చిన్న అలవాటు మీ ప్రాణాలకు శ్రీ రామరక్ష! గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందా
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం వంటివి మన ఆరోగ్యానికి పరోక్షంగా హాని చేస్తున్నాయి. అయితే, మనం తీసుకునే డైట్, సప్లిమెంట్ల మీద చూపే శ్రద్ధ, రోజువారీ అలవాటైన ‘నోటి ఆరోగ్యం’ పట్ల చూపడం లేదు. సుమారు 80 శాతం మంది పెద్దలు నిర్లక్ష్యం చేసే ఒక చిన్న అలవాటు మీ ఆయుష్షును పెంచగలదని మీకు తెలుసా? అదే ‘ఫ్లోసింగ్’. కేవలం దంతాల కోసం మాత్రమే కాదు, మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ఫ్లోసింగ్ ఎలా సహాయపడుతుందో చూద్దాం.

గుండె జబ్బులు రావడానికి కారణం కేవలం ఆహారం, వ్యాయామం లేకపోవడమే అనుకుంటే పొరపాటే! నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం గుండెకు అతిపెద్ద ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్రానిక్ గమ్ ఇన్‌ఫ్లమేషన్ (చిగుళ్ల వాపు) నేరుగా గుండెపోటు, స్ట్రోక్ మరియు ధమనులలో ప్లేక్ ఏర్పడటానికి ఎలా దారితీస్తుందో తెలుసా? దంతాలను బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో, ఫ్లోసింగ్ చేయడం కూడా అంతే ముఖ్యం. మీ చిరునవ్వునే కాదు, మీ ప్రాణాలను కూడా కాపాడే ఆ సింపుల్ లైఫ్-సేవింగ్ అలవాటు గురించి తెలుసుకుందాం.
చాలామంది బ్రష్‌తో పళ్లు తోముకుంటే సరిపోతుందని భావిస్తారు. కానీ, మన దంతాల మధ్య ఉండే సందుల్లో పేరుకుపోయే ఆహార పదార్థాలు, బ్యాక్టీరియాను తొలగించడానికి కేవలం బ్రష్ సరిపోదు. అక్కడ ఫ్లోసింగ్ (దారంతో పళ్లను శుభ్రం చేయడం) తప్పనిసరి. డాక్టర్ భోజ్ వంటి నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, నోటి ఆరోగ్యం అనేది కార్డియోవాస్కులర్ వ్యాధులను ముందుగానే ఊహించగల ఒక బలమైన సూచిక.
నోటి ఆరోగ్యం – గుండె ఆరోగ్యం…
మనం తీసుకునే ఆహారం, జీవనశైలి కారణంగా నోటిలో చేరే బ్యాక్టీరియా, చిగుళ్ల వాపు ద్వారా రక్తప్రవాహంలోకి చేరుతాయి. ఇలా రక్తంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, కాలక్రమేణా రక్తనాళాల్లో వాపును కలిగించి, ధమనులలో ప్లేక్ పేరుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చిగుళ్ల వ్యాధిని కేవలం నోటికే పరిమితమైన సమస్యగా చూడకూడదు. ఇది శరీరంలో నిరంతరం జరిగే ఒక ‘నిశ్శబ్ద ఇన్‌ఫ్లమేషన్’, ఇది డయాబెటిస్ మరియు గుండె జబ్బుల వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఫ్లోసింగ్ ఎందుకు..
ఫ్లోసింగ్ అనేది బ్రష్ చేరుకోలేని దంతాల మధ్య గ్యాప్స్‌ను క్లీన్ చేస్తుంది. దీనివల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా, చిగుళ్లలో వాపు రాకుండా చూసుకోవచ్చు. నోరు అనేది మన శరీరంలోకి ప్రవేశించే ఒక ద్వారం వంటిది. కాబట్టి, ఆ ద్వారం వద్దే బ్యాక్టీరియాను అడ్డుకుంటే, మనం రోగాల బారి నుంచి సురక్షితంగా ఉంటాం.
జుకు రెండుసార్లు బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో, పడుకునే ముందు ఒక్కసారి ఫ్లోసింగ్ చేయడం అంతకంటే ముఖ్యం. ఇది చాలా తక్కువ సమయం తీసుకునే అలవాటు, కానీ దీని వల్ల వచ్చే ప్రయోజనాలు అపారం. మీ గుండెను, చిరునవ్వును కాపాడుకోవడానికి, మీ దినచర్యలో ఫ్లోసింగ్‌ను ఒక భాగంగా చేసుకోండి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటేనే, గుండె దృఢంగా ఉంటుంది. చిన్న చిన్న మార్పులే పెద్ద ఆరోగ్య ఫలితాలను ఇస్తాయని గుర్తుంచుకోండి.
