AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care: జుట్టు తెల్లబడటం మొదలైందా..కంగారు పడవద్దు..వెంటనే ఇలా చేయండి..

చాలామందికి జుట్టు తెల్లగా అయిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. అది క్రమేపీ మానసిక సమస్యగా కూడా పరిణమిస్తుంది. తెల్లగా మారిన జుట్టును మళ్లీ నల్లగా మార్చలేము.

Hair Care: జుట్టు తెల్లబడటం మొదలైందా..కంగారు పడవద్దు..వెంటనే ఇలా చేయండి..
Hair Care Tips
KVD Varma
|

Updated on: Dec 22, 2021 | 11:50 AM

Share

Hair Care: చాలామందికి జుట్టు తెల్లగా అయిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. అది క్రమేపీ మానసిక సమస్యగా కూడా పరిణమిస్తుంది. తెల్లగా మారిన జుట్టును మళ్లీ నల్లగా మార్చలేము. కానీ, మిగిలిన జుట్టు తెల్లబడకుండా మనం కొన్ని విధానాల ద్వారా జాగ్రత్తలు తీసుకోవచ్చు. నిపుణులు జుట్టు మరింత నేరిసిపోకుండా ఉండటం కోసం హోం రెమెడీస్ వివరంగా చెప్పారు. అవేమిటో తెలుసుకుందాం.

జుట్టు నెరిసిపోవడానికి సరైన కారణం ఇంకా స్పష్టంగా తెలుసుకోలేకపోయారు. వంశపారంపర్య కారణాల వల్ల లేదా రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల జుట్టు కూడా బూడిద రంగులోకి మారుతుందని వైద్యులు భావిస్తారు. విటమిన్ బి 12, విటమిన్ సి, ఇ లోపంతో పాటు, శరీరంలో జింక్, కాపర్ లోపం కూడా జుట్టు నెరసిపోవడానికి దారితీస్తుందని వారు నమ్ముతారు. జుట్టు తెల్లబడటాన్ని నివారించడానికి, అన్నింటి కన్నా మొదటి రెమిడీ.. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యం. పౌష్టికాహారాన్ని తినండి, తద్వారా శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు లభిస్తాయి. నారింజ, నిమ్మ, ద్రాక్ష, టమోటాలు, మొలకలు, ఆకు కూరలు వంటి సిట్రస్ పండ్లను ఆహారంలో చేర్చుకోండి. అంతే కాకుండా కొన్ని హోం రెమెడీస్ తీసుకోవడం ద్వారా కూడా జుట్టు నెరసిపోవడాన్ని అరికట్టవచ్చు.

ఉసిరి: ఉసిరికాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే, ఇది జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది. కాబట్టి రోజూ ఒక గ్లాసు నీటిలో ఒక ఉసిరికాయ రసాన్ని కలుపుకుని త్రాగాలి. ఎండిన ఉసిరికాయను ఇనుప బాణలిలో వేయించి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడిని హెన్నా పేస్ట్‌లో కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు తెల్లబడదు. జుట్టు నెరవడం ఆగుతుంది.

కెమికల్ బేస్డ్ హెయిర్ కలర్స్ వాడే వారు జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని రెగ్యులర్ గా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక చెంచా కొబ్బరినూనె, ఒక చెంచా ఆముదం మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. తర్వాత టవల్‌ను వేడి నీటిలో ముంచి, ఆ నీటిని బయటకు తీసి, వేడి టవల్‌ను తలకు తలకు చుట్టుకోవాలి. 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ ప్రక్రియను 3 లేదా 4 సార్లు పునరావృతం చేయాలి. ఇది జుట్టు, స్కాల్ప్ నూనెను బాగా పీల్చుకోవడానికి సహాయపడుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు నెరసిపోవడం ఆగిపోయి జుట్టు మృదువుగా.. ఆరోగ్యంగా మారుతుంది.

కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల వెంట్రుకల మూలాలు.. ఫోలికల్స్ బలపడతాయి. ఇవి బీటా-కెరోటిన్.. ప్రొటీన్లకు మంచి మూలాలు. జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కరివేపాకు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం, నెరవడం ఆగిపోతుంది. వాటిలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు A, B, C అలాగే E కూడా ఉన్నాయి. కరివేపాకు పేస్ట్‌ని జుట్టుకు పట్టించి, 20 నుంచి 30 నిమిషాల తర్వాత కడిగేయండి. జుట్టు నెరసిపోకుండా నిరోధించడానికి ఇది గ్రేట్ హోం రెమెడీ.

ఇవి కూడా చదవండి: Smart Phones: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త సంవత్సరంలో సంచలనం సృష్టించనున్న ఫోన్‌లు ఇవే!

Adar Poonawalla: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం వైపు సీరమ్ అధినేత చూపు.. ‘వాకౌ’లో 20 శాతం వాటా కొనుగోలు!

Amla Benefits: ఉసిరిని ఇలా తీసుకుంటే అద్భుతమైన రుచి.. అంతకు మించిన ఆరోగ్యం