తల్లిపాలలో ప్లాస్టిక్ రేణువులు.. శరీరభాగాలపై తీవ్రప్రభావం.. సర్వే షాకింగ్ రిపోర్ట్
ప్లాస్టిక్ మన రెగ్యులర్ లైఫ్‌లో ఒక భాగం అయిపోయింది. ఇంటా బయట ఎక్కడైనా ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయింది. వాటర్ బాటిల్, టీ కప్, ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్‌తో ముడిపడింది. మనిషి శరీరంపై ప్లాస్టిక్ ప్రభావం అంశంపై చేసిన తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మన లైఫ్‌లో ప్లాస్టిక్ ఒక భాగం అయిందని మనం అనుకుంటున్నాం.. కానీ ప్లాస్టిక్ మన శరీరంలోనే భాగం అయింది. అర్థం కాలేదా? ఈ స్టోరీలోకి రండి. అమెరికా, ఆస్ట్రియా దేశాల తాజా పరిశోధనలో షాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాస్టిక్ ఉపయోగం మానవ జాతి మనుగడకు ముప్పులా మారింది.
ప్లాస్టిక్ మన రెగ్యులర్ లైఫ్‌లో ఒక భాగం అయిపోయింది. ఇంటా బయట ఎక్కడైనా ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయింది. వాటర్ బాటిల్, టీ కప్, ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్‌తో ముడిపడింది. మనిషి శరీరంపై ప్లాస్టిక్ ప్రభావం అంశంపై చేసిన తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మన లైఫ్‌లో ప్లాస్టిక్ ఒక భాగం అయిందని మనం అనుకుంటున్నాం.. కానీ ప్లాస్టిక్ మన శరీరంలోనే భాగం అయింది. అర్థం కాలేదా? ఈ స్టోరీలోకి రండి. అమెరికా, ఆస్ట్రియా దేశాల తాజా పరిశోధనలో షాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాస్టిక్ ఉపయోగం మానవ జాతి మనుగడకు ముప్పులా మారింది. ప్లాస్టిక్‌లో ఉండే అత్యంత సూక్ష్మరూపంలో ఉండే ప్లాస్టిక్ రేణువులు గాలిలో చేరుతున్నాయి. ,మనం తీసుకునే డ్రింక్, ఫుడ్ ద్వారా నీరు, ఆహారంలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల రేణువులు గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి హృదయం, మెదడు, మూత్రపిండాలు, కాలేయం ఇలా శరీరంలోని ప్రతి అవయవంపై దుష్ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
అంత కంటే డేంజర్‌గా తల్లిపాలలో కూడా ప్లాస్టిక్ రేణువులను గుర్తించారు పరిశోధకులు. తల్లి పాల ద్వారా అప్పుడే పుట్టిన పిల్లలకు ఆహారంగా ప్లాస్టిక్ రేణువులు మారుతున్నాయి అని భయంకర విషయాన్ని గుర్తించారు. దీంతో పాటు మగవారి వీర్య కణాల లోకూడా మైక్రోప్లాస్టిక్ ఆనవాళ్లను గుర్తించారు పరిశోధకులు. దీని ద్వారా సంతానోత్పత్తిపై కూడా ప్లాస్టిక్ ప్రభావం పెద్దగా ఉందని తెలిపారు. తాజా ఫలితాలను బట్టి పురుషుల సంతానోత్పత్తి సామర్త్యంపై ప్లాస్టిక్ ప్రభావం బాగా ఉందని గుర్తించినట్టు అమెరికా, ఆస్ట్రియా పరిశోధ కులు తెలిపారు. 30 మంది పురుషుల నుంచి సేకరించిన వీర్యకణాలను విశ్లేషించగా.. 11 నమూనాల్లో మైక్రోప్లాస్టిక్‌ను గుర్తించినట్టు తెలిపారు. మనం రోజూ వాటర్ తాగే లీటర్ ప్లాస్టిక్ బాటిల్లో 2,40,000 ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..