Health Alert: ఇలాంటి అలవాట్లు ఉంటే క్యాన్సర్ బారిన పడినట్లే.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోండి..

Cell Phones and Cancer Risk: క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి. దీనిని ముందే గుర్తిస్తే చికిత్స చేయడం సులభం.. లేకపోతే కాలక్రమేణా ఈవ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. దుర్భర జీవనశైలి, కొన్ని చెడు అలవాట్లు

Health Alert: ఇలాంటి అలవాట్లు ఉంటే క్యాన్సర్ బారిన పడినట్లే.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోండి..
Mobile
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 02, 2022 | 6:07 AM

Cell Phones and Cancer Risk: క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి. దీనిని ముందే గుర్తిస్తే చికిత్స చేయడం సులభం.. లేకపోతే కాలక్రమేణా ఈవ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. దుర్భర జీవనశైలి, కొన్ని చెడు అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి. అలాంటి అలవాట్లను వెంటనే మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో క్యాన్సర్‌ వ్యాధులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి కారణం జీవనశైలి,(lifestyle behaviors) మితిమీరిన మద్యపానం, ధూమపానం, వ్యాయామం చేయకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు క్యాన్సర్ వంటి ప్రమాదాలను గణనీయంగా పెంచుతాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌తో ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ మొదలైన అనేక రకాల క్యాన్సర్లతో లక్షలాది మంది బాధితులు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ ఉన్న చోట శరీరంలోని ఆ భాగంలో గడ్డలా తయారవుతుంది. క్యాన్సర్ కారణంగా శరీరంలోని కణాలు చాలా వేగంగా అసాధారణంగా పెరగడం, వేరుఅవడం జరుగుతుంది. దీని కారణంగా శరీరం పూర్తిగా దెబ్బతింటుంది. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే చికిత్స సాధ్యమే. కానీ గుర్తించకపోతే కాలక్రమేణా క్యాన్సర్ ప్రాణాంతకం అవుతుంది. అలాంటి పరిస్థితిలో సరైన జీవనశైలిని అవలంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మర్చిపోయి కూడా కొన్ని తప్పులు చేయకూడదంటున్నారు నిపుణులు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కువగా మొబైల్ ఉపయోగించడం: ఈ రోజుల్లో ప్రజలు రోజంతా మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌పై నిమగ్నమై ఉంటున్నారు. మొబైల్ వ్యసనం కాలక్రమేణా మన సంతోషాన్ని దూరం చేస్తుంది. అయితే మొబైల్ ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎక్కువసేపు మొబైల్‌ని ఉపయోగించడం వల్ల ఫోన్ నుంసీ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ వెలువడుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ మొబైల్స్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది.

ఎక్కువ ఒత్తిడి: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చాలా ఒత్తిడి, ఆందోళన లాంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం క్యాన్సర్ అవకాశాలను పెంచుతుంది. ఎక్కువ ఒత్తిడికి లోనయ్యే వారి రక్తపోటు పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

ధూమపానం-మద్యపానం: ధూమపానం, మద్యం తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇవి ఊపిరితిత్తులు, నోరు, గొంతు మొదలైన అవయవాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇది క్యాన్సర్ రూపంలో ఎప్పుడు మారుతుందో కూడా చెప్పలేం. ధూమపానం, మద్యం ఎక్కువగా తీసుకునే వారి వయస్సు సాధారణ వ్యక్తి కంటే 10 సంవత్సరాలు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఎక్కువ సేపు కూర్చోవడం: కొందరి పని రోజంతా కూర్చోవడం. అలాంటి వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవడం, రోజంతా కూర్చోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదలైనవి వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు ఎండలో ఉండడం వల్ల కూడా చర్మ క్యాన్సర్‌కు కారణం అవుతుంది. ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది.

అధిక ఊబకాయం: అధిక బరువు, ఊబకాయం కారణంగా శరీరంలో వాపు హార్మోన్ స్థాయిలలో మార్పు వస్తుంది. ఇది శరీరంలోని ఇన్సులిన్ వంటి జీవరసాయనాలను ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో క్యాన్సర్ నివారించడానికి మీరు రోజువారీ వ్యాయామం చేయాలి. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలి. ఇందులో అధిక కేలరీలు, అధిక కొవ్వు ఉండదు. మీరు శారీరకంగా ఎంత చురుకుగా ఉంటే, క్యాన్సర్ వచ్చే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి.

Also Read:

Ramadan 2022: ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఖర్జూరంతోనే ఉపవాసం విరమిస్తారు.. కారణమేంటో తెలుసా?

Relationship: భార్యాభర్తలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే విడాకులే..!

Latest Articles