AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: పురుషులకు వార్నింగ్.. ఈ ఐదు ఫుడ్స్ మీ జుట్టును బలహీనపరుస్తాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!

Hair Care Tips: మనం ఆరోగ్యంగా ఉండాలన్నా.. అనారోగ్యానికి గురికావాలన్నా.. మనం తినే ఆహారమే కీలకం. ఎందుకంటే.. మనం తినే ఫుడ్ మన ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. ప్రతీ అవయవంపై దాని ప్రభావం స్పష్టంగా ఉంటుంది.

Hair Care Tips: పురుషులకు వార్నింగ్.. ఈ ఐదు ఫుడ్స్ మీ జుట్టును బలహీనపరుస్తాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!
Hair Loss
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 01, 2022 | 6:50 AM

Share

Hair Care Tips: మనం ఆరోగ్యంగా ఉండాలన్నా.. అనారోగ్యానికి గురికావాలన్నా.. మనం తినే ఆహారమే కీలకం. ఎందుకంటే.. మనం తినే ఫుడ్ మన ఆరోగ్యంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. ప్రతీ అవయవంపై దాని ప్రభావం స్పష్టంగా ఉంటుంది. అయితే, ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, జుట్టుపైనా మనం తినే ఫుడ్ ప్రభావం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆహారాలు జుట్టుకు మంచి చేస్తే.. మరికొన్ని ఆహారాలు దుష్ప్రభావం చూపుతాయి. అవును జుట్టు రాలడానికి మనం తినే కొన్ని ఆహారపదార్థాలే కారణం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి జట్టు సంబంధిత సమస్యలకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. చక్కెర చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరిచి.. జుట్టు రాలడాన్ని తీవ్రతరం చేస్తుంది. అలాగే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటిస్‌కు కారణమవుతుంది. ఇది రక్త ప్రసరణను బలహీనపరుస్తుంది. తద్వారా జుట్టు పెరుగుదులకు అవసరమైన పోషకాలు చేరకుండా నియంత్రిస్తుంది.

2. మద్యం అధిక ఆల్కహాల్ మీ చర్మం, శరీరం, జుట్టుకు తీవ్ర హానీ తలపెడుతుంది. మద్యం సేవించడం వలన జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషించే కెరాటిన్ అనే ప్రోటీన్‌ కాంపోనెంట్‌ను దెబ్బతీస్తుంది. ప్రోటీన్‌ను శోషించే సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. జుట్టు కుదుళ్లు బలహీనమవుతాయి. ఫలితంగా జుట్టు రాలిపోతుంది.

3. జంక్ ఫుడ్.. పోషకాల సాంద్రత తక్కువగా ఉన్న, సంతృప్త కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు.. స్కాల్ప్, ఎలివేటెడ్ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. ఇది DHT స్థాయిలను పెంచుతుంది. పెరిగిన DHT స్థాయిలు అలోపేసియా అరేటాకు కారణం అవుతాయి.

4. అధిక పాదరసం సాయిలు కలిగిన చేప.. చాలా మంది చేపలు ఆరోగ్యకరం అని అతిగా తింటారు. అయితే, చేపల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని చేపల్లో పాదరసం అధిక స్థాయిలో ఉంటుంది. అలాంటి చేపలు తినడం వల్ల శరీరంలోనూ పాదరసం స్థాయిలు పెరుగుతాయి. ఈ చేపలను తినడం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు అందవు. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. పాదరసం స్థాయిలు అధికంగా ఉండే చేపలు స్వోర్డ్ ఫిష్, మాకేరెల్, ట్యూనా.

5. పచ్చి గుడ్లు.. బలహీనమైన కరుల ఆరోగ్యం కోసం చాలా మంది పచి గుడ్డును నెత్తికి అప్లై చేస్తారు. అలా చేయడం వలన గుడ్డలోని ప్రోటీన్స్ జుట్టుకు అందుతాయి. అయితే, పచ్చి గుడ్డు తినడం వలన జుట్టు బలహీనపడుతుంది. పచ్చి గుడ్లలో కోలిన్ పుష్కలంగా ఉంటుంది. కానీ, అవి చాలా తక్కువ బయోటిన్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. బయోటిన్ ముఖ్యమైన బీ విటమిన్. ఇది జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్లయితే ఉడికించిన గుడ్లను తినడం ఉత్తమం.

Also read:

LSG vs CSK, IPL 2022: ఏం కొట్టారు సామీ.. ఉత్కంఠ పోరులో చెన్నైని మట్టికరిపించిన లక్నో సూపర్ జెయింట్స్..

Summer Alert: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. పిల్లలపై ఓ లుక్కేసి ఉంచండి.. లేదంటే పెనుముప్పు తప్పదు..!

Puzzle Picture: ‘దమ్ముంటే నన్ను కనిపెట్టండి’.. డాగ్ విసిరిన సవాల్.. ఆన్సర్ చెప్పే సత్తా మీలో ఉందా?