Health Tips: వామ్మో.. రాత్రికి రాత్రే ప్రాణం తీస్తున్న సైలెంట్ కిల్లర్.. అసలు విషయం తెలిస్తే షాకే..
గుండెపోటు తరచుగా రాత్రి లేదా తెల్లవారుజామున సంభవిస్తుంది. ఛాతీలో అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం లేదా అసాధారణ చెమట వంటి సూక్ష్మ లక్షణాలతో కనిపిస్తుంది. ఈ హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అవలంబించడం నివారణ, సకాలంలో వైద్య అందించడం చాాలా ముఖ్యమైనవి.

యువకుల నుంచి పెద్దవాళ్ల వరకు గుండెపోట్లతో మరణించడం ఆందోళన కలిగిస్తుంది. ప్రధానంగా యువతను ఎక్కువగా కబళిస్తుండడం కలవరపెడుతోంది. ఇది ఎక్కువగా పగటిపూట ఒత్తిడితో వస్తుందని మనం అనుకుంటాం.. కానీ నిజానికి చాలా గుండెపోట్లు రాత్రిపూట లేదా తెల్లవారుజామున నిద్రలో సంభవిస్తున్నాయి. మనం పడుకున్నప్పుడు మన శరీరంలో వచ్చే మార్పుల వల్లే ఈ ప్రమాదం పెరుగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే బీపీ, అధిక కొలెస్ట్రాల్ లేదా ఇతర గుండె జబ్బులు ఉన్నవారికి నిద్రలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. రాత్రిపూట వచ్చే గుండెపోటు సంకేతాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అందుకే వాటిని సులభంగా విస్మరించే అవకాశం ఉంది.
నిద్రలో గుండెపోటు ఎందుకు వస్తుంది..?
మన శరీరం ఒక సహజ గడియారం (సిర్కాడియన్ లయ) ప్రకారం పనిచేస్తుంది. దీనివల్ల రాత్రిపూట రక్తపోటు తగ్గుతుంది. కానీ కొన్నిసార్లు ఒత్తిడి, నిద్రలేమి లేదా తెలియని గుండె సమస్యల వల్ల గుండెపై అకస్మాత్తుగా భారం పెరుగుతుంది. పరిశోధనల ప్రకారం.. ప్రతి ఐదు గుండెపోట్లలో ఒకటి అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్యే వస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు లక్షణాలు సరిగా తెలియకపోవడం వల్ల, సహాయం అందేలోపు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది.
రాత్రిపూట గుండెపోటు వచ్చే సాధారణ లక్షణాలు
మీరు నిద్రపోతున్నప్పటికీ.. ఏదో సమస్య ఉందని శరీరం చిన్న సంకేతాలు ఇస్తుంది. ఈ ఐదు లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం:
ఛాతీ నొప్పి: ఛాతీని ఎవరో గట్టిగా పట్టుకున్నట్లుగా అనిపించడం. ఈ నొప్పి నిద్ర నుంచి మిమ్మల్ని మేల్కొల్పవచ్చు. ఈ నొప్పి చేతులు, మెడ, దవడ లేదా వీపుకు కూడా పాకవచ్చు.
ఆకస్మిక శ్వాస ఆడకపోవడం: ఊపిరి పీల్చుకోవడానికి కష్టం కావడం లేదా గాలి సరిపోవడం లేదని అనిపించడం.
అసాధారణ చెమట: స్పష్టమైన కారణం లేకుండా అకస్మాత్తుగా చల్లని, జిగట చెమటలు పట్టడం. ఛాతీలో అసౌకర్యంతో పాటు ఇలా జరిగితే ప్రమాదకరం.
తలనొప్పి లేదా వికారం: కళ్లు తిరగడం, మూర్ఛపోయినట్లు అనిపించడం లేదా వాంతి వస్తుందని అనిపించడం. ఇది గుండెకు రక్త ప్రవాహం తగ్గడాన్ని సూచిస్తుంది.
గుండె దడ: విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా గుండె వేగంగా లేదా క్రమం తప్పి కొట్టుకోవడం.
ఎవరికి ఎక్కువ ప్రమాదం..?
అధిక బీపీ
స్లీప్ అప్నియా
మధుమేహం
స్థూలకాయం
ధూమపానం, మద్యం అలవాటు
ఎక్కువ ఒత్తిడి
నిద్రలో గుండెపోటు రాకుండా నివారణ చిట్కాలు
కొన్ని మంచి అలవాట్ల ద్వారా ఈ ప్రమాదాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు
ఆరోగ్యకరమైన ఆహారం: ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోండి.
క్రమం తప్పకుండా వ్యాయామం: గుండె బలంగా ఉండటానికి రోజూ వ్యాయామం చేయండి.
మంచి నిద్ర: ప్రతిరోజూ తగినంత నిద్ర పోండి. స్లీప్ అప్నియా వంటి సమస్యలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోండి.
మానండి: ధూమపానం, అధికంగా మద్యం సేవించడం పూర్తిగా మానేయండి.
పరీక్షలు: బీపీ, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోండి.
ఒత్తిడి తగ్గించుకోండి: ధ్యానం లేదా యోగా వంటి వాటితో ఒత్తిడిని నియంత్రించండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




