AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care Tips: మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌గా కార్న్ ఫ్లేక్స్ తింటున్నారా..? అయితే మీ ఆరోగ్యం జర భద్రం..!

ఇది రోజువారీ ఆహారంగా తీసుకోవడం మంచిది కాదు. ఇందులో అధిక-కార్బ్, తక్కువ-ప్రోటీన్ అల్పాహారం ఇది. దీంతో మీకు త్వరగా ఆకలిగా అనిపించేలా చేసి.. రోజులో ఎక్కువ తినడానికి కారణం కావచ్చు. ఇందులో

Health Care Tips: మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌గా కార్న్ ఫ్లేక్స్ తింటున్నారా..? అయితే మీ ఆరోగ్యం జర భద్రం..!
Cornflakes
Jyothi Gadda
|

Updated on: Nov 01, 2022 | 12:30 PM

Share

ప్రస్తుత మంతా బిజీ లైఫ్‌.. ఈ కాలంలో రెడీ టూ ఇట్‌ ఫుడ్‌ ఐటమ్స్‌కే జనాలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందులో ముఖ్యంగా అల్పాహారంగా తృణధాన్యాలు సాధారణంగా మారిపోయింది. అవి వివిధ రకాలైన రుచుల్లో అందరికీ నచ్చేలా అందుబాటులో ఉంటున్నాయి. కార్న్‌ఫ్లేక్స్ ఆరోగ్యకరమైనవి, రుచులతో సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి కాబట్టి, చాలా మంది ఉదయాన్నే అల్ఫాహారం కోసం వాటిని తీసుకుంటారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే, ఇలాంటివి అదనపు చక్కెరతో కూడిన అత్యధిక ప్రాసెస్ చేయబడిన భోజనం. మీరు ఇలాంటి ఎక్కువ చక్కెర కంటెంట్‌ ఆహారాలను తిన్నప్పుడు, ముఖ్యంగా అధిక ప్రాసెస్ చేయబడిన, తక్కువ ఫైబర్ కలిగిన తృణధాన్యాల ఫుడ్‌ తినటం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి.

బ్రేక్ ఫాస్ట్‌లో కార్న్‌ఫ్లేక్స్‌తో కలిగే దుష్ప్రభావాలు.. తృణధాన్యాలలో ఉండే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ (HFCS), గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. ఇది రోజువారీ ఆహారంగా తీసుకోవడం మంచిది కాదు. ఇందులో అధిక-కార్బ్, తక్కువ-ప్రోటీన్ అల్పాహారం ఇది. దీంతో మీకు త్వరగా ఆకలిగా అనిపించేలా చేసి.. రోజులో ఎక్కువ తినడానికి కారణం కావచ్చు. ఇందులో కొవ్వు తక్కువగా ఉన్నప్పటికీ, వాటిలోని అధిక చక్కెర కంటెంట్ ఇన్సులిన్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. గ్లూకోస్ టాలరెన్స్‌ను తగ్గిస్తుంది.

టైప్-2 డయాబెటిస్ కేసుల పెరుగుదలకు కార్న్‌ఫ్లేక్స్ అనుసంధానించబడ్డాయి. బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా తృణధాన్యాలు తినడం వల్ల మీరు తక్కువ కేలరీలను వినియోగించుకోవచ్చు, కానీ అలా చేయడం వల్ల చక్కెరను నిర్వహించే మీ శరీర సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. షుగర్, మాల్ట్ ఫ్లేవరింగ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనేవి వీటిలోని ప్రధాన పదార్థాలు. వీటిలో ఎక్కువ పదార్ధాలలో చాలా భాగం హై గ్లైసెమిక్ ఇండెక్స్ అనే అధిక కంటెంట్ కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి హై GI కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే దానిద్వారా ప్రమాదం పొంచి ఉంది. చాలా మంది పాలలో కార్న్ ఫ్లేక్స్ వేసుకుని తింటారు, ఇష్టమైన పాలు, కార్న్ ఫ్లేక్స్ అనేవి ఆరోగ్యకరమైనవి అని అనుకుంటాం. కానీ ఇది మంచిది కాదని అధ్యయనాల్లో తేలింది.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‏గా కార్న్ ఫ్లేక్స్ బదులుగా వీట్ ఫ్లేక్స్, ఓట్మీల్ తీసుకోవడం మంచిది. అలాగే వోట్మీల్, యాపిల్, అరటి పండ్లను పాలల్లో కలుపుకోని తినవచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్ వలన శరీరానికి ఇన్సూలిన్ పెంచుతాయి. మొలకెత్తిన గింజలను ఉదయం అల్పాహారంగా తినడం మంచిది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి