AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

పాలు, తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పాలలో ప్రోటీన్, తేనెలో సహజమైన చక్కెర ఉండటంతో ఇది ఆకలి నియంత్రణ చేస్తుంది. తేనెలో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్లు కొవ్వును నియంత్రించి, శరీర బరువును తగ్గించేందుకు సహాయపడతాయి. రోజూ తేనె కలిపిన పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!
Honey And Milk Benefits
Prashanthi V
|

Updated on: Feb 03, 2025 | 1:46 PM

Share

పాలు ఆరోగ్యకరమైనవి పైగా పోషకాలతో కూడా నిండి ఉంటుంది. అందుకే వైద్యులు అందరికీ రోజుకు ఒక కప్పు పాలు తాగాలని సూచిస్తారు. పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ పాలు అవసరం. కొందరు సాధారణ పాలు తాగుతారు. మరికొందరు దానికి చక్కెర కలుపుతారు. కొంతమంది పాలలో పసుపు కలిపి తాగుతారు. అదే విధంగా పాలలో తేనె కలిపి తాగేవారు కూడా ఉన్నారు. పాలలో చక్కెరకు బదులుగా తేనె కలపడం ఆరోగ్యానికి మంచిది. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది..?

  • పాలు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తేనె సహజ చక్కెరను అందించి తీపి పదార్థాల పట్ల ఉన్న ఆసక్తిని తగ్గిస్తుంది.
  • తేనెలో ఉన్న ప్రత్యేక పదార్థాలు మెటాబాలిజాన్ని కొంచెం పెంచగలవని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
  • చక్కెర ఉన్న డ్రింక్స్ కు బదులుగా పాలు, తేనెను తీసుకోవడం వల్ల మొత్తం కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

  • మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి రోగనిరోధక శక్తి ఉండాలి. పాలు, తేనె కలిపి తాగడం వల్ల ఈ శక్తి పెరుగుతుంది. పాలలో ఉన్న ప్రోటీన్, కాల్షియం, తేనెలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు అనేక రకాల రోగాల నుండి మనల్ని రక్షిస్తాయి.
  • ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం చాలా మందికి సమస్యగా మారింది. దీన్ని తగ్గించడానికి చాలా మంది వివిధ మార్గాలు ప్రయత్నిస్తున్నారు. పాలు, తేనెను కలిపి తాగడం వల్ల కొవ్వు కరగడంలో సహాయపడుతుంది. కొద్ది రోజుల్లోనే బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. తేనెలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.
  • ప్రస్తుత జీవన విధానంలో పలు కారణాల వల్ల చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మీరు ఒత్తిడిలో ఉంటే పాలు, తేనె మంచి సహజ ఔషధంగా పనిచేస్తాయి. ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. పైగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. పాలలో ఉన్న కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. తేనె నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • మీకు శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే. పాలు, తేనె కలిపి తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది దగ్గు, శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • చర్మం మసకబారితే పాలు, తేనెను కలిపి తాగడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మానికి సహజమైన కాంతిని అందిస్తుంది.

ఇలా పాలు, తేనెను కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి పెరగడం, మానసిక ఒత్తిడి తగ్గడం వంటి లాభాలు లభిస్తాయి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూ పాలలో తేనె కలిపి తాగండి.