మనకేం కాదులే అనుకుంటున్నారా..? తక్కువ సమయం నిద్రపోతే మీ కొంప కొల్లేరేనట..! బీకేర్‌ఫుల్..
ప్రస్తుత కాలంలో చాలా మంది యువత రాత్రిపూట మెలకువగా ఉంటున్నారు.. దీని కారణంగా కొంతకాలం తర్వాత వారికి సరైన విధంగా నిద్ర పట్టదు.. నిద్ర లేకపోవడం వల్ల, నిద్రలేమి సంభవించవచ్చు.. ఇది గుండె జబ్బుల ప్రమాదంతోపాటు.. మానసిక, శారీరక సమస్యలు.. సహా పలు తీవ్ర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వాస్తవానికి ఆరోగ్యంగా ఉండాలంటే.. 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలి..

ప్రస్తుత కాలంలో చాలా మంది యువత రాత్రిపూట మెలకువగా ఉంటున్నారు.. దీని కారణంగా కొంతకాలం తర్వాత వారికి సరైన విధంగా నిద్ర పట్టదు.. నిద్ర లేకపోవడం వల్ల, నిద్రలేమి సంభవించవచ్చు.. ఇది గుండె జబ్బుల ప్రమాదంతోపాటు.. మానసిక, శారీరక సమస్యలు.. సహా పలు తీవ్ర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. వాస్తవానికి ఆరోగ్యంగా ఉండాలంటే.. 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలి.. అయితే.. మీకు రాత్రిపూట నిద్రపోలేకపోతే దానిని తేలికగా తీసుకోకూడదు.. ఎందుకంటే, దాని ప్రత్యక్ష సంబంధం గుండె ఆరోగ్యంతో ముడిపడిఉంటుంది. పరిశోధన ప్రకారం.. మంచి నిద్ర లేని వ్యక్తులు నిద్రలేమితో బాధపడుతున్నారు. వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు నిద్ర రుగ్మతలతో బాధపడుతున్నారని.. ఫలితంగా ప్రమాదకర సమస్యలు, అనేక వ్యాధులు శరీరాన్ని చుట్టుముడుతున్నాయి. నిద్ర సమస్యలు, గుండె ఆరోగ్యానికి మధ్య సంబంధం ఏమిటి? నిద్ర లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
నిద్ర లేకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం..
అధిక రక్తపోటు: ఎవరైనా 8 గంటలు నిద్రపోకపోతే, శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది.. ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది. దీని కారణంగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది.
శరీరంలో వాపు సమస్య: తగినంత నిద్ర లేకపోవడం వల్ల వాపు, ఒత్తిడిని పెంచే హార్మోన్లు శరీరంలో పెరగడం ప్రారంభిస్తాయి. ఈ వాపు ధమనికి హాని కలిగించవచ్చు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.
గుండె చప్పుడులో మార్పు: నిద్ర లేకపోవడం వల్ల, గుండె కొట్టుకోవడం సక్రమంగా ఉండదు.. చప్పుడులో మార్పు సంభవించే ప్రమాదం ఉంది. దీనిని అరిథ్మియా అని పిలుస్తారు. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, రాత్రిపూట ఎక్కువసేపు మెలకువగా ఉండకూడదు.. పూర్తిగా నిద్రపోవాలి.
ఊబకాయం వచ్చే ప్రమాదం: రాత్రిపూట ఎక్కువ సేపు మెలకువగా ఉండే వారికి అతిగా తినడం అలవాటు అవుతుంది. పేలవమైన నిద్ర ఆకలిని పెంచుతుంది. ఎందుకంటే ఇది ఆకలిని ప్రేరేపించే హార్మోన్‌ను విడుదల చేస్తుంది.. ఇది ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది.. గుండె జబ్బులకు ప్రధాన కారణం అధిక బరువు.. కావున జీవనశైలిలో మార్పు చేసుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చు..
గుండె సమస్యలు: నిద్ర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.. ఇది స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. మంచి గుండె ఆరోగ్యానికి సరైన నిద్ర అవసరం, కాబట్టి నిద్ర నాణ్యతపై శ్రద్ధ వహించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
