AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఈ లక్షణాలు వేధిస్తున్నాయా.? అయితే మీకు ఆ లోపం ఉన్నట్లే.

ఆరోగ్యవంతమైన మానవుడికి రోజుకు కనీసం 300 గ్రాముల మెగ్నీషియం అవసరం ఉంటుంది. ఇంతకంటే తగ్గితే శరీరంపై దుష్ప్రభావం పడుతుంది. మెగ్నీషియం లోపిస్తే పలు రకాల వ్యాధులు వెంటాడుతాయి. అయితే శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉందన్న విషయం పలు రకాల పరీక్షలు చేయిస్తే కానీ తెలియదు. అలా కాకుండా కొన్ని రకాల ముందస్తు లక్షణాల ద్వారా మెగ్నీషియం...

Health: ఈ లక్షణాలు వేధిస్తున్నాయా.? అయితే మీకు ఆ లోపం ఉన్నట్లే.
Magnesium Deficiency
Narender Vaitla
|

Updated on: Sep 14, 2023 | 7:53 PM

Share

శరీరానికి అన్ని రకాల విటమిన్లు సమృద్ధిగా అందితేనే ఆరోగ్యంగా ఉంటామనే విషయం తెలిసిందే. ఏ ఒక్క విటమిన్‌ లోపించినా వెంటనే లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో కీలక పాత్ర పోషించే వాటిలో మెగ్నీషియం ఒకటి. చిన్న పేగులలో ఆహార పోషకాలను గ్రహించడంలో మెగ్నీషియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. తీసుకున్న ఆహారం జీర్ణం కావడంలో కూడా మెగ్నీషియంది ముఖ్య పాత్ర. శరీరంలో తగినంత మెగ్నీషియం లేకపోతే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, మూత్ర పిండాలపై చెడు ప్రభావం పడుతుంది.

ఆరోగ్యవంతమైన మానవుడికి రోజుకు కనీసం 300 గ్రాముల మెగ్నీషియం అవసరం ఉంటుంది. ఇంతకంటే తగ్గితే శరీరంపై దుష్ప్రభావం పడుతుంది. మెగ్నీషియం లోపిస్తే పలు రకాల వ్యాధులు వెంటాడుతాయి. అయితే శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉందన్న విషయం పలు రకాల పరీక్షలు చేయిస్తే కానీ తెలియదు. అలా కాకుండా కొన్ని రకాల ముందస్తు లక్షణాల ద్వారా మెగ్నీషియం లోపాన్ని కనిపెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మెగ్నీషియం లోపాన్ని గుర్తించే ముందస్తు లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

* మెగ్నీషియం లోపం ఉన్న వారిలో కనిపించే ప్రధాన లక్షణం శరీరం బలహీనంగా మారడం. కొందరు ఏ పని చేయకపోయినా నిత్యం బలహీనంగా ఉంటారు. అంతేకాకుండా ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా, కడుపులో నిత్యం ఏదో బరువుగా ఉన్న భావన ఉన్నా అది మెగ్నీషియం లోపం కావొచ్చని చెబుతున్నారు.

* మెగ్నీషియం లోపం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీంతో ఆహారం తిన్న వెంటనే వికారం, వాంతులు వచ్చిన భావన కలుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మెగ్నీషియం లోపం ఉన్నట్లు గుర్తించాలి.

* శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే.. కీళ్లు, కండరాలు నొప్పి ఉంటుంది. కొంచెం సేపు కూడా నిలబడలేరు. కొంచెం శారీరక శ్రమ చేసినా వెంటనే అలసిపోతారు.

* ఇక మెగ్నీషియం లోపం వల్ల కలిగే మరో ప్రధాన సమస్య బోలు ఎముకల వ్యాధి. మెగ్నీషియం లోపం కారణంగా బోలు ఎముకల వ్యాధి వస్తుంది.

* మెగ్నీషియం లోపం కారణంగా తలెత్తే మరో ఆరోగ్య సమస్య టైప్‌ 2 డయాబెటిస్‌. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే టైప్‌ 2 డయాటెటిస్‌ బారిన పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడైనా వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే