AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా..? అసలు కారణాలేంటో ఇప్పుడే తెలుసుకోండి..!

బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నా మార్పు లేకపోతే.. దాని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉండవచ్చు. శరీర హార్మోన్లు, జీవక్రియ, నిద్ర, ఆహారపు అలవాట్లు లాంటి అంశాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా..? అసలు కారణాలేంటో ఇప్పుడే తెలుసుకోండి..!
Weight Loss
Prashanthi V
|

Updated on: Jul 02, 2025 | 7:52 PM

Share

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనసు కూడా సంతోషంగా ఉండాలి. అందుకే శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం, మానసిక ప్రశాంతతకు కూడా మేలు చేస్తుంది. అధిక బరువు ఏ వయసులోనైనా సమస్యే. అందుకే చాలా మంది వ్యాయామం చేయడం, డైట్ పాటించడం, జీవనశైలిని మార్చుకోవడం చేస్తుంటారు. అయినా బరువు తగ్గడం లేకపోతే.. కొన్ని ముఖ్యమైన కారణాలను గుర్తుంచుకోవాలి.

థైరాయిడ్ స్థితి

శరీరంలో థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోతే బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది. ఇది శరీర జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఎంత కసరత్తు చేసినా మార్పు లేకపోతే తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

మానసిక ఒత్తిడి

సరిగా కనిపించకపోయినా.. మనసులో ఉన్న ఒత్తిడి కూడా శరీరంపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ కాలం ఒత్తిడిలో ఉంటే.. కొవ్వు కరిగే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దాని వల్ల బరువు తగ్గడం కష్టంగా మారుతుంది.

సరిపడా నిద్ర

బరువు తగ్గాలని చూస్తున్నప్పుడు నిద్ర పాత్ర కూడా చాలా ముఖ్యం. రాత్రిళ్లు సరిపడా నిద్ర పోకపోతే హార్మోన్ల సమతుల్యతలో తేడాలు వస్తాయి. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

కేలరీల లెక్క తప్పు

కొన్నిసార్లు తక్కువగా తింటున్నామని అనిపించినా.. మనం తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోకపోతే ప్రయోజనం ఉండదు. కచ్చితంగా డైటీషియన్ సలహా తీసుకొని సరైన ఆహార ప్రణాళికను తయారు చేసుకోవాలి.

వ్యాయామ రకాలు

బరువు తగ్గడం కోసం కేవలం కార్డియో (నడవడం, పరుగెత్తడం) చేయడం కాదు. శరీర బలాన్ని పెంచే వ్యాయామాలు కూడా అవసరం. రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకదానిపైనే ఆధారపడితే ఫలితం రావడం కష్టం.

ఆహారంలో చక్కెర

ప్రాసెస్డ్ ఆహారాలు, ప్యాకెట్‌ స్నాక్స్ లాంటి వాటిలో దాగి ఉన్న చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల బరువు తగ్గడంలో ఆటంకం కలుగుతుంది. అలాంటి ఆహారాల వాడకాన్ని తగ్గించాలి.

నీళ్లు తాగకపోవడం

మన శరీరంలో ప్రతి పని సరిగా జరగడానికి నీరు చాలా ముఖ్యం. జీవక్రియను వేగవంతం చేయడంలో నీటి పాత్ర ఎంతో ఉంది. కనీసం రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలి. మీ జీవనశైలిలో చిన్న మార్పులు చేయగలిగితే.. బరువు తగ్గడం సులభం అవుతుంది. ఆరోగ్యాన్ని శాశ్వతంగా మెరుగుపరిచే మార్గాలు వీటిలో దాగి ఉన్నాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

72 ఫోర్లు, 34 సిక్స్‌లు.. 825 పరుగులతో ఇదెక్కడి రచ్చ సామీ
72 ఫోర్లు, 34 సిక్స్‌లు.. 825 పరుగులతో ఇదెక్కడి రచ్చ సామీ
స్కూల్లో LKG విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్.. ఏం జరిగిందంటే?
స్కూల్లో LKG విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్.. ఏం జరిగిందంటే?
ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార
ఈ ముసలావిడను గుర్తు పట్టారా? ఒకప్పటి టాలీవుడ్ అందాల తార
రూమ్ హీటర్లతో జాగ్రత్త.. వెచ్చదనం వెనుక పొంచి ఉన్న ముప్పు!
రూమ్ హీటర్లతో జాగ్రత్త.. వెచ్చదనం వెనుక పొంచి ఉన్న ముప్పు!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
శనీశ్వరుడికి పరిహారాలు.. 2026లో వారికి కొత్త జీవితం ఖాయం..!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
క్రిస్మస్, న్యూఇయర్ రోజుల్లో స్విగ్గీ, జోమాటో సేవలు బంద్!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం, కుబేర యోగం!
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం..
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఓటీటీలో ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సర్కార్ ఆస్పత్రుల్లో IASల సతీమణులు ప్రసవం.. మారుతోన్న నయా ట్రెండ్
సర్కార్ ఆస్పత్రుల్లో IASల సతీమణులు ప్రసవం.. మారుతోన్న నయా ట్రెండ్