AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood infection: వామ్మో.. పెరుగుతున్న బ్లడ్ ఇన్ఫెక్షన్ కేసులు.. అసలు కారణాలు ఇవేనట

బ్లడ్ ఇన్ఫెక్షన్.. గత కొంతకాలంగా పదేపదే వింటున్న మాట ఇది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. డాక్టర్లు చెప్పే మొదటి మాటకూడా ఇదే. అయితే నిజంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యలు భారీగా పెరుగుతున్నాయా? పెరిగితే అందుకు గల కారణాలేంటి? బ్లడ్ ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ స్టోరీ లో తెలుసుకుందాము

Blood infection: వామ్మో.. పెరుగుతున్న బ్లడ్ ఇన్ఫెక్షన్ కేసులు.. అసలు కారణాలు ఇవేనట
Blood Infection Causes
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Nov 01, 2025 | 10:05 AM

Share

మన శరీరంలో అన్ని అవయవాలలాగే రక్తానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. దానిని మెడికల్ లాంగ్వేజ్ లో సెస్పిస్ అంటారు. ఇది ఎక్కువగా రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవాళ్లలో, మధుమేహుల్లో, మద్యపానం ఎక్కువగా తీసుకునేవాళ్లలో, కాలేయ జబ్బులున్నవాళ్లలో, కేన్సర్‌ రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది ఈ మధ్య పెద్దవాళ్లతో పాటు చిన్నపిల్లలోను ఎక్కువగా వస్తుంది.

మైల్డ్‌, మోడరేట్‌, సివియర్‌ ఈ మూడు రకాల్లో ఉండే ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్.. కొన్నిసార్లు యాంటిబయోటిక్స్‌ తో, మోడరేట్‌ సెప్సిస్‌ను ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్లతో నయం చేసుకోవచ్చంటున్నారు డాక్టర్లు. అయితే ఇది సీవియర్‌గా మారితే మాత్రం రక్తపోటు వచ్చే అవకాశం ఉందంటున్నారు. శరీర అంతర్గత అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ రక్తంలో కలిసే అవకాశాలుంటాయని చెబుతున్నారు. ఇక పుట్టిన పిల్లల్లో రోగనిరోధక శక్తి స్టార్ట్ అవ్వకముందే.. పేగుల్లో, చర్మంలో వచ్చే ఇన్ఫెక్షన్లు రక్తంలోకి చొచ్చుకువచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. తల్లిపాలు ఎక్కువగా తీసుకోని, ఆహారం సరిగ్గా తీసుకోని పిల్లల్లో ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుందంటున్నారు. పెద్దవాళ్లు, వృద్దుల్లో కూడా ఇదే జరుగుతుందని.. పైగా షుగర్, బీపీలకు గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు కూడా వాటికి జోడవుతున్నాయుంటన్నారు.

డయేరియా లాంటివి వచ్చినప్పుడు కూడా రక్తంలో బ్యాక్టీరియా చొచ్చుకుపోయే అవకాశం ఉందుంటన్నారు డాక్టర్లు. వయస్సుతో సంబంధం లేకుండా వచ్చే ఈ జ్వరాలు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగాను మారే అవకాశం ఉంది చెబుతున్నారు. కొన్ని రకాల బ్యాక్టిరియాలు యాంటిబయోటిక్స్ ని సైతం తట్టుకుంటాయని.. ఇక చాలా రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రెండు లేదా మూడు రోజలకంటే ఎక్కువగా జ్వరం ఉన్నా.. అది తగ్గకపోయినా డాక్టర్ల దగ్గరికి వెళ్లి వైద్యం తీసుకోవాలని సూచిస్తున్నారు.

అయితే గతకొంతకాలంగా ప్రతీదానికి బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటూ కొంతమంది డాక్టర్లు చెతున్నారని.. కొందరు డాక్టర్లు అంటున్నారు. ఏదైనా జ్వరంతో తమదగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు.. మలేరియా, టైఫాయిడ్ వంటి టెస్టుల్లో నెగటీవ్ వస్తే, కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇంకా ఏదైనా చిన్నచిన్న ఇష్యూస్ ఉన్నా.. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెబుతున్నారని.. పెరుగుతున్న బ్లడ్ ఇన్ఫెక్షన్ కేసుల వలన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..