Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాగునీటిలో చిటికెడు ఉప్పు కలిపి చూడండి..! మిరాకిల్ జరగుతుంది..!

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం ఎక్కువగా చెమట పట్టే అవకాశం ఉంటుంది. దీని వల్ల నీటి లోపం, ఎలక్ట్రోలైట్ల తగ్గుదల జరుగుతుంది. అలాంటి సమయంలో గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపరచి, కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

తాగునీటిలో చిటికెడు ఉప్పు కలిపి చూడండి..! మిరాకిల్ జరగుతుంది..!
Salt Water Benefits
Follow us
Prashanthi V

|

Updated on: Apr 02, 2025 | 9:16 PM

ఎండాకాలంలో వేడిని తట్టుకుని శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఎంతో అవసరం. ఎక్కువ చెమట పట్టడం, నీటి లోపం, ఎలక్ట్రోలైట్ల తగ్గుదల వంటి సమస్యలు ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. అటువంటి సమయంలో గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడటమే కాకుండా.. జీర్ణక్రియ మెరుగుపడటానికి కండరాల నొప్పులను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ సాధారణమైన ఉప్పునీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరం చెమట ద్వారా ముఖ్యమైన ఖనిజాలను కోల్పోతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరంలో ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతే నీరసం, దాహం, మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ లోటును భర్తీ చేసేందుకు తాగునీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది సోడియం, పొటాషియం, మాగ్నీషియం లాంటి ఖనిజాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

శరీరానికి తేమను నిల్వ ఉంచే సామర్థ్యం ఎంతో అవసరం. ఎక్కువగా చెమట పట్టే పరిస్థితుల్లో ముఖ్యంగా ఎండలో ఎక్కువ సేపు పనిచేసే వ్యక్తులు, వ్యాయామం చేసే వారు డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. ఉప్పులో ఉండే సోడియం శరీరంలోని నీటిని నిల్వ ఉంచేలా సహాయపడుతుంది. దీనివల్ల నీరసం అలసట సమస్యలు తగ్గి శరీరం ఉల్లాసంగా ఉంటుంది.

వ్యాయామం చేసినప్పుడు శరీరం అధిక శక్తిని వినియోగిస్తుంది. కండరాల నొప్పి, అలసట అనుభవించినప్పుడు తక్షణ ఉపశమనం పొందేందుకు ఉప్పునీరు మంచి పరిష్కారం. దీనివల్ల కండరాలకు కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే ఎలక్ట్రోలైట్ల బ్యాలెన్స్ మెరుగవుతుంది. కండరాల తిమ్మిరి, నరాల బిగుతు సమస్యలు ఎదురైనప్పుడు ఉప్పునీరు తాగడం ఎంతో మేలు చేస్తుంది.

ఆహారం సరిగ్గా జీర్ణమవ్వాలంటే శరీరంలో సరైన మోతాదులో ఆమ్లాలు ఉత్పత్తి కావాలి. కొన్ని సందర్భాల్లో ఆమ్ల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఆహారం త్వరగా జీర్ణమవ్వక, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉప్పునీరు తాగడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలను సరిగ్గా ఉంచి జీర్ణక్రియ మెరుగుపరచగలదు.

తాగునీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇది అందరికీ సెట్ అవ్వదు. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఉప్పునీరు తాగడం మానుకోవడం మంచిది. అధిక ఉప్పు తీసుకోవడం మూత్రపిండాలపై ఎక్కువ ఒత్తిడిని కలిగించవచ్చు. అలాగే హై బ్లడ్ ప్రెజర్ ఉన్నవారు కూడా వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఉప్పునీరు తాగాలి. చిటికెడు ఉప్పుతో నీటిని తాగడం అనేది సాధారణమైన విషయం అయినప్పటికీ.. ఇది శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)