Aadhar Card Update: ఆధార్ కార్డు అప్‌డేట్‌కు మరో అవకాశం.. ఆ రోజు వరకూ ఉచితంగానే..
ఆధార్ కార్డులో తప్పులను సరిచేసుకోవడానికి ఈనెల 14 వరకూ ఆన్ లైన్ లో అవకాశం ఉన్నట్లు తొలుత యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) పేర్కొంది. అయితే ఆ డెడ్ లైన్ అప్ డేట్ చేసింది. 2024, జూన్ 14 వరకూ ఆన్ లైన్లో ఉచితంగా అప్ డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. చిరునామా, పేర్లలో అక్షర దోషాలను సరిచేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ సమర్పించాలి.
దేశంలో ప్రజలందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అది అందరికీ ఒక గుర్తింపు లాంటింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక పథకాలకు ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపుగా తీసుకుంటారు. ఆధార్ కార్డులో మన పేరు, తండ్రి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. ఒక్క చిన్న తప్పు ఉన్నా మన దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో తప్పులను సరిచేసుకోవడానికి ఈనెల 14 వరకూ ఆన్ లైన్ లో అవకాశం ఉన్నట్లు తొలుత యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) పేర్కొంది. అయితే ఆ డెడ్ లైన్ అప్ డేట్ చేసింది. 2024, జూన్ 14 వరకూ ఆన్ లైన్లో ఉచితంగా అప్ డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. చిరునామా, పేర్లలో అక్షర దోషాలను సరిచేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ సమర్పించాలి. అలాగే నమోదు కేంద్రాల వద్దకు వెళ్లి కార్డులో తప్పులను సరిచేసుకోవచ్చు.
తప్పులను సరిచేసుకునే అవకాశం..
దేశంలో ప్రజలందరికీ ఆధార్ కార్డులను మంజూరు చేసే ముందు ప్రతి గ్రామంలోనూ శిబిరాలు నిర్వహించారు. ప్రజలందరి వివరాలు నమోదు చేసి, కార్డులు జారీ చేశారు. ఆ సమయంలో మన పేర్లలో కొన్ని అక్షర దోషాలు దొర్లాయి. అలాగే మనం ఉద్యోగం, వ్యాపారం రీత్యా సొంత ఊరిని వదిలి ఇతర ప్రాంతాలకు వెళుతుంటాం. అక్కడే కుటుంబంతో సహా ఉండే అవసరం పడొచ్చు. అప్పుడు మన ఆధార్ కార్డులో చిరునామాను మార్చుకోవాలి. ఇందుకు మనకు అవకాశం ఉంది. మీసేవ కేంద్రాలు, పోస్టాఫీసులు, మన రాష్ట్రంలో అయితే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ల లోనూ మన ఆధార్ కార్డులో తప్పులను, చిరునామాను మార్చుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలన్నీ నమోదు..
పుట్టిన శిశువు నుంచి పెద్దవారి వరకూ అందరికీ ఆధార్ కార్డును ప్రభుత్వం జారీ చేస్తుంది. ప్రతి భారతీయ పౌరుడు తప్పనిసరిగా తప్పులు లేకుండా, కచ్చిత చిరునామాతో ఉన్న ఆధార్ కార్డును కలిగి ఉండాలి. ఈ కార్డు ద్వారా 12 అంకెల సంఖ్యను మనకు కేటాయిస్తారు. మన బయోమెట్రిక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం కూడా నమోదు చేస్తారు.
అప్ డేట్ తప్పనిసరి..
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లినప్పుడు, ఆధార్ కార్డులో పేరు, ఇతర వివరాల్లో తప్పులు ఉన్నప్పుడు వాటిని సరి చేసుకోవాలన్న విషయం తెలిసిందే. అయితే మీరు ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండి, మీ కార్డులో వివరాలన్నీ సక్రమంగా ఉన్నా కార్డును అప్ డేట్ చేసుకోవాలి. అంటే మీకు ఆధార్ కార్డు మంజూరై పదేళ్లు దాటితే, దానిని అప్ డేట్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో ఈ మార్పులకు అవకాశం ఉంది. పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా, పుట్టిన తేదీ తదితర ప్రాథమిక సమాచారంతో పాటు తమ బయోమెట్రిక్‌లను (వేలిముద్ర, కన్ను) ఆధార్ కార్డుకు లింక్ చేస్తారు.
ఆధార్ కార్డును ఆన్ లైన్ లో అప్ డేట్ చేసుకునే విధానం..
- https://uidai.gov.in/లో వెబ్ సైట్ లోకి వెళ్లండి.
- హోమ్ పేజీలో మై ఆధార్ పోర్టల్ పై క్లిక్ చేయండి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి.
- మీ ప్రొఫైల్‌లో కనిపిస్తున్న మీ సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.
- ఆ వివరాలన్నీ సక్రమంగా ఉంటే ’ ఐ వెరిఫై దట్ ది అబోవ్ డిటైల్ ఆర్ కరెక్ట్‘ అనే బాక్స్ లో టిక్ పెట్టండి.
- ఒకవేళ సమాచారం తప్పుగా ఉంటే గుర్తించండి. దానిని సరిచేయడానికి మీరు ఏదైనా ప్రూఫ్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డ్రాప్-డౌన్ మెను నుంచి ఆ ప్రూఫ్ ను సెలెక్ట్ చేయాలి.
- మీరు సబ్మిట్ చేసే ప్రూఫ్ నిర్దేశిత నమూనాలో ఉండాలి. నిలువుగా ఉండేలా చూసుకోవాలి. జేపీఈజీ, పీఎన్ జీ, పీడీఎఫ్ పద్ధతితో 2 ఎంబీ కంటే తక్కువగా ఉండాలి.
- డ్రాప్ డౌన్ మెనూ నుంచి ప్రూఫ్ ను ఎంచుకుని, సబ్మిట్ చేయాలి, ఆ తర్వాత సబ్మిట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
నమోదు కేంద్రాల్లో అప్‌డేట్ చేసుకునే విధానం..
- ఆన్ లైన్ విధానంతో పాటు నమోదు కేంద్రాల్లోనూ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ కింద సూచనలు పాటిస్తే మీ పని మరింత సులభంగా జరుగుతుంది.
- https://bhuvan-app3.nrsc.gov.in/aadhaar వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- సమీపంలో ఉన్న కేంద్రాలు అనే దానిపై క్లిక్ చేసి, మీరు ఉండే ప్రాంతం వివరాలు నమోదు చేయండి.
- సమీపంలోని ఆధార్ కేంద్రాలను గుర్తించేందుకు పిన్ కోడ్‌ను కూడా ఉపయోగించవచ్చు.
- మీ సమీపంలో కేంద్రం వివరాలు వచ్చాక, అక్కడకు వెళ్లి మీ ఆధార్ కార్డులో వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు.
- అప్‌డేట్ పూర్తయిన తర్వాత యూఎన్ డీఏఐ వెబ్‌సైట్ నుంచి 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఉపయోగించి మీ తాజా కాకార్డ్ హోల్డర్‌లు తమ తాజా ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..