AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soya Chunks Benefits: ఈ ముక్కలు తింటే గుండెకు మస్తు మంచిది..! తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు..!

సోయా ముక్కలు చాలా సులభంగా దొరికే ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం. వీటిని బిర్యానీ, కూరలు, పులావ్, ఫ్రైడ్ రైస్, సలాడ్ వంటి వంటల్లో వేసి తినడం చాలా తేలిక. శాకాహారులకు మాంసం తినకుండానే శక్తినిచ్చే ఆహారంగా సోయా ఉపయోగపడుతుంది. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రోజూ వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.

Soya Chunks Benefits: ఈ ముక్కలు తింటే గుండెకు మస్తు మంచిది..! తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు..!
Soya Chunks
Prashanthi V
|

Updated on: May 28, 2025 | 2:25 PM

Share

సోయాలో ఉండే పోషకాల వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే గుణాన్ని కలిగి ఉంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. గుండెపోటు, రక్తనాళాలు గట్టిపడటం వంటి సమస్యలకు ఇది ఒక సహాయకారి ఆహారంగా చెప్పవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే గుండె బలంగా ఉండాలి.. కాబట్టి సోయా ముక్కలు ఆ దిశగా తోడ్పడతాయి.

శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారికి సోయా ముక్కలు మంచి పరిష్కారం. వీటిలో ఉండే ఐసోఫ్లేవోన్ అనే పదార్థం శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. ఇది శరీరాన్ని తేలికగా ఉంచడానికి సహాయపడుతుంది. డైట్ పాటిస్తున్నవారు వీటిని తింటే ఆకలిని నియంత్రించుకోవచ్చు.

సోయా ముక్కలు ఫైబర్ అధికంగా కలిగిన ఆహారం. ఇది జీర్ణక్రియకు చాలా అవసరం. మలబద్ధకాన్ని తగ్గించే గుణం ఇందులో ఉంది. రోజూ తినే ఆహారంలో కొంతమేర సోయా చేర్చితే కడుపు సమస్యలు తగ్గుతాయి. ఫైబర్ వల్ల శరీరానికి అవసరమైన శుద్ధి ప్రక్రియలు సజావుగా జరుగుతాయి.

మధుమేహం ఉన్నవారు తినే ఆహారాన్ని శ్రద్ధగా చూసుకోవాలి. సోయా ముక్కల్లో ఉండే ఐసోఫ్లేవోన్ అనే పదార్థం చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది. కొన్ని వైద్య పరిశోధనల ప్రకారం రక్తంలో చక్కెర స్థాయి నియంత్రితంగా ఉండాలంటే సోయా ఉపయోగపడుతుంది. ఇది మధుమేహ రోగులకు మేలు చేసే ఆహారం.

సోయా ముక్కల్లో ఉండే ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని శాఖాహార చికెన్ అంటారు. ఇది నాన్‌వెజ్ తినని వారికి శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. శరీర పెంపుకు అవసరమైన ప్రోటీన్ అందించే ఈ ఆహారాన్ని పిల్లలూ, పెద్దవాళ్ళూ తినొచ్చు. వ్యాయామం చేసే వారు శక్తిని పొందాలనుకునే వారు దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు.

రోజుకు ఒకసారైనా సోయా ముక్కలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వీటిని ముందుగా తడి చేసి బాగా ఉడకబెట్టి వండితే రుచికరంగా ఉంటాయి. వంటల్లో వీటిని వేయడం వల్ల ఆహారానికి స్పెషల్ టేస్ట్ కూడా వస్తుంది. సోయా ముక్కలు తీసుకోవడంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు.

సోయా ముక్కలు రుచి కలిగినవి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. గుండె ఆరోగ్యం బాగుండాలన్నా, బరువు తగ్గాలన్నా, జీర్ణక్రియ మెరుగవ్వాలన్నా, చక్కెర స్థాయి తగ్గించాలన్నా, శక్తివంతమైన ప్రోటీన్ అందాలన్నా సోయా ముక్కలు సరైన ఎంపిక.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..