Health Booster: ఆయష్షును పెంచే ‘శృంగారం’.. తాజా పరిశోధనలో విస్తుపోయే నిజాలు..!

ఆరోగ్యం కోసం, ఆరోగ్యవంతమైన జీవనం కోసం మంచి జీవనశైలిని అనుసరించాలని ప్రతి ఆరోగ్య నిపుణుడు, వైద్యులు సూచిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా ధూమపానం మానేయాలని,

Health Booster: ఆయష్షును పెంచే ‘శృంగారం’.. తాజా పరిశోధనలో విస్తుపోయే నిజాలు..!
Sex For Immunity
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Feb 06, 2023 | 7:20 AM

ఆరోగ్యం కోసం, ఆరోగ్యవంతమైన జీవనం కోసం మంచి జీవనశైలిని అనుసరించాలని ప్రతి ఆరోగ్య నిపుణుడు, వైద్యులు సూచిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా ధూమపానం మానేయాలని, మద్యం సేవించొద్దు, ప్రతి రోజూ వ్యాయామం చేయాలని చెబుతుంటారు. తద్వారా శరీరంలోని చెడు కొవ్వు కరిగి, మంచి కొవ్వు ఏర్పడుతుంది. అలాగే, కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలను తీసుకొద్దు. ఇక రాత్రిపూట కంటికి సరిపడా నిద్రపోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి బంధాన్ని కొనసాగించాలి. ఇలాంటి మంచి జీవనశైలి కారణంగా.. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం సొంతమవుతుంది. అలాగే ఆయుష్షు కూడా పెరుగుతుంది.

అయితే, ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లే కాదు.. మరొక కారణం కూడా ఆయుష్షును పెంచుతుందని తాజాగా పరిశోధనలో వెల్లడైంది. శృంగారం వ్యక్తి ఆయుష్షును పెంచుతుందట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఏళ్ల జీవితకాలం పెరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు. శృంగారంలో పాల్గొనే వారిలో మరణ ముప్పు తగ్గుతుందని గుర్తించారు పరిశోధకులు. శృంగారం భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతం. ఈ ఆత్మీయ, సన్నిహిత కలయికతో.. మానసికంగా దృఢంగా మారుతారు. ఫలితంగా కుంగుబాటు, ఒంటరితనం, ఒత్తిడి దరిచేరవని పరిశోధకులు చెబుతున్నారు.

అంతేకాదండోయ్.. శృంగారంలో పాల్గొనడం అంటే వ్యాయామం చేయడమేనని చెబుతున్నారు. తరచుగా శృంగారంలో పాల్గొనే వారిలో ఇమ్యూనిటీ పెరుగుతుందట. వారానికి ఒకటి కన్నా తక్కువసార్లు పోలిస్తే.. వారానికి ఒకట్రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారిపై పరిశోధనలు జరుపగా.. ఈ విషయం గమనించడం జరిగిందని పరిశోధకులు పేర్కొన్నారు. తరచుగా శృంగారంలో పాల్గొనేవారిలో ఇమ్యునోగ్లోబులిన్ ఏ మోతాదులు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనకారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

తరచూ శృంగారంతో రోగనిరోధకశక్తీ బలోపేతమవుతుంది. వారానికి ఒకటి కన్నా తక్కువసార్లు శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే వారానికి ఒకట్రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్‌ ఏ (ఐజీఏ) మోతాదులు ఎక్కువగా ఉంటున్నట్టు వైక్స్‌ యూనివర్సిటీ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఐజీఏ కీలక పాత్ర పోషిస్తుంది. మరి సహజంగా శృంగార జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి? వ్యాయామం వంటి వాటితో పాటు తిండి మీదా కాస్త శ్రద్ధ పెట్టాలి.

హ్యాపీ సెక్స్ లైఫ్ కోసం ఏం చేయాలి..

సెక్స్ కోరికను ప్రభావితం చేసేవి టెస్టోస్టిరాన్ హార్మోన్స్. ఈ హార్మోన్లు పెరగాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. సోయా, చేపలు వంటివి తీసుకోవాలి. పెరుగు, గుడ్లు తినాలి. అలాగే, సీజన్ పండ్లు, ధాన్యాలు, పీచు పదార్థాలు కలిగిన పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు వంటివి తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..