రూపాయలు10 లోపే దొరికే సూపర్ ఫుడ్స్.. ఆరోగ్యానికి ఖజానా! వీటిని మిస్సవ్వొద్దు
Superfoods under Rs 10: ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారాలే తినాలి అనుకునే రోజులు పోయాయి. మన చుట్టూ, రోజువారీ మార్కెట్లోనే రూ.10 లోపే దొరికే సూపర్ ఫుడ్స్ ఎన్నో ఉన్నాయి. ఇవి పోషకాలు సమృద్ధిగా కలిగి ఉండటమే కాకుండా, అనేక రోగాలను దూరం చేస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సంపూర్ణ ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన ఆహారం తీసుకుంటూ ఉంటారు. కానీ, తక్కువ ధరలోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే వీటిని మాత్రం పట్టించుకోరు. ఆరోగ్యం కోసం ఖరీదైన డ్రైఫ్రూట్స్, సప్లిమెంట్స్ అవసరం లేదు. మన రోజువారీ ఆహారంలోనే, చవక ధరలో లభించే కొన్ని ఆహారాలు నిజంగా సూపర్ ఫుడ్స్‌లా పనిచేస్తాయి. ముఖ్యంగా రూ.10 లోపే దొరికే ఈ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూరలు – రక్త హీనతకు చెక్
పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు రోజూ తినేవారిలో రక్తహీనత సమస్య తక్కువగా ఉంటుంది. ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇవి 5 నుంచి 10 రూపాయల లోపే లభిస్తాయి.
వేరుశెనగలు – గుండె ఆరోగ్యం
వేరుశెనగలు శరీరానికి కావలసిన ప్రోటీన్, మంచి కొవ్వులు అందిస్తాయి. రోజూ కొద్దిగా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
అరటిపండు – ఇన్‌స్టాంట్ ఎనర్జీ
అరటిపండు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండటంతో కండరాల నొప్పులు, అలసట తగ్గుతాయి. ధర కూడా అందుబాటులోనే ఉంటుంది.
గుడ్డు – సంపూర్ణ పోషకాహారం
ఉడికించిన గుడ్డు ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. కండరాల బలానికి, శరీర ఎదుగుదలకు ఇది ఎంతో ఉపయోగకరం. చాలా ప్రాంతాల్లో రూ.10 లోపే లభిస్తుంది.
మొలకెత్తిన శెనగలు – ప్రోటీన్, ఫైబర్
మొలకెత్తిన శనగల్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి కూడా 10 రూపాయలలో కొనుగులో చేయవచ్చు. రోజూ కొంత మొత్తం తీసుకుంటే సరిపోతుంది.
వెల్లుల్లి – రోగ నిరోధక శక్తి
వెల్లుల్లిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణకు ఇది ఉపయోగపడుతుంది.
నిమ్మకాయ – విటమిన్ సీ పవర్
నిమ్మకాయలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. వీటి ధర కూడా పది రూపాయలలోపే ఉంటుంది.
ఈ ఆహారాలను సమతుల్యంగా తీసుకుంటే, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం పొందవచ్చు. వీటిని ప్రతి రోజూ కొంత మొత్తం తీసుకుంటే సరిపోతుంది. అయితే, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
