AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నీ ఇదెక్కడి అధ్యయనంరా బాబూ.. మద్యం మానేసిన వారిలో తగ్గుతున్న మంచి కొలెస్ట్రాల్..!

ఒక కొత్త అధ్యయనం సరికొత్త చర్చకు దారితీసింది. మద్యం మానేసిన వారిలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది. జపాన్‌లో 10 సంవత్సరాలుగా ప్రజల జీవనశైలిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, మద్యం సేవించడం కొనసాగించే వారితో పోలిస్తే మద్యం తాగడం మానేసిన వారిలో..

ఓర్నీ ఇదెక్కడి అధ్యయనంరా బాబూ.. మద్యం మానేసిన వారిలో తగ్గుతున్న మంచి కొలెస్ట్రాల్..!
Alcohol
Shaik Madar Saheb
|

Updated on: Mar 15, 2025 | 12:41 PM

Share

ఒక కొత్త అధ్యయనం సరికొత్త చర్చకు దారితీసింది. మద్యం మానేసిన వారిలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది. జపాన్‌లో 10 సంవత్సరాలుగా ప్రజల జీవనశైలిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, మద్యం సేవించడం కొనసాగించే వారితో పోలిస్తే మద్యం తాగడం మానేసిన వారిలో LDL లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉందని, HDL లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిందని తేలింది. అయితే, దీనిపై మరింత అధ్యయనం అవసరమని నిపుణులు తెలిపారు. ఈ అధ్యయనం ఇంకా తుది దశకు చేరుకోలేదని నిపుణులు అంటున్నారు. రాబోయే కాలంలో దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరం. అమెరికాలోని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులతో సహా జపాన్ పరిశోధకులు.. అక్టోబర్ 2012 నుంచి అక్టోబర్ 2022 వరకు దాదాపు 57,700 మంది వ్యక్తులపై, సెంటర్ ఫర్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో నిర్వహించిన 3.2 లక్షలకు పైగా వార్షిక ఆరోగ్య పరీక్షలను అధ్యయనం చేశారు.

మద్యం తాగేవారిలో మంచి కొలెస్ట్రాల్..

ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధన ఫలితాలు ప్రజలలో వ్యతిరేక ప్రభావాన్ని చూపించాయి.. మద్యం సేవించడం వల్ల కొలెస్ట్రాల్‌లో స్వల్ప మెరుగుదల కనిపిస్తుంది.. కానీ ప్రజలు మద్యపానం మానేసిన తర్వాత, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్లు కనిపించింది.

ఇప్పుడు మరింత అధ్యయనం అవసరం- నిపుణులు

ఆల్కహాల్ ఈ ప్రభావాలకు కారణమవుతుందని అధ్యయనం ప్రత్యక్షంగా నిరూపించలేదు.. అయితే కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి ఆల్కహాల్ అలవాట్లను మార్చుకున్న తర్వాత లిపిడ్ ప్రొఫైల్‌లను పర్యవేక్షించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. “మద్యపానం మానేయడం వల్ల LDL-C పెరుగుదల, నిరంతర మద్యపానంతో పోలిస్తే HDL-C స్థాయిలు తగ్గడం జరుగుతుంది” అని అధ్యయన నిపుణులు రాశారు.

అదనంగా, ఆల్కహాల్ తీసుకోవడం ప్రారంభించడం వల్ల కొలెస్ట్రాల్‌లో స్వల్ప మెరుగుదలలు సంభవించాయని, ఆల్కహాల్ మానేయడం వల్ల తక్కువ అనుకూలమైన మార్పులు వచ్చాయని పరిశోధకులు తెలిపారు. అయితే, నిపుణులు అధ్యయనం పద్దతిలో కొన్ని సమస్యలను లేవనెత్తారు. వీరంతా ఎక్కువగా తాగేవారు అయి ఉండవచ్చు అని ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయంలో అధ్యయనంపై సీనియర్ లెక్చరర్ స్టీఫెన్ బ్రైట్ అన్నారు.

మద్యం తాగేవారిలో మంచి కొలెస్ట్రాల్ తగ్గుదల..

2024లో జర్నల్ ఆఫ్ స్టడీస్ ఆన్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్‌లో ప్రచురించిన అధ్యయనం.. 107 ప్రచురించబడిన అధ్యయనాలను సమీక్షించింది.. అవి వృద్ధులలో మితమైన తాగుబోతులపై దృష్టి సారించాయని.. చాలా రోజుల తర్వాత తాగే వారిని.. అప్పుడప్పుడు తాగేవారితో పోల్చాయని చెప్పింది. కెనడాలోని విక్టోరియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్త, ప్రధాన పరిశోధకుడు టిమ్ స్టాక్‌వెల్ ప్రకారం, మద్యం సేవించడం కొనసాగించే వ్యక్తులు సాపేక్షంగా ఆరోగ్యంగా ఉన్నారని ఫలితాలు చూపిస్తున్నాయి. జనవరి 2023లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ఒక ప్రకటనను ప్రచురించింది.. మద్యం తాగే విషయానికి వస్తే, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయని సురక్షితమైనది మొత్తం ఏదీ లేదని.. దీనిపై మరింత అధ్యయనం అవసరం ఉందని పేర్కొంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)