Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో తినాల్సిన ఆరోగ్యకరమైన పండ్లు ఇవే..! మరి మీరు తింటున్నారా..?

వేసవి కాలం అంటే చల్లని డ్రింక్ లు, నీరు ఎక్కువగా తాగడం, ఒంటిని హైడ్రేట్‌గా ఉంచుకోవడం ముఖ్యమైన పనిగా మారుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు కొంతమంది కూల్‌డ్రింక్స్‌ను ఆశ్రయిస్తే, మరికొంతమంది సహజంగా హైడ్రేట్ అయ్యే పండ్లను తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. వేసవిలో శరీరాన్ని తేమతో నింపుకోవడానికి వేడిని తట్టుకునేందుకు కొన్ని ప్రత్యేకమైన పండ్లు చాలా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో తినాల్సిన ఆరోగ్యకరమైన పండ్లు ఇవే..! మరి మీరు తింటున్నారా..?
Healthy Fruits
Follow us
Prashanthi V

|

Updated on: Mar 31, 2025 | 7:04 AM

వేసవి రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పండు మామిడి. ఇది రుచి పరంగా ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మామిడిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. మామిడి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీరానికి తగిన శక్తిని అందించడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది.

వేసవి వేడిని తట్టుకోవాలంటే పుచ్చకాయ తినడం అత్యుత్తమమైన మార్గం. ఈ పండులో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. దీంతో శరీరాన్ని తేమతో నింపి వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ సి, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

పైనాపిల్ పుల్లటి రుచితో మిమ్మల్ని ఆకర్షించడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో తరచుగా వచ్చే శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో కూడా పైనాపిల్ ఉపయోగపడుతుంది.

ఈ చిన్నపాటి పండ్లు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. లిచీ పండ్లు తినడం ద్వారా శరీరంలో మలినాలను తొలగించుకోవచ్చు. అలాగే వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఇవి సహాయపడతాయి.

బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫోలేట్ అధికంగా ఉంటాయి. వేసవిలో తరచుగా ఎదురయ్యే జీర్ణ సమస్యలను తగ్గించడానికి బొప్పాయి ఎంతో ఉపయోగకరం. ఇందులోని నేచురల్ ఎంజైమ్‌లు, ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా పనిచేస్తాయి.

తర్బూజా పండ్లు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో ఎంతో సహాయపడతాయి. ఈ పండులో పొటాషియం, విటమిన్ సి, నీరు అధికంగా ఉంటాయి. శరీరంలో నీటి స్థాయిలను సమతుల్యం చేసేందుకు వేడికి లోనవ్వకుండా ఉండేందుకు తర్బూజా తినడం చాలా మంచిది.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటి బెర్రీలు శరీరంలో వ్యర్థాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.

వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది సహజ ఎలక్ట్రోలైట్‌గా పని చేసి శరీరాన్ని తేమతో నింపుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

వేసవిలో మజ్జిగ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా వేడి వల్ల వచ్చే నీరసం, అలసట వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కూల్‌డ్రింక్స్‌ కన్నా సహజమైన పండ్లను తినడమే ఉత్తమం. పై పేర్కొన్న పండ్లు తింటే శరీరానికి తగినంత తేమ లభించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.

పట్టపగలు కేంద్ర మంత్రి మనుమరాలు దారుణ హత్య.. ఏం జరిగిందంటే?
పట్టపగలు కేంద్ర మంత్రి మనుమరాలు దారుణ హత్య.. ఏం జరిగిందంటే?
నదిలో దూకిన మహిళ.. సినిమాను తలపించిన రెస్క్యూ ఆపరేషన్‌!
నదిలో దూకిన మహిళ.. సినిమాను తలపించిన రెస్క్యూ ఆపరేషన్‌!
తెల్లారి స్కూల్ గదిలో కనిపించిన వింత జంతువు.. ఏంటని చూడగా
తెల్లారి స్కూల్ గదిలో కనిపించిన వింత జంతువు.. ఏంటని చూడగా
AP: ఏఐతో రాష్ట్ర ఆదాయం పెండండి! అధికారులతో సీఎం చంద్రబాబు
AP: ఏఐతో రాష్ట్ర ఆదాయం పెండండి! అధికారులతో సీఎం చంద్రబాబు
Viral Video: థాయ్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన స్కూల్‌ పిల్లలు...
Viral Video: థాయ్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన స్కూల్‌ పిల్లలు...
కొప్పున గులాబీలు..నొదుట పెద్ద బొట్టు..తమన్నా లేటెస్ట్ ఫొటోస్ చూశా
కొప్పున గులాబీలు..నొదుట పెద్ద బొట్టు..తమన్నా లేటెస్ట్ ఫొటోస్ చూశా
చిల్ బేబీ.. మిర్రర్ ముందు అందంతో అల్లరి చేస్తున్న రవితేజ బ్యూటీ!
చిల్ బేబీ.. మిర్రర్ ముందు అందంతో అల్లరి చేస్తున్న రవితేజ బ్యూటీ!
ఏం పిల్లరా బాబు.. మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది..!
ఏం పిల్లరా బాబు.. మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది..!
శుక్ర, రవులతో మహా యోగాలు.. ఆ రాశులకు పట్టిందల్లా బంగారం..!
శుక్ర, రవులతో మహా యోగాలు.. ఆ రాశులకు పట్టిందల్లా బంగారం..!
ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే RCB సక్సెస్‌కు కారణం అవుతున్న ప్లేయర్
ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే RCB సక్సెస్‌కు కారణం అవుతున్న ప్లేయర్