Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీటిని లైట్ తీసుకుంటున్నారా..? యమ డేంజర్.. ఈ ప్రమాదకరమైన వ్యాధుల లక్షణాలు కావచ్చు..

తరచుగా ప్రజలు నోటి పూతలను.. నోట్లో అల్సర్ పుండ్లను తేలికగా తీసుకుంటారు. ఇది ఒక సాధారణ సమస్య అని ప్రజలు భావిస్తారు. ఇది కాలక్రమేణా నయమవుతుంది.. కానీ ఇది పదే పదే నోటి పూత, లేదా నోటిలో బొబ్బలు వస్తుంటే అది ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. నోటిలో లేదా నాలుకపై బొబ్బలు ఉంటే తినడానికి, త్రాగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది.

వీటిని లైట్ తీసుకుంటున్నారా..? యమ డేంజర్.. ఈ ప్రమాదకరమైన వ్యాధుల లక్షణాలు కావచ్చు..
Mouth Ulcers
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 10, 2025 | 11:20 AM

తరచుగా ప్రజలు నోటి పూతలను.. నోట్లో అల్సర్ పుండ్లను తేలికగా తీసుకుంటారు. ఇది ఒక సాధారణ సమస్య అని ప్రజలు భావిస్తారు. ఇది కాలక్రమేణా నయమవుతుంది.. కానీ ఇది పదే పదే నోటి పూత, లేదా నోటిలో బొబ్బలు వస్తుంటే అది ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. నోటిలో లేదా నాలుకపై బొబ్బలు ఉంటే తినడానికి, త్రాగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వ్యక్తి సాధారణ ఆహారానికి దూరంగా ఉండటం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే బాధితుడు ఒకటి లేదా రెండు రోజులు ఆహారం తినకుండా ఉంటాడు.. దీంతో ఇది చాలా సమస్యలను కలిగిస్తుంది..

తరచుగా నోటి పూతలు రావడం ఒక సాధారణ సమస్యలా అనిపించవచ్చు.. కానీ అది చాలా కాలం పాటు కొనసాగితే, దానిని విస్మరించవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, కొన్నిసార్లు నోటిలో లేదా నాలుకపై బొబ్బలు ఉంటే నొప్పి కూడా వస్తుంది. నోటిలో మంట, నొప్పి, జలదరింపు లాంటి సమస్యలు ఏర్పడతాయి.. మీకు పదే పదే బొబ్బలు వస్తుంటే, దానిని విస్మరించవద్దు.. ఎందుకంటే అది శరీరంలోని ఒక పెద్ద సమస్యను సూచిస్తుంది. నిరంతరం నోటి అల్సర్లు వెనుక ఏ వ్యాధులు ఉంటాయి..? దానిని ఎలా నివారించవచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

నోటిలో పుండ్లు రావడానికి కారణాలు

పోషకాహార లోపం: శరీరంలో విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లేకపోవడం వల్ల బొబ్బలు వస్తాయి.

జీర్ణ సమస్యలు: కడుపులో వేడి, మలబద్ధకం లేదా ఆమ్లత్వం వంటి సమస్యల కారణంగా, నోటిలో తరచుగా పుండ్లు రావచ్చు. కడుపులో అధిక వేడి లేదా గ్యాస్ సమస్య ఉంటే తరచూ నోంట్లో బొబ్బలు వస్తాయి.. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్‌ ను సంప్రదించడం మంచిది.

నోటి ఇన్ఫెక్షన్: నోటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే, బాక్టీరియల్ – ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా అల్సర్లు సంభవించవచ్చు.

హార్మోన్ల మార్పులు :  ఋతుస్రావం లేదా గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా స్త్రీలకు బొబ్బలు రావచ్చు.

చెడు జీవనశైలి: ఎక్కువ కారంగా, వేయించిన ఆహారం తినడం, ధూమపానం – మద్యం సేవించడం వల్ల కూడా నోటి పూత వస్తుంది.

నోటి పూత.. అల్సర్లు ఏ వ్యాధులను సూచిస్తాయంటే..

రక్తహీనత- శరీరంలో ఇనుము లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది, దీనివల్ల తరచుగా బొబ్బలు వస్తాయి.

డయాబెటిస్ – రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తి తగ్గుతుంది, ఇది నోటి ఇన్ఫెక్షన్లు మరియు అల్సర్లకు కారణమవుతుంది.

సోరియాసిస్ లేదా ఇతర చర్మ వ్యాధులు – ఇది ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి, దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తుంది. ఇది బొబ్బలకు కారణమవుతుంది.

నోటి క్యాన్సర్ – ఎవరికైనా చాలా కాలంగా నోటి పూతల ఉండి కూడా నయం కాకపోతే.. అది కూడా నోటి క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ఈ రోజుల్లో ఇది ఒక సాధారణ సమస్యగా మారుతోంది. పాన్ మసాలా, గుట్కా తినడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

నోటి పూతలను నివారించడానికి కొన్ని చర్యలు ఉన్నాయి.. వీటిని పాటించడం ద్వారా మీరు ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు.

  • ప్రతిరోజూ బ్రష్ చేసుకోండి.. మీ నోటి పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోండి.
  • ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు – పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
  • ఎక్కువ కారంగా ఉండే.. అలాగే వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
  • పుష్కలంగా నీరు త్రాగండి.. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచండి.
  • ధూమపానం, మద్యం మానుకోండి.
  • 10-15 రోజుల్లో బొబ్బలు మానిపోకపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..