AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఉదయం లేవగానే వీటిని తింటున్నారా.? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే..

ఉదయం లేవగానే తీసుకునే ఆహారం శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే పరిగడుపున మంచి ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఉదయం ఆరోగ్యకరమైన బ్రేక్‌ ఫాస్ట్ తీసుకుంటే రోజంతా సాఫీగా సాగుతోంది. అయితే...

Health: ఉదయం లేవగానే వీటిని తింటున్నారా.? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే..
Healthy Food
Narender Vaitla
|

Updated on: Nov 08, 2022 | 9:18 PM

Share

ఉదయం లేవగానే తీసుకునే ఆహారం శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే పరిగడుపున మంచి ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఉదయం ఆరోగ్యకరమైన బ్రేక్‌ ఫాస్ట్ తీసుకుంటే రోజంతా సాఫీగా సాగుతోంది. అయితే మనలో చాలా మంది ఉదయం తీసుకునే ఆహారంపై పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఏది పడితే అది తినేస్తుంటారు. మీరు కూడా ఇలాగే ఏది పడితే దానిని తీసుకుంటున్నారా.? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పరిగడుపున ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలేంటో ఓ లుక్కేయండి..

* ఉదయం లేవగానే ఎట్టి పరిస్థితుల్లో సిట్రస్‌ పండ్లను తీసుకోకూడదు. ఉదాహరణకు నిమ్మకాయ, ఆరేంజ్‌ వంటి పండ్లకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల అల్సర్‌, గ్యాస్‌ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి.

* ఇక ఉదయం నిద్రలేవగానే ఎక్కువగా కారం, ఉప్పు ఉండే ఆహార పదార్థలను తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల కడుపులో మంట, వికారం వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కాబట్టి వీలైనంత వరకు తక్కువ కారం, ఉప్పు ఉండే ఉడికించిన ఆహారమే తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* సాధారణంగా బ్రేక్‌ ఫాస్ట్‌లో పూరి వంటి ఆయిల్‌తో చేసిన టిఫిన్స్‌ తీసుకుంటుంటారు. అయితే ఆయిల్‌ ఫుడ్ తీసుకోవడం వల్ల కడపులో గ్యాస్‌ ఫామ్‌ అవుతుంది. వీటివల్ల చాతిలో మంట, ఉదర సంబంధిత రుగ్మతలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.

* ఉదయం ఎట్టి పరిస్థితుల్లో సోడా, కూల్‌ డ్రింక్స్‌ వాటికి దూరంగా ఉండాలి. ఇందులో ఉండే టానిక్‌ యాసిడ్‌లు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తారు.

* పరిగడుపున తీసుకోకూడని ఆహార పదార్థాల్లో స్వీట్లు కూడా ప్రధానమైనవి ఇలాంటి వాటిని తీసుకుంటే పొట్ట భాగంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది.

* టీ, కాఫీలకు కూడా దూరంగా ఉండాలి. వీటి వల్ల కూడా యాసిడ్ స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలనే పాటించాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!