Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె ఆరోగ్యానికి ముప్పు..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

అధిక కొలెస్ట్రాల్ గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ ముఖ్యంగా రెండు రకాలు. అవి ఏంటంటే.. LDL (చెడు కొలెస్ట్రాల్) , HDL (మంచి కొలెస్ట్రాల్) ఉన్నాయి. ఫ్యామిలియల్ హైపర్కొలెస్ట్రోలిమియా (FH) కారణంగా కొంతమందిలో జన్యు సమస్యలతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మందులు వంటివి అవసరం.

అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె ఆరోగ్యానికి ముప్పు..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
Heart Disease
Follow us
Prashanthi V

|

Updated on: Feb 03, 2025 | 2:05 PM

కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. వైద్యుల నిపుణుల సూచన ప్రకారం కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుందట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ రెండు రకాలు

  • LDL (లో-డెన్సిటీ లిపోప్రోటీన్) దీన్ని చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఇది ధమనుల్లో పేరుకుపోయి రక్త ప్రసరణను అడ్డుకుని గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
  • HDL (హై-డెన్సిటీ లిపోప్రోటీన్) ఇది మంచి కొలెస్ట్రాల్. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

ఫ్యామిలియల్ హైపర్‌కొలెస్ట్రోలిమియా (FH)

కొంతమందిలో ఇది జన్యుపరమైన సమస్యగా ఉంటుంది. దీని వల్ల చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులలో ఎవరికైనా FH ఉంటే 50 శాతం అవకాశం పిల్లలకు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

FH లక్షణాలు

  • చేతులు, కాళ్లు, మోచేతులు, మోకాళ్ల చుట్టూ కొవ్వు గడ్డలు ఏర్పడటం
  • కళ్ల రెప్పలపై కొవ్వు పదార్థాలు పేరుకోవడం
  • కళ్ల పాపల చుట్టూ తెల్లటి లేదా బూడిద రంగు వలయాలు కనిపించడం

కొలెస్ట్రాల్ తగ్గింపుకు ఫుడ్ డైట్

  • కూరగాయలు, పండ్లు, గింజలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కలిగిన ఆహారం తీసుకోవాలి
  • బాదం, వేరుసెనగలు, కొవ్వు చేపలు (సాల్మన్, ట్యూనా) వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తినాలి
  • ట్రాన్స్ ఫ్యాట్స్ (బేకరీ ఐటెమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్) నివారించాలి
  • అధిక కొవ్వు ఉన్న మాంసం, పూర్తి క్రీమ్ పాలు తగ్గించాలి

వ్యాయామం

వారానికి కనీసం 150 నిమిషాల వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ చేయాలి. ధూమపానం పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది అధిక బరువు సమస్యను నియంత్రించుకోవాలి, ఎందుకంటే అది కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది.

వైద్య సూచనలు

కుటుంబంలో అనారోగ్య చరిత్ర ఉంటే, కేవలం జీవన విధానం మార్పులతోనే కొలెస్ట్రాల్ నియంత్రించలేరు. ఖచ్చితంగా మందులు ఉపయోగించాలి, వీటివల్ల లివర్ లో చెడు కొవ్వు ఉత్పత్తి తగ్గిపోతుంది. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, జన్యు పరీక్షల ద్వారా ఈ సమస్యను ముందుగా గుర్తించుకోవచ్చు

గుండె ఆరోగ్యానికి జాగ్రత్తలు

కొలెస్ట్రాల్ పెరగడం గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మందులు ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రించుకోవచ్చు. ఏమైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.