AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hypertension: బీపీ మెడిసిన్ వాడే వాళ్లు ఈ విషయాలు పక్కాగా తెలుసుకోవాలి..

ఇటీవలి కాలంలో హై బీపీ సాధారణమైపోయింది. లైఫ్ స్టైల్ ఇతరత్రా కారణాల వల్ల చిన్న వయస్సులోనే చాలామంది బీపీ బారిన పడుతున్నారు. హైబీపీ ఉన్నా కూడా కొందరికీ లక్షణాలు తెలీవు. అందుకే అప్పుడప్పుడు బీపీ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలానే బీపీకి మెడిసిన్ వాడుతున్నవారు ఈ విషయాలను తెలుసుకోవాలి.

Hypertension: బీపీ మెడిసిన్ వాడే వాళ్లు ఈ విషయాలు పక్కాగా తెలుసుకోవాలి..
Blood Pressure Medicine
Ram Naramaneni
|

Updated on: Aug 11, 2024 | 10:04 PM

Share

బిపి ఉన్నవాళ్లు బీపీ మెడిసిన్స్‌ని ఎంత త్వరగా మొదలు పెడితే అంత త్వరగా గుండె సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు బారిన పడకుండా చూసుకోవచ్చని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. కానీ బీపీకి మందులు వాడుతున్న వాళ్ళు విధిగా కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలంటున్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ పీఎస్ వలీ.

    •  మొట్టమొదట ఫాలో అవ్వాల్సింది రోజు క్రమం తప్పకుండా వాడాలి. రాత్రిపూట వాడాలని సూచించిన మందుల్ని రాత్రిపూట వాడాలి అలా కాకుండా తరచుగా మర్చిపోతూ ఇష్టం వచ్చినట్లు చేసుకోవడం వల్ల మన శరీర వ్యవస్థలు కన్ఫ్యూజ్ అయిపోయే చాన్స్ ఉంది.
    • బిపి మెడిసిన్స్ వాడే వాళ్ళు తెలుసుకోవాల్సిన రెండో అంశం ఎప్పుడైనా విపరీతంగా విరేచనాలు అవుతున్నా, వాంతులవుతున్నా, లేక తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా… లో బీపీ వచ్చే అయ్యే ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి రోజుల్లో ఇంటిదగ్గర బీపీ చూసుకొని బిపి సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉంటే మాత్రమే బిపి టాబ్లెట్స్ వాడాలి.
    • ఆహారంలోఒక్కసారిగా విపరీతంగా మార్పులు చేసినా , బిపిలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆహారంలో పూర్తిగా ఉప్పు తగ్గించినా లేక ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నా క్రమం తప్పకుండా ఇంటి దగ్గర బీపీ చూసుకొని, బీపీలో వచ్చే మార్పులను వైద్యులకు తెలియజేసి వారి సలహా ప్రకారం బిపీకి మెడిసిన్స్ డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది.

పైన చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవ్వడం వల్ల బిపి టాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని మనం చాలా వరకు తగ్గించుకోగలం అని డాక్టర్ పీఎస్ వలీ తెలిపారు.

View this post on Instagram

A post shared by Dr P S Vali (@drpsvali)

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!