AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep Disorders: మీకూ రాత్రి నిద్రలో పదే పదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకున్నారో కథ కంచికే..

రాత్రిపూట తరచుగా మేల్కొనే వారికి తగినంత నిద్ర ఉండదు. ఇలా నిద్ర రాకపోతే దానిని సాధారణ సమస్యగా విస్మరించకూడదు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం రాత్రిపూట తరచుగా మేల్కొని తగినంత నిద్ర లేకపోతే అది గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది..

Sleep Disorders: మీకూ రాత్రి నిద్రలో పదే పదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకున్నారో కథ కంచికే..
Heart Attack Risk With Sleep Disorders
Srilakshmi C
|

Updated on: Feb 05, 2026 | 9:42 PM

Share

ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా చేయవల్సింది సరిగ్గా నిద్రపోవడం. రాత్రిపూట తరచుగా మేల్కొనే వారికి తగినంత నిద్ర ఉండదు. ఇలా నిద్ర రాకపోతే దానిని సాధారణ సమస్యగా విస్మరించకూడదు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం రాత్రిపూట తరచుగా మేల్కొని తగినంత నిద్ర లేకపోతే అది గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే ఇది అనేక ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. పరిశోధన ప్రకారం ఒక వ్యక్తి రాత్రి పూట కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. లేకుంటే అది ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. మీకు కూడా నిద్రపోతున్నప్పుడు తరచుగా మెలకువ వస్తుందా? దీనివల్ల మీ నిద్ర చెదిరిపోతుందా? ఇలా ఎందుకు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం తగినంత నిద్ర రాని వారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. తగినంత నిద్ర రానప్పుడు శరీరం తనను తాను పూర్తిగా రిపేర్ చేసుకునే అవకాశం లభించదు. ఇది గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. అంతే కాదు ఇది మెదడును కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధనలో వెల్లడైంది.

నిద్ర భంగం గుండెకు ఎలా ప్రమాదకరమంటే..?

మంచి రాత్రి నిద్రలో గుండె విశ్రాంతి పొందుతుంది. దీంతో రక్తపోటు సాధారణ స్థాయిలో ఉంటుంది. కానీ నిద్రలో పదేపదే అంతరాయం కలిగితే, గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది వాపుకు దారితీస్తుంది. అంతేకాకుండా, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. రాత్రికి 2 నుంచి 3 సార్లు మేల్కొనే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30% ఎక్కువగా ఉంటుంది. నిద్రలో తరచుగా మేల్కొనడానికి కారణం మీ మెదడు. అంటే మీరు నిద్రపోయిన తర్వాత కూడా అది మరింత చురుకుగా ఉంటుంది. దీని అర్థం మీరు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవచ్చు లేదా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని అర్థం. మానసిక ఒత్తిడి ఉంటే అది గుండెను కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మానసిక ఒత్తిడి గుండెపోటుకు ఒక సాధారణ కారణం. అందువల్ల మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీకూ రాత్రి సమయంలో తరచుగా మేల్కొనే సమస్య ఉంటే తప్పకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

ఈ సమస్య ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది?

  • స్లీప్ అప్నియాతో బాధపడేవారు.
  • మానసిక ఒత్తిడికి లోనయ్యే వారు.
  • రాత్రిపూట మొబైల్ ఫోన్లు వాడేవారు లేదా టీవీ చూసే వారు.

ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఏమి చేయాలి?

  • పడుకునే ముందు మొబైల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండండి.
  • ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని మేల్కొనే అలవాటును పెంచుకోవాలి.
  • రాత్రిపూట టీ, కాఫీ తాగకూడదు.
  • మానసిక ఒత్తిడిని నివారించాలి.
  • ప్రతిరోజూ యోగా సాధన చేయాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.