ఈ చెట్టు ఆకుల రసం అమృతమంట.. కొంచెం తాగితే చాలు ఈ రోగాలన్నీ దూరమైనట్లే..
బొప్పాయి పండు మాత్రమే కాదు, దాని ఆకులు కూడా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఆయుర్వేద నిపుణులు ప్రకారం.. బొప్పాయి మొక్కలోని ప్రతి భాగంలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల దీనిని అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు
బొప్పాయి చాలా సాధారణంగా అన్ని కాలాల్లో లభించే పండు.. ఈ రుచికరమైన పండులో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే.. బొప్పాయి పండు మాత్రమే కాదు , దాని ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. బొప్పాయి ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని.. ఇవి అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. బొప్పాయి ఆకుల జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..
బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
- బొప్పాయిలో పోషకాలు, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని ఫోలిక్ యాసిడ్ శరీరంలోని చెడు అమైనో ఆమ్లాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
- బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె ఉంటాయి. డెంగ్యూ వంటి జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు బొప్పాయి ఆకుల రసాన్ని తాగవచ్చు.. ఇది రక్తంలో ప్లేట్‌లెట్స్‌ను పెంచడానికి పని చేస్తుంది.
- బొప్పాయి మాదిరిగా, దాని ఆకు రసం కూడా మంచి జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల ఎంజైమ్‌లు వాపును తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో నీరు, పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో ఇవి బాగా సహాయపడుతాయి.
- బొప్పాయి ఆకులలో ఉండే పపైన్ తక్కువ ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. గాయాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
- జ్యూస్ చేసే ముందు.. బొప్పాయి తాజా ఆకులను శుభ్రంగా కడిగి మిక్సిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.. ఆ తర్వాత వడగట్టి తాగాలి.. (ఎక్కువగా తాగకూడదు) మితంగా మాత్రమే తీసుకోవాలి..
(గమనిక: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..