Yoga Pose-Pregnent Women: గర్భిణీ స్త్రీలల్లో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంత కోసం.. సుఖ ప్రసవం కోసం యోగాసనాలు ఏమింటే..
Yoga Pose-Pregnent Women: గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. అంతేకాదు ప్రెగ్నెంట్ ఉమెన్ మానసికంగా, శారీరకంగా..
Yoga Pose-Pregnent Women: గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. అంతేకాదు ప్రెగ్నెంట్ ఉమెన్ మానసికంగా, శారీరకంగా అనేక మార్పులను పొందుతారు. దీంతో ఒత్తిడి అధికంగా ఉంటుంది. దేనిని దూరం చేసుకోవడానికి గర్భవతి చిన్న చిన్న యోగాసనాలు వేస్తే.. శిశువు జన్మించే ముందు కలిగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. తల్లిని శారీరకంగా, మానసికంగా సంసిద్ధురాలిని చేస్తుంది. అంతేకాదు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆసనాలు వెన్నెముకను బలపరుస్తాయి. శరీరాన్ని సరళంగా వుంచుతాయి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్రలు, ఇతర రిలాక్సేషన్ మెళకువలు వలన ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. గర్భిణులు రోజూ 90 నిమిషాలపాటు యోగా చేయడం వల్ల కడుపులోని పిండం మరింత ఆరోగ్యంగా పెరుగుతుందని పలు పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. అయితే యోగా చేసే తల్లులు.. ఈ యోగా ప్రక్రియలను కేవలం నిపుణులైన యోగా టీచర్ల సమక్షంలోనే ఆచరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ యోగాసనాల వలన గర్భిణీ స్త్రీలకు మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.
ధ్యానం : ఈ రకం యోగా తో గర్భిణీ స్త్రీలు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. పూర్తి రిలాక్సేషన్ పొందుతారు. ఒత్తిడి తగ్గేందుకు చాలా మంచిది. ఆందోళన, భయం, నరాల సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు నార్మల్సా డెలివరీ జరుగుతుంది.
ప్రాణాయామ: ఈ రకమైన యోగా గర్భవతి మహిళ శ్వాసకు మంచిది. కాబోయే తల్లికి శారీరక, మానసిక హాయినిస్తుంది.
యోగ నిద్ర : గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఆచరించాల్సిన నిద్ర. ఈ నిద్ర గాఢంగా వుంటుంది. కనుక కాబోయే తల్లికి ఎంతో మంచిది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. గర్భవతి ఎంతో ఆనందంగా వుంటుంది. డెలివరీ తేలికగా సహజంగా అవుతుంది. అంతేకాదు శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది.
చంద్ర నమస్కారాలు: ఈ నమస్కారాలని సాయంత్రం ఆరు గంటలకి చంద్రుణ్ణి చూస్తూ చేయడం మంచింది. ఎందుకంటే చంద్రుడు భావోద్వేగాలకీ, రుచికీ అధిపతి. చంద్ర నాడి ఎడమవైపున ఉంటుంది. కనుక గర్భిణీ స్త్రీలు ఈ యోగాసనాలని ఎడమ కాలితో మొదలు పెట్టాలి.
గర్భిణీ స్త్రీలు యోగాసనాలను వేయడం వలన కలిగే లాభాలు:
*డీఎన్ఏ స్ట్రక్చర్‌ని అల్టర్ చేయడం ద్వారా జెనిటిక్ డిసీజెస్ ని ప్రివెంట్ చేస్తాయి. *మానసిక బలాన్ని పెంచుతాయి. *మనసుని ప్రశాంతంగా మారుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి *సాధారణ డెలివరీ అయ్యే అవకాశం కల్పిస్తాయి.
*గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండడం కోసం రోజుకి 20 – 30 నిమిషాలు ప్రాణాయామం, యోగాసనాలు, మెడిటేషన్ కి కేటాయించండి. ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు శిశువు ఆరోగ్యంగా పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయితే ప్రెగ్నెంట్ ఉమెన్ అనుసరించాల్సిన యోగా ప్రక్రియలను కేవలం నిపుణులైన యోగా టీచర్ల సమక్షంలోనే ఆచరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారు నూతన గృహనిర్మాణం చేపడతారు, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..