Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Food Tips: అధిక బీపీ, మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ డ్రై ఫ్రూట్‌ని రోజువారీ ఆహారంలో తీసుకోండి.. అద్భుతమైన ఫలితం మీ సొంతం..

జీవనశైలిలో మార్పులతో పాటు కొన్ని మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా బీపీ, మధుమేహం వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి.

Diabetes Food Tips: అధిక బీపీ, మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ డ్రై ఫ్రూట్‌ని రోజువారీ ఆహారంలో తీసుకోండి.. అద్భుతమైన ఫలితం మీ సొంతం..
Pistachio
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 29, 2022 | 5:17 PM

నేటి ఆధునిక జీవనశైలితో ముడిపడి ఉన్న మూడు ప్రధాన వ్యాధులు ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం. ఈ 3 వ్యాధులు నేడు ప్రపంచానికి పెద్ద సంక్షోభంగా మారుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారని వెల్లడించింది. అదే సమయంలో.. ఒక బిలియన్ 28 కోట్ల మంది ప్రజలు రక్తపోటు బాధితులు.. వీరిలో ఎక్కువ మంది పేద, మధ్య-ఆదాయ దేశాలకు చెందిన వారని పేర్కొంది. అంటే సుమారు మూడు కోట్ల మంది ప్రజలు ఈ మూడు వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపింది. ఈ మూడు వ్యాధులకు కారణం అస్తవ్యస్తమైన జీవనశైలి అని స్పష్టం చేసింది. ఇందులో ప్రధానంగా మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నాయని పేర్కొంది.

డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం.. 422 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, మధుమేహం కారణంగా ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. మీ దైనందిన జీవితంలో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు రోజూ పిస్తా తింటే.. మీరు ఈ మూడు వ్యాధుల నుంచి చాలా వరకు బయటపడవచ్చు.

హెల్త్‌లైన్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, పిస్తాలు సూపర్ హెల్తీ ఫుడ్. ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు, పిస్తాలో ప్రోటీన్, ఫైబర్, వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఉండే ముఖ్యమైన పోషకాల వల్ల బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి ఇది గొప్ప ఆహారం అని చెప్పవచ్చు. 28 గ్రాముల పిస్తాలో 159 కేలరీలు, 8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబర్, 13 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, 6 శాతం పొటాషియం, అనేక ఇతర పోషకాలు ఉన్నాయి

బీపీ, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది..

పిస్తాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పిస్తాపప్పులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పిస్తాపై చేసిన అన్ని అధ్యయనాలు ఎల్‌డిఎల్‌ లేదా చెడు కొలెస్ట్రాల్‌ను 67 శాతం వరకు తగ్గించగలవని తేలింది.

ఈ విధంగా రక్తంలో చక్కెర తగ్గుతుంది..

ఇతర ఎండిన పండ్లలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే పిస్తా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. పిస్తాపప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని ఒక అధ్యయనంలో తేలింది. మరో అధ్యయనంలో 56 గ్రాముల పిస్తా రక్తంలో చక్కెరను 20 నుండి 30 శాతం తగ్గించింది. పిస్తాలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, హెల్తీ ఫ్యాట్స్, ఫినాలిక్ కాంపౌండ్స్, కెరోటినాయిడ్స్ వంటి కారకాలు బ్లడ్ షుగర్ ను పూర్తి నియంత్రణలో ఉంచుతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం