Yoga Benefits: ఈ మూడు ఆసనాలు వేయండి.. అధిక బరువు, నడుం నొప్పి సమస్యలకు బైబై చెప్పేసేయండి!

ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్ లో ఏదైనా తొందరగా అయిపోవాలి. ఈ క్రమంలోనే జబ్బుల బారిన పడుతున్నారు. కొంత మంది ఈజీగా బరువు తగ్గాలనుకుంటారు. ఇలాంటి వారికి ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా డైట్ మెయింటైన్ చేయడం కుదరదు. ఇలాంటి వారు ఉదయాన్నే యోగాను ట్రై చేయవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది.. మీరనుకున్న ఫలితం కూడా లభిస్తుంది. యోగా గురించి అందరికీ తెలుసు. యోగాను సరిగ్గా ఫాలో అయితే.. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా బైబై చెప్పవచ్చు. యోగా చేయడం వల్ల మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంత పవర్ ఉంది యోగాలో. ప్రస్తుతం ఇప్పుడు..

Yoga Benefits: ఈ మూడు ఆసనాలు వేయండి.. అధిక బరువు, నడుం నొప్పి సమస్యలకు బైబై చెప్పేసేయండి!
Yoga
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 10, 2023 | 11:00 AM

ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్ లో ఏదైనా తొందరగా అయిపోవాలి. ఈ క్రమంలోనే జబ్బుల బారిన పడుతున్నారు. కొంత మంది ఈజీగా బరువు తగ్గాలనుకుంటారు. ఇలాంటి వారికి ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా డైట్ మెయింటైన్ చేయడం కుదరదు. ఇలాంటి వారు ఉదయాన్నే యోగాను ట్రై చేయవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది.. మీరనుకున్న ఫలితం కూడా లభిస్తుంది. యోగా గురించి అందరికీ తెలుసు. యోగాను సరిగ్గా ఫాలో అయితే.. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా బైబై చెప్పవచ్చు. యోగా చేయడం వల్ల మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంత పవర్ ఉంది యోగాలో. ప్రస్తుతం ఇప్పుడు అందర్ని వేధిస్తోన్న సమస్య.. అధిక బరువు. మొదటిసారి యోగా ఆసనాలు వేసే వారు, ప్రతిరోజూ చేయాలనుకునే వారు ఓ మూడు ఆసనాలు వేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి అవేంటి? వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తడాసనం:

ఈ ఆసనం వేయడం వల్ల సయాటికా వంటి నొప్పి, వెన్ను నొప్పి సమస్యలు తగ్గుతాయి. శరీరం దృఢంగా మారడమే కాకుండా.. ఊపిరి తిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎత్తు పెరగడానికి కూడా ఈ ఆసనం హెల్ప్ చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. జీవక్రియ మెరుగు పడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వను కరిగిస్తుంది. ఇది వేయడం కూడా చాలా ఈజీ.

ఇవి కూడా చదవండి

ఎలా వేయాలంటే:

నిటారుగా నిలబడి.. శ్వాస తీసుకుంటూ చేతులతో మడమలను పైకి ఎత్తాలి. మన శ్వాస మీదనే ధ్యాస పెట్టాలి. ఇలా తడాసనం వేయడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాలు మన సొంతం అవుతుంది.

2. త్రిక తడాసనం:

ఈ ఆసనం వేయడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఈ ఆసనం కరిగిస్తుంది. అలాగే జీవక్రియ మెరుగు పడుతుంది. వెన్నుముక బలంగా తయారవుతుంది. శరీరం కూడా వంగుతుంది.

ఎలా వేయాలి:

ముందుగా నిటారుగా నిలబడాలి. తర్వాత బాడీని ఎడమ వైపుకు ఒకసారి, కుడి వైపుకు ఒకసారి వంచాలి. అలాగే మనం తీసుకునే శ్వాస మీద దృష్టి ఉంచాలి.

3. కడిచక్రాసనం:

ఈ ఆసనం వేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్ గా తయారు అవుతుంది. అలాగే నడుం చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. మల బద్ధకం ప్రాబ్లమ్ తగ్గుతుంది. పొత్తి కడుపు, వెన్నుపాము, భుజం, మెడ బలంగా తయారు అవుతాయి.

ఈ ఆసనం ఎలా వేయాలంటే:

నిటారుగా నిలబడి.. తర్వాత ఎడమ భుజంపై కుడి చేతిని ఉంచాలి. నెక్ట్స్ కుడి కాలు తుంటి భాగంపై ఎడమ చేతిని వెనుక నుంచి మలిచి ఉంచి ఎడమ వైపు తిరగాలి. ఇలా చేతుల స్థితులను మార్చుతూ కుడి వైపు తిరగాలి. అంతే ఇలా సింపుల్ గా యోగా చేస్తూ అధిక బరువు తగ్గండమే కాకుండా. ఆరోగ్యంగా ఉండొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి