AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Depression, Stress: ఈ వృత్తులతో సంబంధం ఉన్న వ్యక్తులు డిప్రెషన్‌కు గురవుతారు.. పరిశోధనలలో కీలక విషయాలు!

Depression, Stress: చాలా మంది ప్రతి రోజు ఒత్తిడికి గురవుతుంటారు. ఉద్యోగంలో, ఆర్థిక ఇబ్బందులు, ఇతర ఉద్యోగుల ఎన్నో విధానాలుగా ప్రతి రోజు డిప్రెషన్‌కు గురవుతుంటారు..

Depression, Stress: ఈ వృత్తులతో సంబంధం ఉన్న వ్యక్తులు డిప్రెషన్‌కు గురవుతారు.. పరిశోధనలలో కీలక విషయాలు!
Depression
Subhash Goud
|

Updated on: May 29, 2022 | 12:06 PM

Share

Depression, Stress: చాలా మంది ప్రతి రోజు ఒత్తిడికి గురవుతుంటారు. ఉద్యోగంలో, ఆర్థిక ఇబ్బందులు, ఇతర ఉద్యోగుల ఎన్నో విధానాలుగా ప్రతి రోజు డిప్రెషన్‌కు గురవుతుంటారు. జీవితంలో డిప్రెషన్‌కు గురవడం సాధారణంగా మారిపోయింది. ప్రైవేట్ రంగాలతో సంబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు తమ కార్యాలయంలో అనేక సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అమెరికా (America)లో జరిగిన ఓ పరిశోధనలో డిప్రెషన్‌కు సంబంధించి అత్యంత సున్నితమైన వృత్తులు ఏవో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే ఈ వృత్తులతో అనుబంధం ఉన్నవారిలోనూ డిప్రెషన్ వేగంగా వస్తోందని గుర్తించారు. అందుకు కారణాలు కూడా చెప్పుకొచ్చారు పరిశోధకులు. వృత్తిపరంగా కూడా చాలా మంది డిప్రెషన్‌కు గురవుతుంటారు.

ఎక్కువగా డిప్రెషన్‌కు గురయ్యే వ్యక్తులు:

☛ ఒక బస్సు డ్రైవర్

ఇవి కూడా చదవండి

☛ ప్రింటింగ్ కంపెనీ ఉద్యోగులు

☛ కస్టమర్ రిక్రూట్‌మెంట్

☛ కారు మెకానిక్

☛ ఉద్యోగులు

☛ క్లీనర్లు

☛ వ్యక్తిగత సహాయకుడు

☛ ఫ్యాక్టరీ కార్మికుడు

☛ సామాజిక కార్యకర్త

☛ స్థిరాస్తి వ్యాపారులు

ఒత్తిడికి కారణాలు ఏమిటి?

పరిశోధనలో వచ్చిన టాప్ 10 వృత్తులు డిప్రెషన్స్‌కు ఎక్కువగా గురవుతాయి. మనం వాటిని గమనిస్తే కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీని ఆధారంగా ఈ వృత్తిలో పనిచేసే వ్యక్తులు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారో అర్థం చేసుకోవడం చాలా సులభం. ఉదాహరణకు.. బస్సు డ్రైవర్‌ను తీసుకోండి. ఒక్కోసారి వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. చాలా రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. టార్గెట్ వల్ల నిద్రలేని రాత్రులు గపడాల్సి ఉంటుంది. పారిశుధ్య కార్మికులను తీసుకుంటే వీరిలో చాలా మంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారు చేసే పనిని ఎవరూ పట్టించుకోరు. ప్రజలు వారిని చిన్నచూపు చూస్తారు. ఈ పరిస్థితులన్నీ మానసికంగా కలవరపెడుతున్నాయి.

బస్సు డ్రైవర్లు పని బాధ్యతల కారణంగా వారాలు, కొన్నిసార్లు నెలల తరబడి ఇంటికి దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలో వారు తమ బస్సు సీట్లలో ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది. తద్వారా వారు తమ ప్రయాణికులను వారి గమ్యస్థానానికి సరిగ్గా తీసుకెళ్లగలరు. అందుకే బస్సులో ప్రయాణించినప్పుడల్లా డ్రైవర్‌, కండక్టర్‌లను ప్రేమగా, గౌరవంగా చూసుకోండి. వారు లేకుండా వారి కుటుంబం కూడా అసంపూర్ణంగా ఉంటుంది.

డిప్రెషన్‌కు గురైతే అనారోగ్య సమస్యలు:

అధికంగా డిప్రెషన్‌కు గురైతే ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. శారీరక సమస్యలకు దారి తీస్తుంది. ఈ ఒత్తిడి వల్ల గుండె సంబంధ వ్యాధులు, మానసిక రుగ్మతల బారినపడతారని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థపైనా ఈ ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. మానసిక ఒత్తిడి ప్రారంభమైన తొలి రోజుల్లో నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ క్రమంలోనే జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు.

(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి