Magnesium Deficiency: మెగ్నీషియం లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే.. బీ కేర్ ఫుల్!
మన శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అనేవి ఎప్పుడూ సమపాలల్లో ఉండాలి. వీటిల్లో ఏవి తక్కువైనా మనిషి అనేకనేక సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీని వల్ల బలహీనంగా మారి.. పలు రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. బాడీకి అన్ని రకాల విటమిన్లు అవసరం. అప్పుడే హెల్దీగా ఉంటారు. అలాగే శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. కండరాలు సరిగ్గా పని చేయాలన్నా.. జీవ రసాయన ప్రక్రియలు సరిగ్గా జరగాలన్నా..

మన శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అనేవి ఎప్పుడూ సమపాలల్లో ఉండాలి. వీటిల్లో ఏవి తక్కువైనా మనిషి అనేకనేక సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దీని వల్ల బలహీనంగా మారి.. పలు రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. బాడీకి అన్ని రకాల విటమిన్లు అవసరం. అప్పుడే హెల్దీగా ఉంటారు. అలాగే శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. కండరాలు సరిగ్గా పని చేయాలన్నా.. జీవ రసాయన ప్రక్రియలు సరిగ్గా జరగాలన్నా మెగ్నీషియం తప్పకుండా అవసరం అవుతుంది. మెగ్నీషియం వల్ల సరైన విధంగా ఉండటం వల్ల నాడీ వ్యవస్థ అనేది అదుపులో ఉంటుంది. బాడీలో సరైన విధంగా మెగ్నీషియం లేక పోతే.. రక్త పోటు, నిరాశ, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకలి లేక పోవడం:
శరీరంలో కావాల్సినంత మెగ్నీషియం ఉండక పోతే.. ఆకలి సరిగా వేయదు. ఏమీ తినాలి అనిపించదు. ఆహార పదార్థాల మీద కూడా ధ్యాస ఉండదు. మెగ్నీషియం గ్లూకోజ్ ను నియంత్రించడంలో సహాయ పడుతుంది. కాబట్టి ఈ ఖనిజం కొరత వల్ల ఆకలి వేయదు. దీన్ని సాధారణ సంకేతంగా భావించవచ్చు.
వికారం:
శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే.. తరచుగా తల నొప్పి లేదా మైకం, వికారం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇది కూడా తీవ్రమైన ఆందోళనకు దారి తీస్తుందన్నారు.
కంటి సమస్యలు:
అదే విధంగా శరీరంలో సరైన మోతాదులో మెగ్నీషియం లేక పోవడం వల్ల, కంటి సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. కళ్లు మండటం, నొప్పులు రావడం, కళ్ల నుంచి నీరు కారడం సమస్యలు తలెత్తుతాయి.
హృదయ స్పందనలో మార్పు:
శరీరంలో మెగ్నీషియం లెవల్స్ తగ్గినప్పుడు.. మీ గుండె రేటులో కూడా మార్పులు వస్తాయి. బాడీలో మెగ్నీషియం తగ్గితే.. హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది. అలాగే మీ గుండె సాధారణంగా కంటే వేగంగా కొట్టుకున్నా మెగ్నీషియం లోపించిందని గుర్తించాలి.
కండరాల తిమ్మిర్లు:
కండరాలు బలంగా, దృఢంగా ఉండాలంటే మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. మెగ్నీషియం లోపిస్తే కండరాలు కూడా బలహీనంగా మారతాయి. అంతే కాకుండా పొటాషియం స్థాయిలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది కూడా కండరాల తిమ్మిరి, నొప్పులకు దారి తీసే అవకాశం ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.