందల యూనిట్లు మాత్రమె రక్తం అందుబాటులో ఉంది. ఇక తెలంగాణా రెడ్ క్రాస్ వద్ద కేవలం 300 యూనిట్ల రక్తమే అందుబాటులో ఉంది. ఈ లెక్కలు చాలు ప్రస్తుత ఆందోళనకర పరిస్థితిని వివరించడానికి. నిజానికి ప్రతి నేలా మూడువేల యూనిట్ల వరకూ రక్తాన్ని సేకరిస్తుంటాయి బ్లడ్ బ్యాంకులు. కానీ, ఇప్పుడు కనీసం 30 యూనిట్లను సేకరించాదమూ కష్టంగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణంగా కరోనా అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే, కరోనాతొ మూడు కారణాల వల్ల రక్తదాతలకు కొరత ఏర్పడింది. రక్తదానం చేస్తే కరోనా ఎక్కడ వస్తుందో అనే భయంతో రక్తదాతలు వెనకడుగు వేస్తున్నారు. కరోనా వచ్చిన వారు కనీసం నాలుగు నుంచి 6 వారాల పాటు రక్త దానం చేయడానికి వీలు పడదు. ఇక మూడో కారణం కరోనా వ్యాక్సిన్. వ్యాక్సిన్ వేసుకున్నవారు కనీసం ఎనిమిది వారాల పాటు రక్తదానం చేయకూడదు. ఈ మూడు కారణాలతోనూ బ్లడ్ బ్యాంకులు రక్తం కొరతను ఎదుర్కుంటున్నాయని చెబుతున్నారు. రక్తదాతలకు ఫోన్లు చేసినా ప్రస్తుతం ఎవరూ స్పందించడం లేదని చెబుతున్నారు రెడ్ క్రాస్ సొసైటీ కో ఆర్డినేటర్ డీవీఎన్ కుమార్. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తం లేకపోతె ప్రాణాలు కోల్పోవలసిందే. వారికి తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది అని ఆయన చెబుతున్నారు.

కరోనా నేపధ్యంలో బ్లడ్ బ్యాంకుల్లో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని ఆయన చెబుతున్నారు. భయపడకుండా రక్త దానం చేసి ప్రాణాలు నిలబెట్టాలని కోరుతున్నారు. ఒకవేళ అటువంటి భయం ఉన్నవారు తమను సంప్రదిస్తే వారి వద్దకే బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వెళ్లి రక్తాన్ని సేకరిస్తారని కుమార్ చెబుతున్నారు. అంతేకాకుండా, వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకున్న వారు ముందుగా రక్తదానం చేసి తరువాత వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. అసలే కరోనా ముప్పుతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారనీ.. ఇప్పుడు ఈ రక్తం కొరత తో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందనీ కుమార్ చెబుతున్నారు. రక్తదాతలు పరిస్థితిని అర్ధం చేసుకుని రక్త దానానికి ముందుకు రావాల్సి ఉందని ఆయన చెబుతున్నారు. రక్తం కొరతతో ఏర్పడిన ఇబ్బందులపై టీవీ9 ఇచ్చిన ప్రత్యెక కథనం ఇది..

Also Read: TV9 effect: కరోనా మందులనూ వదలని బ్లాక్ మార్కెటింగ్ దందా.. టీవీ 9 ‘నిఘా’ తో దుమ్ము దులుపుతున్న పోలీసులు

TV9 CAMPAIGN VACCINATE ALL: వేగంగా సాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్.. ఫలిస్తున్న టీవీ9 ‘అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం’ ప్రచారం!