AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue: డెంగ్యూతో తగ్గిపోయే ప్లేట్‌లెట్లను ఎలా పెంచుకోవాలో తెలుసా.? ఈ ఆహార పదార్థాలను వెంటనే తీసుకోండి..

Dengue: యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా తగ్గకముందే.. ఇప్పుడు దేశాన్ని డెంగ్యూ భయపెట్టిస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు భయాందోళనలకు గురి చేస్తోంది...

Dengue: డెంగ్యూతో తగ్గిపోయే ప్లేట్‌లెట్లను ఎలా పెంచుకోవాలో తెలుసా.? ఈ ఆహార పదార్థాలను వెంటనే తీసుకోండి..
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 23, 2021 | 6:39 AM

Share

Dengue: యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా తగ్గకముందే.. ఇప్పుడు దేశాన్ని డెంగ్యూ భయపెట్టిస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు భయాందోళనలకు గురి చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాధి రాష్ట్రాల్లో డెంగ్యూ స్వైర విహారం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా డెంగ్యూ కొత్త వేరియంట్‌ D2 డెంగ్యూ స్ట్రెయిన్‌తో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో మరోసారి ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. డెంగ్యూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో అది మన చేతిలో ఉండదు. అయితే డెంగ్యూ సోకిన తర్వాత దాని ప్రభావం మనపై ఎక్కువగా పడకుండా మాత్రం చేసుకోవచ్చు.

ముఖ్యంగా డెంగ్యూ సోకిన వారిలో ప్రధానంగా కనిపించే సమస్య ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం.ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోతే అది క్రమంగా ప్రాణానికి ప్రమాదంగా మారుతుంది. మరి సహజంగా ప్లేట్‌లెట్స్‌ను పెంచుకునే అవకాశం లేదా.? అంటే కచ్చితంగా ఉందని చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను భాగం చేసుకోవడం ద్వారా తగ్గిపోయే ప్లేట్‌లెట్స్‌ను వెంటనే తిరిగి పెంచుకోవచ్చు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటంటే..

* డెంగ్యూ వచ్చిన వారికి చాలా మంది ఇచ్చే సలహా బొప్పాయి పండును తినమని. నిజంగానే బొప్పాయిలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచే గుణం ఉంటుంది. బొప్పాయి చెట్టు ఆకుల ర‌సాన్ని పావు టీస్పూన్ చొప్పున రోజుకు ఒక‌టి లేదా రెండు సార్లు తాగుతుండాలి. దీని వ‌ల్ల కూడా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

* దానిమ్మ కూడా ప్లేట్‌లెట్ల సంఖ్య పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా దానిమ్మను తీసుకుంటే రక్తం ఉత్పత్తి కూడా పెరుగుతుంది.

* రోజూ ఉదయం లేవగానే పరగడుపును రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి తినేయాలి. ఇలా చేస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

* విటమిన్‌ కే ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ విటమిన్‌ అధికంగా లభించే ఆకుపచ్చ ఆకుకూరలు, కూరగాయలను తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.

* ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గకుండా ఉండాలంటే ఒక కప్పు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాజాగా. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగడమే కాకుండా రక్తం కూడా పెరుగుతుంది.

* క్యారట్‌ను కూడా తినడం అలవాటు చేసుకోవాలి. క్యారట్‌ను జ్యూస్‌గా చేసుకొని తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది.

* ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగడంలో ఖర్జూర ముఖ్య పాత్ర పోషిస్తాయి. రోజుకు మూడు ఖర్జూరాలను తింటే సమస్య నుంచి బయటపడొచ్చు.

* నారింజ పండు కూడా ఈ సమస్యకు మంచి పరిష్కారం చూపుతుంది. రోజులో రెండు పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. ఇక జ్యూస్‌లా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

Also Read: Vaccine with Plant: పాలకూర తింటే చాలు.. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్టే.. ఎలాగంటారా? ఈ స్టోరీ ఫాలో అయిపోండి..

Health Tips: ఈ ఐదు టిప్స్ పాటిస్తే చాలు.. మీ ఆరోగ్యం మీ వెంటే.. అన్ని సమస్యలు ఇక్కడి నుంచే..

Corona Virus: కొవిడ్‌ నుంచి కోలుకున్నాక డెలిరియం వస్తోందట..! లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?