AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetic Patients: రోజూ ఇన్సులిన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. మధుమేహ రోగులు జాగ్రత్త.. పరిశోధనలో షాకింగ్‌ విషయాలు

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. వీటిలో ఒకటి టైప్-2 డయాబెటిస్, మరొకటి టైప్-1 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్..

Diabetic Patients: రోజూ ఇన్సులిన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. మధుమేహ రోగులు జాగ్రత్త.. పరిశోధనలో షాకింగ్‌ విషయాలు
Diabetic Patients
Subhash Goud
|

Updated on: Oct 04, 2022 | 7:34 PM

Share

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. వీటిలో ఒకటి టైప్-2 డయాబెటిస్, మరొకటి టైప్-1 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్ ఒక తీవ్రమైన వ్యాధి. ప్యాంక్రియాస్ తక్కువ లేదా ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు ఇది సంభవిస్తుంది. దీని కారణంగా టైప్ 1 డయాబెటిస్ ఉన్న రోగులు శరీర అవసరాలను తీర్చడానికి ఇన్సులిన్ సప్లిమెంట్లను తీసుకోవాలి. ఇప్పుడు ఇన్సులిన్ క్యాన్సర్ ప్రమాదానికి కారణమవుతుందని ఒక పరిశోధన తెలిపింది. జమ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. టైప్ 1 డయాబెటిస్ ఉన్న రోగులలో ఇన్సులిన్ తీసుకోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. డయాబెటిస్ కంట్రోల్ అండ్ కాంప్లికేషన్స్ ట్రయల్ (డీసీసీటీ) నుండి ఎపిడెమియోలాజికల్ డేటాను ఉపయోగించి, 28 ఏళ్లు పైబడిన టైప్ 1 డయాబెటిస్ ఉన్న రోగులలో క్యాన్సర్ సంభవం ఆధారంగా ఈ పరిశోధన జరిగింది. 1,303 మందిని అధ్యయనంలో చేర్చారు. ఇందులో తక్కువ మోతాదులో ఇన్సులిన్ తీసుకున్న వారి కంటే ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ తీసుకున్న వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.

క్యాన్సర్‌ ఎంత మందికి అంటే..

పరిశోధనలో పాల్గొన్న 1,303 మంది రోగులలో 93 (7 శాతం) మందికి క్యాన్సర్ ఉంది. ఈ వ్యక్తుల సగటు వయస్సు 50 సంవత్సరాలు, వారు కనీసం 20 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నారు. 93 మంది రోగులలో, 57 మంది మహిళలు (61 శాతం), 36 మంది పురుషులు (39 శాతం) గత 10 సంవత్సరాలలో క్యాన్సర్‌ను అభివృద్ధి చేశారు. డయాబెటీస్, కేన్సర్ దీర్ఘకాలిక వ్యాధులని, దేశంలో ఈ రెండింటి భారం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని వోకార్డ్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డాక్టర్ అనికేత్ ములే అన్నారు. నానాటికీ పెరుగుతున్న కేన్సర్, మధుమేహ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఊబకాయం కూడా క్యాన్సర్‌కు కారణం కావచ్చు:

డయాబెటీస్, క్యాన్సర్ వెనుక ఊబకాయం ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం.. డయాబెటిస్ ఇన్సులిన్ నిరోధకత కారణంగా క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. అధ్యయనంలో అధిక మోతాదులో ఇన్సులిన్ తీసుకున్న వ్యక్తులు క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తించారు. ఈ విషయంలో ఇన్సులిన్‌ను క్యాన్సర్‌తో నేరుగా లింక్ చేయడం, ఈ అంశంపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని అన్నారు. అయితే ఈ వ్యాధి రాకుండా ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరమన్నారు.

క్యాన్సర్‌ను ఎలా నివారించాలి:

► కారణం లేకుండా మానసిక ఒత్తిడికి గురికావద్దు

► ఆహారం విషయంలో జాగ్రత్తా ఉండాలి

► జీవనశైలిలో మార్పులు తీసుకురావడం

► మైదా, పంచదార, ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దు

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి