Cracked lips: పగిలే పెదవులకు చలి ఒక్కటే కారణం కాదు.. మరెన్నో ఉన్నాయి. అవేంటంటే..
చలికాలంలో పగిలే పెదాల సమస్య అందరినీ వేధిస్తుంది. ఇది సర్వసాధారణమైన విషయం. పెదవుల్లో తేమ తగ్గడం వల్ల పెదవులు పగులుతుంటాయి. దీంతో పెదవులు అందాన్ని కోల్పోవడమే కాకుండా ఇబ్బందిగా ఉంటుంది. చలితో పాటు కొన్ని సందర్భాల్లో...
చలికాలంలో పగిలే పెదాల సమస్య అందరినీ వేధిస్తుంది. ఇది సర్వసాధారణమైన విషయం. పెదవుల్లో తేమ తగ్గడం వల్ల పెదవులు పగులుతుంటాయి. దీంతో పెదవులు అందాన్ని కోల్పోవడమే కాకుండా ఇబ్బందిగా ఉంటుంది. చలితో పాటు కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ కూడా ఈ సమస్యకు దారి తీస్తుంటుంది. తక్కువ నీరు తాగడం లేదా జ్వరం వచ్చినప్పుడు పెదవులు పగలడం చూసే ఉంటాం. అయితే వీటితో పాటు మరికొన్ని కారణాల వల్ల కూడా పెదవులు పగులుతాయని మీకు తెలుసా.? ఇంతకీ ఎలాంటి సందర్భాల్లో పెదవులకు ఈ సమస్య వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇటీవల ఫేస్ వాష్‌లను ఉయయోగించడం బాగా పెరిగింది. ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్ ఉపయోగించడం వల్ల పెదాలకు అలర్జీలు రావచ్చు. ఈ కారణంగా కూడా పెదవులు పగులుతాయి.
* ఇక కొందరు మహిళలు మేకప్ తొలగించడానికి మేకప్ రిమూవర్‌ని ఉపయోగిస్తారు, ఇది వారి పెదవుల నాణ్యతను దెబ్బతీస్తుంది. మేకప్ రిమూవర్‌లో ఉండే సర్ఫ్యాక్టెంట్లు దీనికి కారణం.
* కొన్ని సందర్భాల్లో మౌత్ వాష్‌లు కూడా అలర్జీకి దారి తీస్తుంటాయి. మౌత్ వాష్‌లు ఉపయోగించే సమయంలో పెదవులకు సైతం తగులుతుంటుంది. ఇలాంటి సమయంలో అలర్జీలకు కారణమవుతుంది.
* లిప్‌స్టిక్ ఉపయోగించే వారిలో కూడా పెదవులు పగిలే సమస్య ఉంటుంది. ముఖ్యంగా మ్యాట్ లిప్‌స్టిక్‌లు లేదా లిప్ బామ్‌లు సువాసనను కలిగి ఉంటాయి. ఇందులోని మెంథాల్ లేదా క్యాప్సైసిన్ పెదాలు పగలడానికి కారణంగా చెప్పొచ్చు.
* ఇక ధూమపానం సేవించే వారిలోనూ పెదాల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. స్మోకింగ్ చేసే వారి పెదవులపై పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. దీని కారణంగా పెదవులు పగులుతాయి.
* ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలోనూ డీహైడ్రేట్ సమస్య వేదిస్తుంటుంది. శరీరం డీహైడ్రేట్ అయితే పెదవులు పగిలే అవకాశాలు ఉంటాయి.
నోట్: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు తీసుకోవడమే సూచించదగ్గ అంశం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..