AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep Side Effects: నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలెర్ట్..

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు తింటున్నామో.? ఎప్పుడు నిద్రపోతున్నామో.? చెప్పలేని పరిస్థితి. పని ఒత్తిడి, ఆర్ధిక ఇబ్బందులు.. ఇలా ఎన్నో ప్రెజర్స్..

Sleep Side Effects: నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలెర్ట్..
Sleep
Ravi Kiran
|

Updated on: Feb 17, 2022 | 1:22 PM

Share

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు తింటున్నామో.? ఎప్పుడు నిద్రపోతున్నామో.? చెప్పలేని పరిస్థితి. పని ఒత్తిడి, ఆర్ధిక ఇబ్బందులు.. ఇలా ఎన్నో ప్రెజర్స్ మధ్య ప్రతీ ఒక్కరికీ నిద్ర అనేది తక్కువ అవుతోంది. పని పూర్తి చేసుకుని రాత్రి పొద్దుపోయాక ఇంటికి రావడం.. భోజనం చేసి.. కాసేపు వెబ్ సిరీస్‌లు చూసి ఏ అర్ధరాత్రో నిద్రపోవడం.. ఇప్పుడు అందరూ చేస్తున్న పని. దీనితో నిద్ర అనేది తక్కువైపోతోంది. కనీసం ఆరు గంటల పాటు కూడా నిద్రపోని వారి సంఖ్య ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే తక్కువ సమయం నిద్రపోతున్న వారికి ఓ షాకింగ్ న్యూస్.. తగినంత సమయంలో నిద్రించకపోతే.. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు, నరాల బలహీనత లాంటి రోగాలు వస్తాయట. మరి ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలో ఇప్పుడు చూద్దాం..

  • పుట్టిన దగ్గర నుంచి 3 నెలల వరకు: 14-17 గంటలు
  • 4-11 నెలల మధ్య వయసు ఉన్నవారు: 12-16 గంటలు
  • 1-2 సంవత్సరాలు: 11-14 గంటలు
  • 3-5 సంవత్సరాలు: 10-13 గంటలు
  • 6-12 సంవత్సరాలు: 9-12 గంటలు
  • 13-18 సంవత్సరాలు: 8-10 గంటలు
  • 18-64 సంవత్సరాలు: 7-9 గంటలు
  • 65 ఏళ్లపైబడిన వయస్సువారు: 7-8 గంటలు నిద్రపోవాలి.

నిద్ర తక్కువైతే కనిపించే లక్షణాలు..

తగినంత సమయం నిద్రకపోతే.. మీలో తలనొప్పి, చికాకు, కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మం పాలిపోవడం, ముడతలు ఏర్పడటం, మగత, ఆకలి వేయకపోవడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే నిద్ర సరిపోకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. నిద్ర తక్కువ కావడం వల్ల హైబీపీ కూడా వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పనిసారిగా వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.