AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Custard apple: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. సూపర్ ఫ్రూట్ సీతాఫలం.. ఎన్నో ప్రయోజనాలు

పండులో రారాజు సీతాఫలం మార్కెట్‌లోకి రానే వచ్చింది. మెండుగా ఔషధ గుణాలుండే ఈ పండు కూడా ఇప్పుడు ఖరీదయిపోయింది. సామాన్యుడి ఆపిల్‌గా పిలిచే ఈ మధుర ఫలం సంజీవనిగా పని చేస్తుంది. అలాంటిది సీతాఫలం ధరలు ప్రజంట్ యాపిల్‌ ధరలను మించి పోయాయి.

Custard apple: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. సూపర్ ఫ్రూట్ సీతాఫలం.. ఎన్నో ప్రయోజనాలు
Sugar Apple
Ram Naramaneni
|

Updated on: Sep 23, 2021 | 7:52 PM

Share

చలికాలంలో ఎక్కువగా మార్కెట్‌లోకి వచ్చే ఫలాల్లో సీతాఫలం ఒకటి.  అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్ని కస్టర్డ్‌ యాపిల్‌, షుగర్‌ యాపిల్‌ అని కూడా పిలుస్తారు. సీజనల్‌గా దొరికే ఈ పండుకు తెలంగాణ ప్రాంతం పెట్టింది పేరు. అందులోనూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పరిసరాల్లో ఈ పండ్ల రాశులు అప్పుడే రోడ్లపై దర్శనమిస్తున్నాయి. సీజన్‌ కంటే ముందే వచ్చేశాయి. సర్వరోగ నివారినిగా పని చేయడంతో.. వీటికి ఎక్కడలేని డిమాండ్‌ ఏర్పడింది. వీటిలో.. విటమిన్- సి, యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరచడానికి సీతా ఫలం మంచిది. వీటిలో పొటాషియం, మెగ్నీషియం కాల్షియం, పీచు, విటమిన్-ఇ అధికంగా ఉంటాయి. బీపీని కంట్రోల్ చేసే శక్తి కూడా దీనికుంటుంది. ఈ పండ్లలోని విటమిన్ ‘ఏ’… చర్మ, జుట్టు సంరక్షణకు బాగా ఉపయోగపడుతోంది. కంటి చూపు కూడా మెరుగుపడేందుకు కూడా ఈ ఫ్రూట్ ఉపయోగపుడుతోంది.

మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలం తింటే… జీర్ణక్రియ బాగా అవుతుందంటున్నారు వైద్యులు. ఈ ఫలంలోని కాపర్… మలబద్ధకాన్ని తరిమికొడుతుంది. డయేరియాకు చెక్ పెట్టే గుణం సీతాఫలానికి ఉంది. సీతాఫలంలోని మెగ్నీషియం… మన బాడీలోని వాటర్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. కీళ్లలోని యాసిడ్స్‌ని బయటకు తరిమేసి… రుమాటిజం, కీళ్లనొప్పులకు చెక్ పెడుతుంది. మీకు నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే సీతాఫలం తినండి. ఇందులోని పొటాషియం… మీ కండరాల బలహీనతను తగ్గించి… మీకు శక్తిని ఇస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు సీతాఫలం తినాలంటారు వైద్యులు. సీతాఫలం ఆకు మొదలుకుని గుజ్జు తిన్న తరువాత పారవేసే గింజల వరకూ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే పండులోని ప్రతి భాగం ఔషధమని చెప్పక తప్పదు. ఎంతలా అంటే.. ఒక సంజీవని మాదిరిగా పని చేస్తుంది.

Also Read:  మనిషి రక్తం మితిమీరి తాగింది.. చివరకు పొట్ట పగిలిపోయింది

 భార్య ఉండనని చెప్పి పుట్టింటికి వెళ్లింది.. అతడి షాకింగ్ నిర్ణయంతో, జీవితాలు అస్తవ్యస్తం